Breaking News

PEOPLE

భక్తులెవరూ అయోధ్యకు రావొద్దు

అయోధ్య: కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత సమయంలో భక్తులెవరూ అయోధ్యకు రావొద్దని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్​ సెక్రటరీ చంపత్​ రాయ్​ కోరారు. ఆగస్టు 5న అయోధ్యలో రామమందిర శంకుస్థాపన జరుగుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో చంపత్​ రాయ్​ ఈ ప్రకటన చేశారు. దేశంలోని భక్తులందరూ తమ ఇంట్లోనే ఆరోజు పూజలు చేసుకోవాలని సూచించారు. రామమందిర శంకుస్థాపన చరిత్రలో నిలిచిపోతుందని ఆయన చెప్పారు. కరోనా విపత్తువేళ కేవలం పరిమితమైన సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించినట్టు ఆయన చెప్పారు.

Read More

తెలంగాణ‌లో డేంజర్​ బెల్స్​

సారథిన్యూస్​, హైదరాబాద్: తెలంగాణ‌లో క‌రోనావైర‌స్ డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి స్టేజ్ 3కి చేరుకుంద‌ని, క‌మ్యూనిటీ స్ప్రేడ్ అవుతుంద‌ని సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించారు తెలంగాణ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావు. వ‌చ్చే నాలుగు-ఐదు వారాలు చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, ప్ర‌జ‌లంతా మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ఇక‌, రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి న‌గ‌రాల్లో కూడా క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయ‌న్న శ్రీ‌నివాస‌రావు ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన స‌మ‌యం అన్నారు. ల‌క్ష‌ణాలు లేనివారు క‌రోనా టెస్ట్‌ల […]

Read More

ఇంత అమానుషమా

సారథిన్యూస్​, జోగుళాంబ గద్వాల: కరోనా విపత్తువేళ మనుషులల్లో మానవత్వం మంటగలుస్తున్నది. సన్నిహితులు, కుటుంబసభ్యులు, కన్నవాళ్లు, తోబుట్టువుల పట్ల కూడా అమానుషంగా వ్యవహరిస్తున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురంలో ఓ వ్యక్తి (35) చనిపోగా.. కరోనాతో మరణించాడేమోనన్న అనుమానంతో అతడి మృతదేహాన్ని ప్రొక్లెయిన్​లో తీసుకెళ్లి ఖననం చేశారు కుటుంబసభ్యులు. చనిపోయిన వ్యక్తికి కరోన లేదని వైద్యులు నిర్ధారించినప్పటికి కొందరు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు.

Read More

రామడుగులో కరోనా కలకలం

సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని వెదిర గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. దీంతో రామడుగు మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెదిర గ్రామంలో మంగళవారం శానిటైజేషన్​ నిర్వహించారు. గ్రామంలోని విధులను శుభ్రపరిచారు. ప్రజలంతా సామాజికదూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు.

Read More

కల్వర్టులు లేక కష్టాలు

సారథి న్యూస్,​ బెజ్జంకి: రహదారులపై కల్వర్టులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యువజన కాంగ్రెస్​ నేత పోతిరెడ్డి రాజశేఖర్​రెడ్డి ఆరోపించారు. వర్షాకాలంలో కురిసిన భారీవర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగి పొర్లుతున్నాయన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని తాళ్లపల్లి, గూడెం, వడ్లూర్, బేగంపేట్, లక్ష్మీపూర్, ఎల్లంపల్లి, తలారివానిపల్లి గ్రామాలకు వెళ్లేదారుల్లో కల్వర్టులు లేక రాత్రివేళల్లో ప్రజలు అనేక రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి కల్వర్టులు నిర్మించాలని డిమాండ్​ చేశారు.

Read More
షార్ట్ న్యూస్

భయపెట్టిన భారీ తాచు

కోయంబత్తూరు: తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు సమీపంలోని ఓ గ్రామంలోకి 15 అడుగుల భారీ తాచుపాము వచ్చింది. దీంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రామంలోని కొందరు యువకులు ఆ పామును చంపేందుకు యత్నించగా వారికి చిక్కలేదు. దీంతో అటవీఅధికారులను సమాచారమిచ్చారు. అధికారులు గ్రామానికి చేరుకొని ఆ పామును సజీవంగా బంధించారు. అనంతరం సమీపంలోని సిరువాని అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్​ అవుతున్నది.

Read More

పల్లెల్లోనూ జాగ్రత్త అవసరం

సారథిన్యూస్, రామడుగు: జీహెచ్​ఎంసీలో కరోనా విజృంభిస్తుండటంతో హైదరాబాద్​లోని ప్రజలంతా పల్లెలకు వస్తున్నారు. ఈ క్రమంలో కరోనా పల్లెలకు కూడా పాకే అవకాశం ఉన్నదని.. అందువల్ల గ్రామీణప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం రంగసాయిపల్లిలో గ్రామానికి చెందిన యువకులు కరోనాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. దుకాణాల వద్ద, రచ్చబండ వద్ద ప్రజలు గుంపులుగా ఉండొద్దని, అనవసరంగా గ్రామంలో తిరుగొద్దని సూచించారు. అనవరంగా మాస్కులేకుండా […]

Read More

నవంబర్​ వరకూ ఉచిత రేషన్​

న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబర్​ వరకు ప్రజలకు ఉచితంగా రేషన్​ అందజేస్తామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. వన్​ నేషన్​.. వన్​ రేషన్​ కింద దేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్న పేదలైనా ప్రభుత్వ సాయం పొందవచ్చని చెప్పారు. వలస కూలీలను దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని ప్రవేశపెడుతుమన్నారు. రేషన్​ కార్డు ఉన్న నిరుపేదలందరికీ నెలకు 5 కిలోల బియ్యం, గోధుమలు, కిలో కందిపప్పు అందజేస్తామని చెప్పారు. 80 కోట్లమంది ఈ పథకం కింద లబ్ధి పొందుతారని ప్రధాని చెప్పారు. […]

Read More