Breaking News

HOSPITAL

వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ కరోనా

వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ కరోనా

సామాజిక సారథి, వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. అనేక మంది సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ బత్తుల శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం శ్రీనివాస్ హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. సూపరింటెండెంట్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

Read More

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు

సారథి న్యూస్​, గద్వాల​: ఓకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్​లో సోమవారం చోటుచేసుకుంది. మల్దకల్ గ్రామానికి చెందిన నాగరాజు భార్య జాహ్నవికి నాలుగేండ్ల క్రితం మొదటి కాన్పులో మగపిల్లవాడు జన్మించాడు. రెండవ కాన్పు కోసం శనివారం కర్నూల్లోని బాలాజీ యశోద నర్సింగ్ హోంలో చేరగా.. ఆమెకు ఈ కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు జన్మించారని తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం తల్లి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు.

Read More

కేటీఆర్​ కుమారుడు హిమాన్ష్​కు గాయాలు!

సీఎం కేసీఆర్​ మనవడు, కేటీఆర్​ కుమారుడు కల్వకుంట్ల హిమాన్ష్​కు గాయాలైనట్టు సమాచారం. ఆయన ఎడమకాలు, తుంటి వద్ద గాయం కావడంతో సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేర్పించారు. అయితే కాలు విరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హిమాన్ష్​ గుర్రం స్వారీ చేస్తుండగా కిందపడ్డాడని సమాచారం. హిమాన్ష్​ తన ఇంట్లోని బాత్​రూంలో జారిపడ్డారని మరికొందరు చెబుతున్నారు. అవన్నీ రూమర్స్​ నాకేం కాలేదు! ఈ వార్తలపై హిమాన్ష్​ స్పందించారు. ‘ నాకు కాలు విరిగిందని.. నడవలేకపోతున్నానని కొన్ని వార్తా పత్రికలు రాశాయి. అవన్నీ […]

Read More

ప్రణబ్​ ముఖర్జీ కన్నుమూత

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ముఖర్జీ (84) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కరోనాతో ఈ నెల 10న ఆయన ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరినప్పటినుంచి ప్రణబ్​ ఆరోగ్యం విషమంగానే ఉన్నది. ఆయనకు ఊపిరితిత్తుల్లో తీవ్ర ఇన్​ఫెక్షన్​ అయినట్టు ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆయనను కాపాడేందుకు ఎంతో ప్రయత్నించామని చెప్పారు. ఆయన ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి కోమాలోనే ఉన్నారు. ప్రణబ్​ మృతికి ప్రధాని మోదీ, కాంగ్రెస్​ అధినేత్రి సోనియా, యువనేత […]

Read More

ఎమ్మెల్యే భూమనకు కరోనా

సారథిన్యూస్​, తిరుపతి: వెఎస్సార్​ కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్​రెడ్డికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఇటీవల భూమన కరుణాకర్​రెడ్డి కరోనాపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. కోవిడ్‌ సమన్వయ కమిటీ చైర్మన్‌గా ఉన్న భూమన.. కరోనా బారిన పడి మృతిచెందిన వారికి స్వయంగా అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు భూమన త్వరగా కోలుకోవాలని వైసీపీ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.

Read More

ఆపదలో ఉన్నాం.. ఆదుకోండి

సారథిన్యూస్, రామడుగు: రోడ్డు ప్రమాదం అతడి జీవితాన్ని అతలాకుతలం చేసింది. తనను నమ్ముకున్న భార్యా, బిడ్డలను రోడ్డున పడేసింది. పనిచేసుకుంటే గానీ పూటగడవని ఆ కుటుంబానికి ఇప్పడు పెద్దకష్టమే వచ్చి పడింది. దాతలు ముందుకొచ్చి తమను ఆదుకోవాలని ప్రస్తుతం ఆ కుటుంబం దీనంగా వేడకుంటున్నది. కరీంనగర్​ జిల్లా రామడుగుకు చెందిన రాజశేఖర్​ మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటినుంచి అతడు మంచానికే పరిమితమయ్యాడు. అతడికి మెదడులో రక్తం గడ్డకట్టిందని.. ఆపరేషన్​ చేసేందుకు రూ. […]

Read More

రమేశ్​ ఆస్పత్రి చుట్టూ రాజకీయం

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో రాజకీయాలు వేడెక్కాయి. ప్రస్తుతం రమేశ్​ ఆస్పత్రి, స్వర్ణప్యాలెస్​ అగ్నిప్రమాదంపై అధికార ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. రమేశ్​ ఆస్పత్రి కరోనా పేషెంట్లను స్వర్ణప్యాలెస్ హోటల్​లో ఉంచి చికిత్స అందించింది. ఈ క్రమంలో అగ్నిప్రమాదం జరిగి అందులో ఉన్న 10 మంది చనిపోయారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాగా, రమేశ్​ ఆస్పత్రి యజమాని రమేశ్​బాబు పరారీలో ఉన్నాడు. రమేశ్​ బాబు కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి ప్రభుత్వం కక్ష గట్టిందని.. ప్రతిపక్ష టీడీపీ […]

Read More
ఎస్పీ బాలూ.. కరోనా

కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఎస్పీ బాలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా మహమ్మారి సామాన్యులను, సెలబ్రిటీలను సైతం వదలడం లేదు. తాజాగా ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. మూడురోజులుగా జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు ఉండటంతో పరీక్షలు చేయించుకోగా కరోనా నిర్ధారణ అయ్యిందని చెప్పారు. కాగా, తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని.. కుటుంబసభ్యులకు ఇబ్బంది కలుగకూడదనే ఆస్పత్రిలో చేరానని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. తనను పరామర్శించేందుకు చాలా […]

Read More