Breaking News

BJP

ఖుష్బూతో బీజేపీకి లాభమెంత?

ఢిల్లీ: ప్రముఖ సినీనటి, కాంగ్రెస్​ జాతీయ అధికార ప్రతినిధి ఖుష్బూ సోమవారం మధ్యాహ్నం బీజేపీలో చేరారు. ఉదయం కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేసిన ఆమె మధ్యాహ్నానికే బీజేపీలో చేరారు. ఉదయం ఆమెను పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగిస్తున్నట్టు అధిష్ఠానం ప్రకటించింది. కొద్ది సేపటికే ఆమె అధినేత్రి సోనియాకు రాజీనామా లేఖను పంపారు. పార్టీలోని కొందరు నేతలు తనను రాజకీయంగా అణగదొక్కుతున్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు. కొంతకాలంగా ఆమె కాంగ్రెస్​పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. […]

Read More

పాశ్వాన్ ఇకలేరు

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, లోక్‌జన శక్తి పార్టీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ గురువారం సాయంత్రం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తన తండ్రి చనిపోయినట్టు ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ‘మిస్ యూ పాప్పా’ అంటూ చిరాగ్​ ట్వీట్ చేశారు.ఆయన కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలే ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటంతో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు ఆయన […]

Read More

ఎల్ఆర్ఎస్ పేదలకు శాపం

సారథి న్యూస్, రామడుగు/ రామాయంపేట /చిన్నశంకరంపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ పేద ప్రజలకు గుదిబండ అని బీజేపీ రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు మురళి విమర్శించారు. ఎల్​ఆర్​ఎస్​ను నిరసిస్తూ మంగళవారం కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎల్ ఆర్ ఎస్ పేరుతో తీసుకొచ్చిన జీవో 131 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. మరోవైపు ఎల్​ఆర్​ఎస్​ను రద్దు చేయాలని డిమాండ్​ […]

Read More

దుబ్బాకలో ఎన్నికల సందడి

నోటిఫికేషన్ రాక ముందే రాజకీయ వేడి మండలాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హాడావిడి బీజేపీ నేతల మకా..గాడిన పడని కాంగ్రెస్ పల్లెల్లో నేతల మోహరింపు సారథి న్యూస్, దుబ్బాక: రాజకీయ పార్టీలు అధికారికంగా తమ అభ్యర్థులను ప్రకటించకముందే దుబ్బాక నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరమైంది. ఎవరికి వారే అన్నట్లుగా ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు ఏ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించకున్నా స్థానికంగా మాత్రం రాజకీయ సందడి నెలకొన్నది. ఇప్పటికి ఎన్నికల ప్రకటన సైతం వెలువడలేదు […]

Read More
దళితులు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి

దళితులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

సారథి న్యూస్​, కర్నూలు: జిల్లాలోని దళితులు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగారని, అందుకు తనవంతు సహకారం అందిస్తానని దళిత పారిశ్రామిక సంఘ జాతీయ అధ్యక్షుడు డాక్టర్​ మామిడి సుదర్శన్‌ అన్నారు. కర్నూలు జిల్లా పరిశ్రము, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సభ్యుడు జెరదొడ్డి జయన్న నేతృత్వంలో ఆదివారం కోల్స్‌ తొగు బాప్టిస్ట్‌ చర్చ్‌ వెనుక దళిత పారిశ్రామిక సంఘం కార్యాలయాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్​మామిడి సుదర్శన్‌ మాట్లాడుతూ.. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రభుత్వం […]

Read More
రాజకీయ కురువృద్ధుడు జస్వంత్ సింగ్ ఇకలేరు

రాజకీయ కురువృద్ధుడు జస్వంత్ సింగ్ ఇకలేరు

ప్రధాని నరేంద్రమోడీ సంతాపం న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు జస్వంత్ సింగ్(82) కన్నుమూశారు. 2014 లో తలకు దెబ్బతగిలి గత ఆరేళ్లుగా కోమాలో ఉన్న ఆయన.. ఆదివారం ఉదయం ఢిల్లీలో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. రాజస్థాన్ లోని జోధ్​పూర్​ కు చెందిన జశ్వంత్ సింగ్.. బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. రాజకీయాల్లోకి రాకముందు పదేళ్ల పాటు ఆయన ఆర్మీలో సేవలందించారు. వాజ్ పేయి ప్రభుత్వంలో పలు కీలక హోదాల్లో మంత్రిగా […]

Read More

వ్యవసాయ బిల్లు ఆమోదంపై హర్షం

సారథి న్యూస్, రామడుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లు శనివారం పార్లమెంట్ లో ఆమోదం పొందటం పట్ల రామడుగు బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం కరీంనగర్​ జిల్లా రామడుగులో బీజేపీ నాయకులు నరేంద్రమోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కట్ట రవీందర్, అంజిబాబు, రాజేంద్రచారి, రాజు, సత్యనారాయణ, భరత్, శ్రీకాంత్, వెంకటేశ్​, గాలిపల్లి రాజు, శ్రీనివాస చారి, పోచమల్లు, మల్లేశం పాల్గొన్నారు.

Read More
ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టండి

ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టండి

సారథి న్యూస్, శ్రీకాకుళం: బీజేపీ చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా మంగళవారం శ్రీకాకుళం జిల్లా పాలకొండ సచివాలయ ఆవరణలో సీపీఎం నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు దావాల రమణారావు, ఎన్ఏ రాజపురం శాఖ కార్యదర్శి అర్తమూడి లక్ష్మణరావు మాట్లాడుతూ.. ప్రధాని మోడీ చేసిన పెద్దనోట్ల రద్దు, జీఎస్ టీ అమలు దేశప్రజల ఆర్థిక పరిస్థితిని తీరోగమనంలోకి నెట్టేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధాంతరంగా లాక్​డౌన్​విధించి వలస కార్మికుల […]

Read More