ఢిల్లీ: ఏఐసీసీ ( ఆల్ఇండియా కాంగ్రెస్ కమిటీ) కొత్త అధ్యక్షులు ఎవరు అన్నదానిపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం సీడబ్ల్యూసీ ( కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) సమావేశమైంది. ఈ సమావేశం అనంతరం కొత్త అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని సమచారం. అయితే సమావేశంలో పలు ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. అధ్యక్షురాలిగా తాను కొనసాగలేనని సోనియాగాంధీ తేల్చిచెప్పనట్టు సమాచారం. ఈ భేటీపై కాంగ్రెస్ శ్రేణులే […]
సారథిమీడియా, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలను పరిష్కరించేందుకు ఈ నెల 25 న ఏర్పాటు చేయాలనుకున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు లేఖలు పంపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన […]
సారథి న్యూస్, పెద్ద శంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలకేంద్రంలో నాలుగు చోట్ల మాత్రమే వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని మండల పరిషత్ అధ్యక్షుడు జంగం శ్రీనివాస్ సూచించారు. ఈ మేరకు తీర్మానం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఆయాగ్రామాల్లో ప్రజలంతా కలిసి ఓకేచోట వినాయకుడిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మంగళవారం పెద్దశంకరంపేటలోని పోలీస్‌స్టేషన్‌లో వినాయకమంటపాల ఏర్పాటుపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. పెద్దశంకరంపేటలోని శ్రీరామ్ మందిర్, ప్రభుమందిర్, విట్టలేశ్వరమందిర్, మార్కండేయ మందిర్‌లో వినాయక విగ్రహాలను ఏర్పాటు […]
ఢిల్లీ: ప్లాస్మా థెరపీతో ఏ విధమైన ప్రయోజనం లేదని.. ఈ విధానంతో మరణాలను తగ్గించలేకపోతున్నామని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎయిమ్స్ చేసిన ప్రాథమిక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని చెప్పారు. బుధవారం ఢిల్లీలో నేషనల్ క్లినికల్ గ్రాండ్ రౌండ్స్ ‘కరోనా కట్టడిలో ప్లాస్మా థెరపీ పాత్ర’ అనే అంశంపై చర్చ జరిగింది. ఈ సదస్సులో గులేరియా మాట్లాడారు. ఎయిమ్స్‌లో జరిపిన ర్యాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయిల్స్‌లో ఈ విషయం వెల్లడైందన్నారు. ఎయిమ్స్‌లో 30 […]
సారథిన్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని వికేంద్రీకరణకు ప్రజామోదం లేదని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ విమర్శించారు. సీఎం జగన్ ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా సొంతంగా ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ఆదివారం జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రతినిధులతో పవన్ కల్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. అమరావతిలో అవినీతి జరిగితే విచారణ జరిపి దోషులను శిక్షించాలి. అంతే కానీ రాజధానిని మార్చడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారగానే రాజధానులు […]
సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రతి గ్రామంలోనూ 50 కల్లాలు నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన డివిజన్ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పంచాయితీ సెక్రటరీలు నెలలో 3రోజులు అనుమతి లేకుండా విధులకు గైర్హాజతే సస్పెన్షన్ తప్పదని హెచ్చరించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, డీఆర్డీవో గోపాల్ రావు, డీపీవో సురేశ్, డీఎఫ్ వో శ్రీధర్, ఆర్డీవో […]