Breaking News

నాగర్ కర్నూలు గడ్డ….. ఎవరికి అడ్డా….!

కూచుకుల్ల కుటుంబాని కా….?

లేక

జనార్ధనులకే నా….?

#పదేండ్ల అవినీతి అహంకారానికి పట్టమా….?

#లేక ప్రజలు కోరుకుంటున్న నూతన నాయకుడికి పట్టాభిషేకమా…?

నాగర్ కర్నూలు జిల్లా లో అడుగడుగునా అధికార పార్టీపై ప్రజావ్యతిరేకత.
సామాజిక సారథి , నాగర్ కర్నూల్: ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు వరకు రాష్ట్రంలో ఎంతో ప్రజాధారణ కనిపించిన బిఆర్ఎస్ పార్టీకి నేడు ఒక్కసారిగ ప్రజాదరణ కరువైంది.అలాంటిదే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా ఏకచిత్రాధిపత్యంగా వ్యవహరిస్తున్న బిఆర్ఎస్ నాయకులు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి నేడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అడుగడుగున వ్యతిరేకత ఎందుకొచ్చింది.దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు అవుతున్న కూడా …నేడు ఎన్నికల సమయంలో బి ఆర్ ఎస్ పార్టీకి ప్రజల ఓట్లను ఎందుకు దూరం చేసుకుంటుంది.

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది ..
పదేళ్లు పాలించిన మర్రి జనార్దన్ రెడ్డి నేడు ఒక్కసారిగా ప్రజాదారణ కోల్పోయి ప్రజల వ్యతిరేకత రావడానికి ఒకటే కారణం.
పెద్దలు చెప్పిన సామెత నేడు అచ్చం అచ్చు గుద్దినట్టు ఇక్కడ సరిపోతుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అన్న సామెత మాదిరిగా.
గత ఎన్నికల్లో ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటాను అని కల్లబొల్లి మాటలు చెప్పిన మర్రి జనార్దన్ రెడ్డి నేడు ప్రతి గ్రామంలో కూడా తన నోటి దురుసు ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల ప్రచారాల వేల అపోజిషన్ పార్టీలు వ్యతిరేకత చూపించడం సాధారణమైన విషయమే. కానీ దానికి వ్యతిరేకంగా తన నోటికి పదును పెట్టి ప్రజలను అపోజిషన్ పార్టీలను అందర్నీ తన నోటి దూరసుతో దూషించడంతో నియోజకవర్గంలో మరి జనార్దన్ రెడ్డి మాటలపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారమే సాగింది.

కాల్చిపడేస్తానంటూ…

పోలీస్ కేసులు పెట్టి బెదిరిస్తూ ప్రజల ప్రేమను ఎలా పొందుతాను అనే లాజిక్ మరిచిపోయాడు. అని ప్రజలు అంటున్నారు .గత ఎన్నికల్లో ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటానని ఓట్లు అడిగి రెండుసార్లు గెలిచిన మర్రి జనార్దన్ రెడ్డి నేడు నాకు ఓటు వేయకుంటే ఖబడ్దార్ అన్నట్లుగా నియోజకవర్గంలో వ్యవహరిస్తున్నాడు. అని సొంత పార్టీ కార్యకర్త లే గుస గుసలు పెట్టారు.అధికార పార్టీ నాయకుడు తీరు ఈ విధంగా ఉంది.మరోవైపు ప్రతిపక్షంలో ఉన్న కొత్త లీడర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి తీరును కూడా నియోజకవర్గ ఓటర్లు గమనిస్తున్నారు.


మచ్చ లేని నాయకుడి గా కుచ్చుకుల్ల కుటుంబం…
ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి నుంచి నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు కూచుకుల్ల కుటుంబానికి మచ్చలేని రాజకీయ నాయకుల కుటుంబంగా గుర్తింపు సంపాదించారు.రాజకీయంగా కూచుకుల్ల కుటుంబం వల్ల లబ్ధి పొందిన నాయకులే ఉన్నారు కానీ నష్టపోయిన ఏ రాజకీయ నాయకుడు కానీ ప్రజలు కానీ లేరు.నో రెత్తి పళ్ళెత్తి మాట కూడా ఎవరిని దూషించని నాయకుడు కుచ్చుకుల్ల దామోదర్ రెడ్డి.30 ఏళ్లు రాజకీయ పోరాటం చేస్తూ వచ్చిన రాజకీయ నాయకులు జిత్తులు ఆయనకు తెలువదు.మాట ఇస్తే ఆ మాట కోసం ఎంతవరకైనా కట్టుబడి ఉండే కుటుంబం కూచుకుల్ల దామోదర్ రెడ్డి కుటుంబం.నేడు అలాంటి నికాసైనా నిజాయితీ కి మారుపేరైన కూచుకుల్ల కుటుంబం నుంచి దామోదర్ రెడ్డి వారసుడిగా డాక్టర్ రాజేష్ రెడ్డి నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ప్రజాసేవకై కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజలలో తిరుగుతున్నారు.

నాగర్ కర్నూల్ నియోజకవర్గం ప్రజలు తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే అవినీతి లేని అభివృద్ధి చేసి చూపిస్తానంటున్నారు.నాగర్ కర్నూల్ ఓటర్లు గౌరవంగా ధైర్యంగా తలెత్తుకొని తిరగాలంటే తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ ప్రజల కల నిజమవుతుందని ప్రచారం చేసుకుంటున్నారు.తన వారసుడు గెలుపు కోసం దామోదర్ రెడ్డి కూడా తన వ్యవహార శైలిని ప్రజల ముందు వ్యక్తపరుస్తున్నారు.ఒక్కరి వద్ద కూడా ఒక్క రూపాయి కూడా బ్లాక్ మెయిల్ చేసి వసూలు చేసిన రాజకీయ చరిత్ర నాకు లేదని ఎవరిని కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ కేసులు పెట్టి వేధించలేదని అధికారమున్నప్పటికీ దానిని దుర్వినియోగం చేయలేదని కూచుకుల్ల దామోదర్ రెడ్డి అంటున్నారు.ఇదంతా రాజకీయ నాయకుల ఒకవైపు ప్రచారం మరోవైపు ఓటరు నాడి మరో 15 రోజులు గడిస్తే తప్ప తెలవని పరిస్థితి నెలకొంది.

చూద్దాం మరి పాత నాయకుడివైపు…

లేక కొత్త నాయకుడికి పట్టాభిషేకమా వేచి చూద్దాం డిసెంబర్ 3 తారీకు వరకు..