సారథి న్యూస్ : రుతుపవనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే సాధారణం కంటే వర్షపాతం నమోదైంది. పలు చోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా రాయలసీమలో ఈ సారి వర్షాల తీవ్రత అధికంగానే ఉంది. కాగా నేటి నుంచి అయిదు రోజుల పాటు తెలంగాణ, కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఈ రోజు, రేపు ఉరుములతో కూడిన భారీ […]
సారథిన్యూస్, వికారాబాద్: శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వికారాబాద్ జిల్లా కొండంగల్- తాండూరు రహదారిపై వంతెన తెగిపోయింది. కాగ్నా నదిపై ఉన్న ఈ బ్రిడ్జి కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు భారీ వర్షంతో తాండూరు నియోజకవర్గంలోని పంటపొలాలు నీట మునిగాయి. పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండాయి.
సారథి న్యూస్, రామాయంపేట: ప్రస్తుత వానాకాలంలో రైతులు సాగు చేస్తున్న వరినారు మళ్లలో మొగి పరుగు సోకిందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. గురువారం వారు మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో వరినారును పరిశీలించారు. మొగి పురుగు నివారణకు కార్బోఫ్యూరన్ లేదా కార్టప్హైడ్రోక్లోరైడ్ గుళికలను నారుమళ్లలో చల్లుకోవాలని నిజాంపేట వ్యవసాయాధికారి సతీశ్ తెలిపారు. నారుమళ్లలో సూక్ష్మధాతు లోపాలు గమనిస్తే ఫార్ములా 4ను పిచికారి చేసుకోవాలని సూచించారు.
సారథి న్యూస్, హుస్నాబాద్: వర్షాలు కురవాలని గ్రామస్తులు, రైతులు బుధవారం మండలంలోని మాలపల్లిలో గ్రామదేవతలకు జలాభిషేకం చేశారు. సర్పంచ్ బత్తల మల్లయ్య మాట్లాడుతూ విత్తనాలు పెట్టి రోజులు దాటినా సరైన వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. జలాభిషేకం చేస్తే వరుణుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడనే నమ్మకంతో పోచమ్మ, ఎల్లమ్మ, దుర్గమ్మ, మైసమ్మ, ఆంజనేయస్వామి విగ్రహాలకు జలాభిషేకం, ప్రత్యేక పూజలు చేశామని చెప్పారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డుసభ్యులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.
సారథి న్యూస్, చొప్పదండి: గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రమాంలోని శివారుప్రాంతం నుంచి సాంబయ్యపల్లి వెళ్లే కమాన్వరకు తారు రోడ్డు లేకపోవడంతో మట్టిరోడ్డు గుంతలుగా మారింది. గాయత్రి పంప్ హౌస్ నిర్మాణం కోసం నిత్యం కంకర సరఫరా చేసే లారీలతో రద్దీగా మారడంతో రోడ్డంతా గుంతల మయం అయింది. దీంతో ఎప్పుడ ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. గతంలోనూ ఈ రోడ్డుపై అనేకప్రమాదాలు జరిగాయి. అధికారులు దృష్టిసారించి […]
సారథిన్యూస్, నారాయణఖేడ్: మెదక్ జిల్లా కంగ్టి మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం మోస్తరు వర్షం కురిసింది. గత వారం రోజులు క్రితం రైతులు తమ పొలాల్లో విత్తనాలు వేశారు. వర్షం రాకపోవడంతో నిరాశలో ఉన్న రైతులకు ప్రస్తుతం కురిసిన వర్షంతో ఆశలు చిగురించాయి. పత్తి, కందులు, పేసర్లు, మినుములు, సొయా వంటి పంటలకు ఈ వర్షం ప్రాణం పోసిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
సారథిన్యూస్, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ఆగమనంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.. ఈ నెల 1న కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు.. 10 రోజుల తర్వాత గురువారం ఉదయం పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లోకి ప్రవేశించాయి. మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు దగ్గరలో ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ ఎత్తు […]
సారథి న్యూస్, హైదరాబాద్: వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నిన్నటిమొన్నటి వరకు భరించలేని ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన హైదరాబాద్ మహా నగరవాసులకు కాసింత ఉపశమనం దొరికింది. నైరుతి రుతుపవనాల రాక నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురిసింది. ఈదురుగాలులకు పైకప్పు రేకులు లేచిపోయాయి. ఎల్బీ నగర్, వనస్థలిపురం, తార్నాక, బంజారాహిల్స్, హయత్ నగర్, తుర్కయంజాల్, నల్లకుంట, ఎల్బీనగర్, అంబర్పేట, కీసర, మాల్కాజ్గిరి, చంపాపేట, తార్నాక, హబ్సిగూడ, సరూర్నగర్ తదితర ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. అలాగే […]