Breaking News

WORKS

డ్రైనేజీ పనులు ప్రారంభం

డ్రైనేజీ పనులు ప్రారంభం

సామాజిక సారథి, రామకృష్ణాపూర్: డ్రైనేజీ పనుల ప్రారంభించినట్లు మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని 17, 19 వార్డుల్లోని శ్రీనివాస్ నగర్, అబ్రహం నగర్ లో డ్రైనేజీ పనులు ప్రారంభించామని తెలిపారు. కాంట్రాక్టర్లు మున్సిపాలిటీ పరిధిలో చేపట్లే పలు అభివృద్ది పనుల్లో వేగం పెంచడంతో పాటు నాణ్యత ప్రమాణాలను పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, […]

Read More

పనుల్లో వేగం పెంచండి

సారథి న్యూస్, రామగుండం: మేడిపల్లి ఓపెన్ క్లాస్ ప్రాజెక్టు లో జరుగుతున్న పనులను సింగరేణి సంస్థ డైరెక్టర్ ఆపరేషన్ ఎస్ చంద్రశేఖర్ శనివారం ఆకస్మికంగా తనిఖీచేశారు. బొగ్గు వెలికితీత, ఓబీ వెలికితీసి బ్లాస్టింగ్ ఆపరేషన్ గ్యాలరీ పీని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆర్ జి ఎన్ జి ఎం కె నారాయణ, ప్రాజెక్ట్ ఆఫీసర్ సత్యనారాయణ, మేనేజర్ గోవిందరావు, సర్వే ఆఫీసర్ ఎండి సలీం, ప్రాజెక్ట్ ఇంచార్జ్ వెంకటేశ్వరరావు, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, అధికారులు పాల్గొన్నారు,

Read More

తరగతులు ఆన్​లైన్​లో.. పిల్లలు కూలీపనుల్లో

సారథిన్యూస్​, గద్వాల: రాష్ట్ర విద్యాశాఖ విద్యార్థులకు ఆన్​లైన్​లో పాఠాలు బోధిస్తున్నామని చెబుతుండగా.. కొందరు విద్యార్థులు మాత్రం కూలీ పనులకు వెళ్తున్నారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఆన్​లైన్​ పాఠాలు ప్రారంభించింది. అయినప్పటికి విద్యార్థులకు సరైన గైడెన్స్​ ఇచ్చేవారు లేక వారు యథావిధిగా పొలంపనులకు వెళ్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో విద్యార్థులు ఓ వాహనంలో ఇలా కూలిపనులకు వెళ్తున్నారు.

Read More

సకాలంలో పనులు పూర్తిచేయండి

సారథిన్యూస్​, వరంగల్ అర్బన్: వరంగల్​ నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం చేపడుతున్న పనులను సకాలంలో పూర్తిచేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ అరవింద్​ కుమార్​ అధికారులను ఆదేశించారు. మంగళవారం వారు వరంగల్​లో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, నగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతీ, కుడా […]

Read More

పనుల్లో వేగం పెంచండి

సారథిన్యూస్​, వరంగల్ అర్బన్: సకాలంలో పనులు పూర్తిచేయకపోతే ఉపేక్షించేది లేదని వరంగల్​ అర్బన్​ కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. జిల్లా లో వైకుంఠ దామాలు, కంపోస్టు ( సెగ్రిగేశాన్) షెడ్లు నిర్మాణా పనులను జూలై చివరి వరకు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆరో విడత హరిత హరంలో భాగంగా హసన్ పర్తి మండలం పెంబర్తి గ్రామ శివారు ఆయన మాట్లాడారు.

Read More

అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయం

సారథి న్యూస్, గంగాధర: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కాసారం గ్రామంలో నిర్మించనున్న పద్మశాలి సంఘ భవనం, మహిళా సంఘం, ఎస్సీ కమ్యూనిటీహాల్ పనులకు బుధవారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని పేర్కొన్నారు.

Read More