సామాజిక సారథి, నల్లగొండ: హైదరాబాద్ లోని తార్నాకలో సెయింట్ ఆన్స్ జనరేట్ కేంద్రంలో నిర్వహించనున్న బీసీ యువజన సదస్సును విజయవంతం చేయాలని ఆ సదస్సు ప్రతినిధులు డా.బాల శ్రీనివాస్, అంకం జయప్రకాష్, నక్కా నర్సింహ యాదవ్ కోరారు. పూలే అంబేద్కర్ ఆలోచనా సమితి, తెలంగాణ డిగ్రీ కళాశాల అసోసియేషన్ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 27,28 వ తేదీలలో నిర్వహిచే దస్సుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను నల్లగొండ జిల్లా కేంద్రంలో బీసీ యువజన సంక్షేమ సంఘం కమిటీని […]
మానోపాడు: ఒకవైపు కరోనా మహమ్మారి ఇంకా ప్రబలుతుంటే కొందరేమో సామాజిక దూరం, మాస్కు ధరించకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానోపాడు మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు దగ్గర బ్యాంకు రుణాలపై మహిళా సంఘాలకు, సమైక్య అధికారులు ఎస్బీఐ బ్యాంక్ సిబ్బంది అవగాహన కల్పించారు. అయితే ఈ సమావేశానికి100 మంది దాకా హాజరయ్యారు. అయితే వారేవరూ మాస్కు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడంతో విమర్శలు వస్తున్నాయి.
సారథి న్యూస్, నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ని చిల్డ్రన్ పార్కు లో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడంపై ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. కబ్జాచేసేందుకు కుట్రపన్నుతున్నారని ఆక్షేపించారు. శుక్రవారం నర్సాపూర్ ఎంపీడీవో ఆఫీసులో ఎంపీపీ జ్యోతిసురేష్ నాయక్ అధ్యక్షతన జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ.. నర్సాపూర్ చెరువులో పెద్దఎత్తున ఇసుకను తవ్వుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. పేదలు ఇంటి బాత్రూమ్ను కట్టుకోవడానికి ట్రాక్టర్ […]
సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిషత్లో శనివారం నిర్వహించిన సర్వసభ్యసమావేశంలో తీవ్ర దుమారం చెలరేగింది. వాగ్వాదాలు, సవాళ్లు, చాలెంజ్ విసురుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఒకరిమీదకు ఒకరూ కొట్టుకొనే స్థాయికి వెళ్లారు. సమావేశమంతా రసాబాసగా మారింది. ‘లక్షలు రూపాయలు అప్పులు తీసుకొచ్చి పనులు చేస్తుంటే.. మిషన్ భగీరథ ఏఈ రాఘవేంద్రరావు బిల్లులు చేయకుండా వేధిస్తున్నారని.. ఆయన లంచాలకు మరిగారని బిజినేపల్లి సర్పంచ్ బాల్ ఈశ్వర్ ధ్వజమెత్తారు. దీనిపై ఏఈ రాఘవేంద్రరావు కూడా తీవ్రంగా స్పందించారు. […]
ఢిల్లీ: నీట్, జేఈఈను ఆపాలంటూ విపక్షాలు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నాయి. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి ఈ పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. బుధవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ విపక్ష పార్టీల సీఎంలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నీట్, జేఈఈ అంశాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. ఆమె మొదటి నుంచి ఈ పరీక్షలను రద్దు చేయాలని కోరుతున్నారు. ఇటీవలే ప్రధాని మోడీకి లేఖ […]
ఢిల్లీ: కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగకుండానే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ ముగిసింది. తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీనే కొనసాగించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నది. సోమవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలోనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని ఊహాగానాలు వెల్లువెత్తడంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అయితే పలు నాటకీయ పరిణామాల మధ్య సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. సోనియాగాంధీ పేరును పార్టీ సీనియర్ నాయకులు మన్మోహన్ […]
న్యూఢిల్లీ: ఎప్పడు ప్రశాంతంగా ఉండే రాహుల్ గాంధీ ఒక్కసారిగా తీవ్ర ఆవేశానికి లోనయ్యారు. సొంతపార్టీలోని సీనియర్ నేతలను కడిగిపారేశారు. వారిపై తీవ్రకోపం ప్రదర్శించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీడబ్ల్యూసీ (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ) సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్లో పాల్గొన్న రాహుల్.. 23 మంది సీనియర్లు నేరుగా సోనియాగాంధీకి లేఖ రాయడం.. దాన్ని మీడియాకు విడుదల చేయడంపై ఫైర్ అయ్యినట్టు సమాచారం. ‘సోనియాగాంధీ అనారోగ్యంతో ఉండి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సమయంలో మీరు లేఖ ఎందుకు […]
న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం వాడీవేడిగా సాగుతున్నది. బహిరంగ లేఖ విషయంపై రాహుల్ గాంధీ సీనియర్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో రాహుల్ వైఖరిపై సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. ఓ దశలో వారిద్దరూ రాజీనామాకు సిద్ధపడ్డట్టు జాతీయమీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహిస్తున్న […]