Breaking News

భారీవర్షాలు

దంచికొడుతున్న వాన

దంచికొడుతున్న వాన

ఏకమైన వాగులు, వంకలు.. నిండుకుండలా చెరువులు, కుంటలు లోతట్టు ప్రాంతాలు జలమయం పలుచోట్ల వాగుల్లో కొట్టుకుపోయినవారిని కాపాడిన పోలీసులు సారథి ప్రతినిధి, జగిత్యాల/జగిత్యాల రూరల్/వేములవాడ/పెద్దశంకరంపేట/నాగర్​కర్నూల్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణమ్మ, గోదావరి నదుల్లోకి నీటి ఉధృతి పెరిగింది. రెండు రోజులుగా ఎడాతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. కుండపోత వర్షాలకు పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జగిత్యాల రూరల్ మండలం అనంతరం- గుల్లపేటవాగు పైనుంచి వెళ్తుండగా వరద ఉధృతికి కారు […]

Read More
వర్షాల వేళ అలర్ట్​గా ఉండండి

వర్షాల వేళ అలర్ట్​గా ఉండండి

సారథి, రామడుగు: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్​జిల్లా రామడుగు ఎస్సై తాండ్ర వివేక్ గురువారం సూచించారు. వర్షానికి తడిసిన విద్యుత్ స్తంభాలు, గోడలను తాకవద్దని, ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందన్నారు. గృహిణులు జే వైర్లపై బట్టలను ఆరవేయకూడదని హెచ్చరించారు. శిథిలావస్థలో ఉన్న మట్టి ఇళ్లు, గోడల మధ్య ఉండకూడదని కోరారు. ఇంటి ఆవరణలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. ఉరుములు, మెరుపులు, గాలిదుమారం సమయంలో ప్రజలు, […]

Read More
పునరావాస సహాయక చర్యలు ఆపొద్దు

పునరావాస సహాయక చర్యలు ఆపొద్దు

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో సహాయ పునరావాస కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నగరంలో జరుగుతున్న సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ‘భారీ వర్షాలు, వరదల వల్ల ఇండ్లలోకి నీరొచ్చి ఆహార పదార్ధాలు, దుస్తులు, చెద్దర్లు అన్నీ తడిసిపోయాయి. కనీసం వండుకుని తినే పరిస్థితుల్లో కూడా చాలా కుటుంబాలు లేవు. అందుకే వారికి తక్షణ సాయంగా ప్రతి బాధిత కుటుంబానికి రూ.10వేల చొప్పున […]

Read More
కృష్ణమ్మ ఉగ్రరూపం

కృష్ణమ్మ ఉగ్రరూపం

సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: రాష్ట్రంలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలో భారీవర్షాలు కురుస్తున్నందున జూరాలకు ప్రస్తుతం ఐదులక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. క్రమేణా ఇది మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. బ్యాక్ వాటర్ వల్ల ఈ దిగువ సూచించిన గ్రామాలు ప్రభావితం కావచ్చు. అందువల్ల నదీ పరివాహక గ్రామ ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శృతిఓఝా సూచించారు. ఇరిగేషన్, పంచాయతీ రాజ్, […]

Read More
వర్షాలకు వెయ్యి కోళ్లు మృత్యువాత

వర్షాలకు వెయ్యి కోళ్లు మృత్యువాత

సారథి న్యూస్, రామాయంపేట: కరోనా నేపథ్యంలో.. ఉన్న ఊరులోనే తన శక్తి మేర పెట్టుబడి పెట్టి ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆశపడ్డ ఓ యువకుడి ఆశలు అడియాసలయ్యాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు కోళ్ల షెడ్ లోకి చేరడంతో సుమారు వెయ్యి కోళ్లు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన మండలంలోని మెదక్​ జిల్లా రామాయంపేట చల్మెడ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సందర్భంగా షెడ్ నిర్వాహకుడు కరుణాకర్ మాట్లాడుతూ.. కరోనా కారణంగా ఎక్కడికి వెళ్లి ఉద్యోగం […]

Read More
సీఎం కేసీఆర్​ఉన్నత స్థాయి మీటింగ్​

సీఎం కేసీఆర్​ ఉన్నత స్థాయి మీటింగ్​

సారథి న్యూస్, హైదరాబాద్​: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని చర్చిస్తారు. తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉన్నందున, ఈ సమావేశానికి వచ్చే అధికారులు అన్ని వివరాలు తీసుకుని రావాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. మున్సిపల్, వ్యవసాయ, ఆర్అండ్ […]

Read More
బాధితులకు అండగా సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి

బాధితులకు అండగా సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి

సారథి న్యూస్, హయత్​నగర్: రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా హయత్​నగర్​డివిజన్ పరిధిలోని రంగనాయకులగుట్ట, బంజారాకాలనీ, అంబేద్కర్ కాలనీ, భగత్ సింగ్ కాలనీ లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాలా ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. టీడీపీ హయత్ నగర్ డివిజన్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో తరలి వెళ్లి వరద నీళ్లలో చిక్కిన బాధితులను తాడు సాయంతో ఎత్తు ప్రదేశానికి తరలించారు. బాధితులందరికీ పునరావాసం […]

Read More
చచ్చి బతుకుతున్నం..

చచ్చి బతుకుతున్నం..

వర్షాలకు ఇంట్లో నీటి ఊట ఇబ్బందుల్లో ఓ పేద కుటుంబం సారథి న్యూస్, మానవపాడు: ఇటీవల కురుస్తున్న భారీవర్షాలకు జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని మద్దూరు గ్రామంలో గఫూర్ ఇంటిలో నీటి ఊట ఊరుతోంది. ఇంట్లో మొత్తం అడుగు మేర నీళ్లు నిలిచాయి. ఇద్దరు పిల్లలతో కంటికి కునుకులేకుండా గడుపుతున్నామని భార్యాభర్తలు వాపోయాయి. ‘ప్రతిరోజు చస్తూ బతుకుతున్నాం. చిన్నవర్షం కురిసినా ఇంట్లో నీళ్లు ఊరుతున్నాయి. ఎవరూ మమ్మల్ని పట్టించుకునేవారు లేరు. ఇద్దరు పిల్లలతో నరకం […]

Read More