సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల సమరానికి తెలంగాణ రాష్ట్రంలో నేటితో ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది. నాలుగో విడతలో భాగంగా సోమవారం తెలంగాణ రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలలో పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి నేటి సాయంత్రంతో ప్రచార గడువు ముగుస్తుండటంతో అభ్యర్థులు పోల్ మేనేజ్ మెంట్ పైన దృష్టిపెట్టనున్నారు. దీనికి ఆదివారం ఒక్కరోజు కీలక కావడంతో ఏయే నియోజకవర్గాల్లో ఏ వ్యూహాలను అనుసరించాలి, ఎక్కడెక్కడ తమకు అనుకూలంగా లేని పరిస్థితులను మార్చుకోవాలన్న దానిపై దృష్టిసారించారు. […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవిపై కేడర్ లో అసహనం వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గ్రామాల్లో తిరగనీయకుండా కార్యకర్తలపై దాడిచేసి వాళ్లను తిరిగి మళ్లీ ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం పట్ల పలు నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. ఇలా చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగే కంటే కీడు ఎక్కువగా జరుగుతుందని, పార్టీ […]
సామాజికసారథి, కొడంగల్/నాగర్ కర్నూల్ బ్యూరో: పాలమూరుకు కేసీఆర్ తీరని అన్యాయం చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కమీషన్ల కక్కుర్తితో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా ఉందన్నారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, రాజోలిబండ, తుమ్మిళ్ల ప్రాజెక్టుల వద్ద కుర్చీ వేసుకుని పనులు పూర్తిచేస్తానని చెప్పిన కేసీఆర్.. సీఎం అయిన తర్వాత ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు. మంగళవారం నారాయణపేట జిల్లా మద్దూరులో కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్యనాయకుల సమావేశంలో […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈలోపే ఆయా పార్టీల్లో లుకలుకలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేస్తున్న మల్లు రవి ప్రచారంలో కాస్త వెనకబడ్డారని చెప్పొచ్చు. బుధవారం నిర్వహించిన రోడ్ షో అట్టర్ ప్లాప్ అయింది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఎస్సీల్లో మెజారిటీ అయిన మాదిగల ఓట్లు 3.80 లక్షలకు పైగా ఉండగా మాలల […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: ఎస్సీ వర్గీకరణపై నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఎస్సీలను కాంగ్రెస్, బీజేపీలు మోసం చేశాయని విమర్శించారు. శనివారం ఆయన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో మీడియాతో మాట్లాడారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పదేళ్లలో ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కనీసం ఒక ఆర్డినెన్స్ ను కూడా తీసుకురాలేకపోయారని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేశారా? ప్రజలకు చెప్పాలని […]
‘సామాజికసారథి’ క్యాలెండర్ల ఆవిష్కరణలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్ రెడ్డి సామాజికసారథి, హైదరాబాద్ బ్యూరో: ‘సామాజికసారథి తెలుగు’ దినపత్రిక 2024 సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేశ్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, పత్రికలు ప్రజాపక్షం వహించాలని కోరారు. స్వాతంత్రోద్యమ కాలం నుంచి ఎందరో మహనీయులు పత్రికల ద్వారా ప్రజల్లో […]
నాగర్ కర్నూల్ అసెంబ్లీలో గుర్తుల కేటాయింపు..!
కూచుకుల్ల కుటుంబాని కా….? లేక జనార్ధనులకే నా….? #పదేండ్ల అవినీతి అహంకారానికి పట్టమా….? #లేక ప్రజలు కోరుకుంటున్న నూతన నాయకుడికి పట్టాభిషేకమా…? నాగర్ కర్నూలు జిల్లా లో అడుగడుగునా అధికార పార్టీపై ప్రజావ్యతిరేకత.సామాజిక సారథి , నాగర్ కర్నూల్: ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు వరకు రాష్ట్రంలో ఎంతో ప్రజాధారణ కనిపించిన బిఆర్ఎస్ పార్టీకి నేడు ఒక్కసారిగ ప్రజాదరణ కరువైంది.అలాంటిదే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా ఏకచిత్రాధిపత్యంగా వ్యవహరిస్తున్న బిఆర్ఎస్ నాయకులు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ […]