Breaking News

BJP

బీజేపీలోకి వంగవీటి రాధా

అమరావతి: టీడీపీ నేత వంగవీటి రాధా.. బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల ముందు వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ తాను కోరుకున్న టికెట్​ ఇవ్వలేదని టీడీపీలో చేరారు. టీడీపీ సైతం టికెట్​ ఇవ్వలేదు. అయినప్పటికీ ఆ పార్టీతరఫున ప్రచారం చేశారు. కానీ చంద్రబాబు, లోకేశ్​బాబు పార్టీలో సరైన గౌరవం ఇవ్వకపోవడంతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. ఈ మేరకు ఆయన బీజేపీకి చెందిన ఓ కీలకనేతతో సంప్రదింపులు […]

Read More

ఎయిమ్స్​కు అమిత్​షా

ఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్​లో చికిత్స తీసుకుంటున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆస్పత్రిలో చేరినట్టు కుటుంబసభ్యలు తెలిపారు. ఎయిమ్స్ డైరెక్ట‌ర్ ర‌న్‌దీప్ గులేరియా ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవ‌లే ఆయ‌న క‌రోనా నుంచి బ‌య‌ట ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ నెల 14న అమిత్​షాకు కరోనా నెగిటివ్ వ‌చ్చింది. దీంతో య‌ధాప్ర‌కారం త‌న కార్య‌క‌లాపాల‌ను కొనసాగించారు. అయితే ఆయనకు మరోసారి స్వల్ప జ్వరం, […]

Read More

‘బీజేపీతో ములాఖత్’ ఫేస్​బుక్​ వివరణ

ఢిల్లీ: ప్రముఖ సోషల్​ మీడియా సంస్థ ఫేస్​బుక్​.. భారతీయజనతాపార్టీకి సహకరిస్తోందని అమెరికాకు చెందిన ‘ది వాల్​స్ట్రీట్​ జర్నల్​’ ఓ కథనం ప్రచరించింది. ఇందుకోసం బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్​ పెట్టిన పోస్టులను ఆ కథనంలో ప్రస్తావించారు. కాగా ఈ కథనం ఆధారంగా కాంగ్రెస్​ బీజేపీపై విరుచుకుపడింది. రాహుల్​గాంధీ కూడా ఫేస్​బుక్​ బీజేపీకి సహకరిస్తోందంటూ ఆరోపించారు. ఇన్నిరోజులకు అమెరికాకు చెందిన మీడియా వార్తలు ప్రచురిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఫేస్​బుక్​ స్పందించింది. తమకు ఏ రాజకీయపార్టీతోనూ సంబంధం లేదని […]

Read More

నాకు ప్రాణహాని ఉంది.. కాపాడండి

న్యూఢిల్లీ: కొందరు తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని.. తన ప్రాణాలను కాపాడాలని ఫేస్​బుక్​ పబ్లిక్​ పాలసీ డైరెక్టర్​ అంకిదాస్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని ఆమె పోలీసులను కోరారు. అమెరికాకు చెందిన వాల్​స్ట్రీట్​ జర్నల్‌(డబ్ల్యూఎస్‌జే) ఫేస్​బుక్​పై ఓ సంచలన కథనం ప్రచురించింది. ఈ కథనం మనదేశ రాజకీయాల్లో తీవ్రదుమారం రేపింది. భారత్​లో ఫేస్​బుక్​.. బీజేపీ ములాఖత్​ అయ్యాయని అందుకే బీజేపీకి చెందినవారు హింసాత్మక పోస్టులు చేసిన ఫేస్​బుక్​ తొలిగించడం […]

Read More

ప్రజాసమస్యలపై పోరాడుదాం

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట బీజేపీ మండల కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. బీజేపీ మండల అధ్యక్షుడిగా మంగళి యాదగిరి, ప్రధానకార్యదర్శులుగా నరేందర్, దశరథ్, ఉపాధ్యక్షులుగా పెంటా గౌడ్, మేడి స్వామి, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ, గోపాల్, కార్యదర్శులుగా వడ్ల సిద్ధిరాములు, సంతోశ్​రెడ్డి, సురేశ్​, కోశాధికారిగా బాలసుబ్రమణ్యం, యువ మోర్చా అధ్యక్షుడిగా మహేశ్​, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా వెంకటేశ్​, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా మూర్తి శంకర్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా డప్పు స్వామి, మైనార్టీ మోర్చా […]

Read More

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి

సారథిన్యూస్, చొప్పదండి: కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని బీజేపీ నాయకులు డిమాండ్​ చేశారు. శుక్రవారం కరీంనగర్​ జిల్లా చొప్పదండిలోని తహసీల్దార్​ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు మౌనప్రదర్శన చేపట్టారు. అనంతరం తహసీల్దార్​ అంబటి రజితకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కరోనాతో ఇబ్బంది పడుతున్నారని .. వెంటనే కోవిడ్​19ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్​ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణలో అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో […]

Read More
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గద్దెదిగాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గద్దెదిగాలి

సారథి న్యూస్, రామడుగు: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో విఫలమైన కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు గద్దె దిగాలని కరీంనగర్ పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగిశేఖర్ విమర్శించారు. ఆదివారం యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదికి కోటి ఉద్యోగాలు అన్న మోడీ, ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్ మాట […]

Read More
వాళ్ల భేటీ.. ఆంత్యర్యం ఏమిటీ

వాళ్ల భేటీ.. ఆంతర్యం ఏమిటి?

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. శుక్రవారం పవన్​కల్యాణ్​​తో భేటీ ఆయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​ అవుతున్నాయి. వీర్రాజు ఏపీ బీజేపీ పగ్గాలు చేపట్టాక బీజేపీలోని ఓ వర్గం నేతలు, వైఎస్సార్​సీపీ నేతలు ఖుషీగా ఉండగా.. టీడీపీ నేతల్లో నైరాశ్యం నెలకొంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఏపీ బీజేపీలో చంద్రబాబు పరోక్షంగా జోక్యం చేసుకుంటున్నారని.. ఆయన కొందరు నేతలను కోవర్టులుగా పంపి రాజకీయం నడిపిస్తున్నారని కొంతకాలంగా […]

Read More