సారథిన్యూస్, హైదరాబాద్: ఇంటర్మీడియట్ తెలుగు పాఠ్యప్రణాళికను తెలంగాణ ఇంటర్‌బోర్డు మార్చబోతున్నది. ఇందుకోసం నిపుణుల కమిటీని నియమించింది. తెలంగాణ పదాలు, సంస్కృతికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది(2020-21) ఫస్టియర్‌లో చేరబోయే విద్యార్థులకు ఈ కొత్త పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి. 2021-22 విద్యా సంవత్సరానికి ద్వితీయ సంవత్సరంలోనూ కొత్త పాఠ్య ప్రణాళికతో పుస్తకాలు రూపొందుతాయి. తెలంగాణ రచయితలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఇంటర్‌బోర్డు వర్గాలు తెలిపాయి.
షిల్లాంగ్: కరోనాను కట్టడి చేసేందుకు మేఘాలయ ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటున్నది. జూలై 24 నుంచి 31 వరకు ఆ రాష్ట్ర సరిహద్దులను పూర్తిగా మూసివేయనున్నది. కరోనా కట్టడిలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా బుధవారం మీడియాకు తెలిపారు. అత్యవసర సేవలను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతించనున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు మేఘాలయ రాష్ట్రంలో 270 కరోనా కేసులు నమోదయ్యాయి. చిన్నరాష్ట్రమైనప్పటికి అత్యధిక సంఖ్యలో టెస్టులు చేస్తూ.. ఎప్పటికప్పడు కరోనాను కట్టడి చేస్తున్న మేఘాలయను […]
పాట్నా: బీహార్‌లో మరోసారి లాక్‌డౌన్ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉన్నతాధికారులతో సమావేశం కానున్నది. దీనిపై ఆ రాష్ట్ర సీఎస్ దీపక్ కుమార్ మాట్లాడుతూ.. ‘సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల కట్టడి గురించి సమీక్షించనున్నారు. పెరుగతున్న కేసుల దృష్ట్యా రాష్ట్రంలో మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించే ఆలోచన ఉంది’ అని ఆయన తెలిపారు. అయితే […]
సారథిన్యూస్, రామడుగు: కరోనాను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ వెన్న రాజమల్లయ్య ఆరోపించారు. సోమవారం ఆయన తననివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దాదాపు 30 వేల కేసులు నమోదైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా పరీక్షలు చేయడం లేదని విమర్శించారు. పారిశుధ్య కార్మికులు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, ఏఎన్ఎంలు, జర్నలిస్టుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.
ఢిల్లీ: రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. తన వెంట 30మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ప్రకటించారు. రేపు రాజస్థాన్‌లో జరగబోయే కాంగ్రెస్ శాసనసభ సమావేశానికి తాను తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. రాజస్థాన్‌లో మొత్తం 200 స్థానాలకు గానూ, కాంగ్రెస్‌కు 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. 12 మంది స్వతంత్రలు ఆపార్టీకి మద్దతు ఇస్తున్నారు. కాగా […]
ఎవరు అంగీకరించినా.. అంగీకరించకపోయినా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు కులప్రాతిపదికననే నడుస్తాయన్నది సుస్పష్టం. గెలుపు ఓటముల్లోనూ కులాల ప్రభావం అధికంగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ఇక అధికారంలోకి వచ్చినవారు తమ సామాజికవర్గం వారిని అందలం ఎక్కించడం.. ఇతర కులస్థులను ముఖ్యంగా ప్రత్యర్థులకు అనుకూలంగా ఉన్న కులాలకు చెందినవారిపై వివక్ష చూపించడం సర్వసాధారణమే. అయితే రాజ్యాంగబద్ధమైన పదవులను ప్రభుత్వాలు గౌరవించాలి. వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వ్యవహరించాలి. ఇది రాజ్యాంగంలో పొందుపరచిన మౌలిక అంశం. ప్రజాప్రతినిధులు సైతం ఈ నిబంధనను పాటిస్తామంటూ […]
ఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్నది. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన గణాంకాలప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 8,20,916 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 27,114 మందికి కరోనా సోకింది. దేశవ్యాప్తంగా 2,83,407 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటివరకు 22,123 మంది కరోనాకు బలయ్యారు. 5,15,385 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. కోలుకుంటున్న వారి సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ.. రోజురోజుకు పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజలంతా భౌతికదూరం పాటించి మాస్కులు ధరించాలని, అత్యవసరమైతేనే బయటకు […]
ఢిల్లీ: ఢిల్లీకి చెందిన అన్ని యూనివర్సిటీల పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా ఉదృతి రోజురోజుకు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు చెందిన వార్షిక పరీక్షలు, ఇతర పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా శనివారం ట్వీట్ చేశారు. ఆయా విశ్వవిద్యాలయాలు తమ నిబంధనల ప్రకారం విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేస్తారని. లేదా వారికి డిగ్రీ పట్టా అందజేస్తారని […]