Breaking News

Day: August 7, 2020

పరుచూరి ఇంట విషాదం

పరుచూరి ఇంట విషాదం

సారథి న్యూస్​, హైదరాబాద్​ : టాలీవుడ్ ప్రముఖ రచయిత ప‌రుచూరి వెంకటేశ్వరరావు ఇంట విషాదం నెల‌కొంది. ఆయ‌న స‌తీమ‌ణి విజ‌య‌ల‌క్ష్మి(74) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. విజయలక్ష్మి మృతికి పలువురు సినీప్రముఖులు సంతాపం తెలిపారు. ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, కృష్ణ‌, శోభ‌న్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేశ్ స‌హా ప‌లువురు అగ్ర క‌థానాయ‌కులంద‌రి సినిమాల‌కు ప‌రుచూరి బ్రద‌ర్స్(ప‌రుచూరి వెంక‌టేశ్వర‌రావు, ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌) రచయితలుగా పని చేశారు. చిరంజీవి నటించిన సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రానికి కూడా వీరు వ‌ర్క్ […]

Read More
నేలకొరిగిన బూరుగ వృక్షం

నేలకొరిగిన అరుదైన వృక్షం

కోదాడ : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో అశోక్ నగర్ వద్ద ఉన్న ఆసియాలో అరుదైన ఆఫ్రికన్ జాతికి చెందిన వృక్షం అదన్ సోనియా డిజిటేటన్ లీన్(బూరుగ వృక్షం) నేలకొరిగింది. రోడ్డు విస్తరణకు అడ్డం రాకపోయినా కావాలని కూల్చేశారని పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు. ఇటువంటి వృక్ష జాతిని సందర్శనా ప్రదేశాలుగా మార్చి పర్యాటకులకు, విద్యార్థులకు వాటి ప్రాముఖ్యం తెలుపుతూ అందుబాటులో ఉంచేలా చూడాల్సిన ప్రభుత్వ అటవీ శాఖ యంత్రాంగం పట్టించుకోకపోతే భావితరాలు ఎలా విజ్ఞానం పొందుతారని ప్రజలు […]

Read More
రియా చుట్టూబిగిస్తున్న ఉచ్చు

రియాకు ఉచ్చు బిగుస్తోంది

ముంబై: సుశాంత్​సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సుశాంత్​ మాజీ ప్రేయసి రియాచక్రవర్తికి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఈ కేసులో రియా తీరుపై మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. మరోవైపు రియా చక్రవర్తి కనిపించకుండాపోవడం అనుమానాలకు తావిచ్చింది. రియాను కాపాడేందుకు ముంబై పోలీసులు రియాను కాపాడేందుకు యత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపించాయి. ఈ కేసు విషయంలో ముంబై పోలీసులకు. బీహార్​ పోలీసులకు వాదోపవాదాలు సాగిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనల నేపథ్యంలో రియా శుక్రవారం ఈడీ […]

Read More
వాళ్ల భేటీ.. ఆంత్యర్యం ఏమిటీ

వాళ్ల భేటీ.. ఆంతర్యం ఏమిటి?

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. శుక్రవారం పవన్​కల్యాణ్​​తో భేటీ ఆయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​ అవుతున్నాయి. వీర్రాజు ఏపీ బీజేపీ పగ్గాలు చేపట్టాక బీజేపీలోని ఓ వర్గం నేతలు, వైఎస్సార్​సీపీ నేతలు ఖుషీగా ఉండగా.. టీడీపీ నేతల్లో నైరాశ్యం నెలకొంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఏపీ బీజేపీలో చంద్రబాబు పరోక్షంగా జోక్యం చేసుకుంటున్నారని.. ఆయన కొందరు నేతలను కోవర్టులుగా పంపి రాజకీయం నడిపిస్తున్నారని కొంతకాలంగా […]

Read More
ఎంపీ సీఎం రమేశ్కు కరోనా పాజిటివ్

ఎంపీ సీఎం రమేశ్​కు కరోనా

హైదరాబాద్​ : రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్​ కోవిడ్​ బారినపడ్డారు. ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ఈ మేరకు ట్విట్టర్​ ద్వారా ఆయన స్వయంగా వెల్లడించారు. వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్​లో హోం ఐసోలేషన్​లో ఉండి చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ఆయన చెప్పారు.

Read More
మండలి రద్దుపై జోక్యం చేసుకోలేం

‘మండలి రద్దుపై జోక్యం చేసుకోలేం’

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో మండలి రద్దుపై తాము జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ శాసనమండలిలో టీడీపీకి మెజార్జీ ఉండడంతో ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులను మండలి అడ్డకుంటున్నది. దీంతో తీవ్ర అసహనానికి లోనైన సీఎం జగన్​ ఏకంగా మండలినే రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. మండలి రద్దు అంశం ఇప్పుడు కేంద్రం చేతుల్లో ఉంది. ఇదే సమయంలో మండలిని రద్దు చేయాలని అసెంబ్లీ చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా దాఖలైన […]

Read More
నవంబర్​లో వ్యాక్సిన్​

నవంబర్​లో కరోనా వాక్సిన్​

వాషింగ్టన్​: నవంబర్ 3 నాటికి కరోనాకు వాక్సిన్​ అందుబాటులోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి అంతానికి రోజులు దగ్గర పడుతున్నాయని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్​ను అమెరికానే తయారు చేస్తుందని ఆయన చెప్పారు. ఓ రేడియో కార్యక్రమంలో ట్రంప్​ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పలు అమెరికా సంస్థలు వ్యాక్సిన్​ తయారీలో సత్ఫలితాలు సాధిస్తున్నాయని చెప్పారు. ఈ ఏడాది నవంబర్ 3నే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో […]

Read More
జేసీ ప్రభాకర్​రెడ్డి మళ్లీ అరెస్ట్​

జేసీ ప్రభాకర్​రెడ్డి మళ్లీ అరెస్ట్​?

అనంతపురం: టీడీపీ నేత జేసీ ప్రభాకర్​రెడ్డి మళ్లీ అరెస్టయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్రమ వాహనాల కేసులో ఆయన కొంతకాలం క్రితం అరెస్టయిన జేసీ.. కోర్టు బెయిల్​ ఇవ్వడంతో గురువారం జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా కడప సెంట్రల్​ జైలు వద్ద జేసీ అనుచరులు రెచ్చిపోయారు. కోవిడ్​ నిబంధనలను ఉల్లంఘించి భారీగా జైలు వద్దకు చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఓ సీఐ దేవేంద్రపై జేసీ ప్రభాకర్​రెడ్డి దురుసుగా ప్రవర్తించాడు. […]

Read More