Breaking News

CHANDRABABU

చంద్రబాబు ఇంట్లోనే రమేశ్ బాబు!

సారథిన్యూస్​, అమరావతి: స్వర్ణప్యాలెస్​ అగ్నిప్రమాదం ఘటనలో నిందితుడు.. రమేశ్​ ఆస్పత్రి యాజమాని డాక్టర్​ రమేశ్​ బాబు.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంట్లో దాక్కొని ఉంటారని వైఎస్సార్​సీపీ విజయ్​సాయి రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ట్వీట్​ చేశారు. ‘చంద్రబాబూ.. నేరుగా అడుగుతున్నా.. ఇంతకీ డాక్టర్‌ రమేష్‌ను మీ ఇంట్లో దాచారా?, లేక మీ కొడుకు ఇంట్లో దాచారా? ఇంతకీ నిమ్మగడ్డ రమేష్‌, డాక్టర్‌ రమేష్‌.. ఈ ఇద్దరితో మీకున్న అనుబంధం ఏమిటి?’ […]

Read More

టీడీపీకి మరో షాక్​

అమరావతి: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది మొదలు.. టీడీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ అధినేత చంద్రబాబు వయస్సు మీదపడటం.. యువనేత లోకేశ్​ మీద పార్టీ నేతలకు నమ్మకం లేకపోవడంతో కీలకనేతలందరూ ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా టీడీపీ నేత, రాజమండ్రి రూరల్ మాజీ ఎమ్మెల్యే చందన రమేశ్​ టీడీపీకి గుడ్​బై చెప్పారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో చందన రమేశ్​ వైఎస్సార్​సీపీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు కుమారుడు […]

Read More

తెలుగు తమ్ముళ్లు.. డీలా

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లోని టీడీపీ కార్యకర్తలు అధినేత చంద్రబాబు వైఖరితో డీలా పడిపోయారట. కరోనా నెపంతో టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితమయ్యారు. కనీసం యువనేత లోకేశ్​ కూడా వారిని పలుకరించడం లేదు. దీంతో తెలుగుదేశం కార్యకర్తలు తీవ్ర నిస్తేజంలో కూరుకుపోయినట్టు సమాచారం. మరోవైపు ఏపీలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇటీవలే ఆ పార్టీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్​ ఏపీలో పర్యటించి కీలకవ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని.. ఆ స్థానాన్ని భర్తీచేయాలని ఆయన […]

Read More

రమేశ్​ ఆస్పత్రి చుట్టూ రాజకీయం

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో రాజకీయాలు వేడెక్కాయి. ప్రస్తుతం రమేశ్​ ఆస్పత్రి, స్వర్ణప్యాలెస్​ అగ్నిప్రమాదంపై అధికార ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. రమేశ్​ ఆస్పత్రి కరోనా పేషెంట్లను స్వర్ణప్యాలెస్ హోటల్​లో ఉంచి చికిత్స అందించింది. ఈ క్రమంలో అగ్నిప్రమాదం జరిగి అందులో ఉన్న 10 మంది చనిపోయారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాగా, రమేశ్​ ఆస్పత్రి యజమాని రమేశ్​బాబు పరారీలో ఉన్నాడు. రమేశ్​ బాబు కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి ప్రభుత్వం కక్ష గట్టిందని.. ప్రతిపక్ష టీడీపీ […]

Read More

వారెక్కడ?

తెలుగుదేశం పార్టీ సీనియర్లు ఎక్కడా కనిపించడం లేదు ఎందుకో.. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వారే పార్టీకి దూరంగా ఉన్నారా.. లేక పార్టీయే వారిని దూరం పెట్టిందా.. వారు దూరంగా ఉండడానికి యువనేత లోకేష్‌ పాత్ర ఏమైనా ఉందా.. యువకులకు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో వారిని పక్కన పెట్టారా..? ఇలా అనేక అనుమానాలు టీడీపీ క్యాడర్‌లో వ్యక్తమవుతున్నాయి. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నవారు కూడా ఇప్పుడు ఎందుకు కనిపించకుండా పోయారన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. వడ్డే శోభనాదీశ్వరరావు […]

Read More

టీడీపీ నేతల అరెస్టులపై బాబు అంతర్మథనం

సారథి న్యూస్, అనంతపురం: టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదనీ, సంక్షోభంలో నుంచి అవకాశాలు వెతుక్కోవడం ఎలాగో తమకు బాగా తెలుసునని టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు పదే పదే చెబుతుంటారు. కానీ, పరిస్థితులు ఇప్పుడు పూర్తి భిన్నంగా ఉన్నాయి. పార్టీ తరఫున సరిగ్గా వాయీస్‌ వినిపించే బలమైన నాయకుడు టీడీపీకి లేడన్నది నిర్వివాదాంశం. శుక్రవారం మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్ట్‌తో టీడీపీ కొంత మేర ‘గలాటా’ చేయగలిగిందిగానీ.. రెండో రోజుకి వ్యవహారం కొత్త మలుపు […]

Read More

ఎల్జీ పాలీమర్స్​ అక్కడ ఉండొద్దు

బాధితులను ఆదుకుంటాం మాజీ సీఎం చంద్రబాబు సారథి న్యూస్​, అమరావతి: గ్రామాల మధ్య ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఉండడానికి వీల్లేదని ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన మహానాడులో తీర్మానం చేశారు. టీడీపీ మహానాడు బుధవారం మంగళగిరిలోని సెంట్రల్​ ఆఫీసులో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎల్జీ కంపెనీని కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం సీజ్ చేశారన్నారు. […]

Read More

మీరొస్తారా.. నన్ను రమ్మంటారా?

ట్విట్టర్ లో ఎంపీ విజయసాయిరెడ్డి సారథి న్యూస్, అనంతపురం: ఏపీ ప్రతిపక్ష నేత ఎన్​.చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్‌ వేదికగా బుధవారం విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో.. ‘చంద్రబాబు గారూ.. ఎల్జీ ప్లాంట్ కు అనుమతులపై చర్చకు వస్తారా..మీరు ఇంట్లోంచి బయటకు వస్తారా? నన్ను హైదరాబాద్ రమ్మంటారా, మీరు విజయవాడ వస్తారా?’ అంటూ ట్వీట్‌‌ చేశారు. మరో ట్వీట్‌లో.. ‘రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు దిక్కుతోచడం లేదు. వీళ్లు […]

Read More