సారథిన్యూస్, తెనాలి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి ఆదివారం ప్రమాదవశాత్తు తన ఇంట్లో జారిపడ్డారు. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు వెంటనే తెనాలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. మరోవైపు ఆమెకు ఆస్పత్రిలో ప్రస్తుతం పరీక్షలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, యువనేత లోకేశ్, ఇతర సీనియర్ నేతలు నన్నపనేని రాజకుమారి కుటుంబసభ్యులకు ఫోన్‌చేసి ఆరోగ్య వివరాల గురించి ఆరా తీశారు. మరోవైపు […]
అనంతపురం: జిల్లాలోని తాడిపత్రి శివారు వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచానూరు నుంచి తాడిపత్రికి వస్తున్న తుఫాన్ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం వెనక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. ఏడుగురికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతులు తాడిపత్రి వాసులేనని తేలింది. కాగా, ప్రమాదంలో మృతి చెందిన వారు హేమలత, సుబ్రమణ్యం, వెంకటరంగయ్యగా గుర్తించారు.
సారథిన్యూస్, రామడుగు: పేదరికం ఆ కుటుంబాన్ని చిదిమేసింది. విధి వెక్కిరించింది. చిన్న వయసులోనే ఇద్దరు పిల్లల నా అనేవాళ్లకు దూరమై అనాథలయ్యారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రుద్రారం గ్రామానికి చెందిన గుర్రం వనిత (17), గుర్రం నవీన్ కుమార్(6)ల తల్లిదండ్రులు నాలుగేండ్ల క్రితం ఓ ప్రమాదంలో చనిపోయారు. దీంతో వాళ్ల నాన్నమ్మే పిల్లలిద్దరినీ పెంచి పోషించింది. సోమవారం వాళ్ల నాన్నమ్మ కూడా తుదిశ్వాస విడిచింది. దీంతో వీరు అనాథలయ్యారు. ప్రస్తుతం ఆ చిన్నారులు దిక్కుతోచని స్థితిలో […]
చింతపల్లి: హైదరాబాద్ – నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం ధైర్యపురితండా వద్ద కారు వేగం అదుపుతప్పి బోల్తాపడింది. రోడ్డు పక్కన వాటర్లైన్పిల్లర్ను ఢీకొని కారు ఐదారు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ నుంచి మల్లేపల్లి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణం కారణమని తెలుస్తోంది. కారులో ఇరుక్కపోయిన మృతదేహాలను పోలీసులు అతికష్టం మీద […]
సారథి న్యూస్, మానవపాడు: రోడ్డుప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మృతిచెందిన ఘటన ఏపీలోని కర్నూల్ సమీపంలో చోటుచేసుకున్నది. ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మాధవి ఎమ్మిగనూరు నుంచి కర్నూలు జిల్లా పంచలింగాలకు వెళ్తున్నది. ఈ క్రమంలో తుంగభద్ర బ్రిడ్జిపై వెనుక నుంచి వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాధవి అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
వేటపాలెం : ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో బైక్‌ను తప్పించబోయి కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఒకరు మృతి చెందారు. స్థానికుల, పోలీసుల కథనం ప్రకారం కర్నూలు నుంచి చీరాలకు వేటపాలెం మండలం అక్కాయి పాలెం జాతీయరహదారి ప్తె వస్తున్న కారు ముందుగా వెళ్తున్న బైక్‌ను తప్పించుకోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. ప్రమాదం లో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి..ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు […]
తిరువనంతపురం: దుబాయ్ నుంచి కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌కు వస్తున్న ఓ ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. విమానం లోయలోపడి రెండు ముక్కలు కావడంతో పైలట్, ఐదుగురు సిబ్బందితో పాటు మరో 19 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఎయిర్ ఇండియాకు చెందిన డీఎక్స్ బీసీసీజే బోయింగ్ 737 విమానం రన్‌వే పై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 123 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో 15 మంది […]
సారథిన్యూస్, పెద్దపల్లి: ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా రాఖీ కడుదామనుకున్న ఓ సోదరి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చిన మృత్యువు ఆ మహిళను బలితీసుకున్నది. సోదరుడి చేతుల్లోనే ఆ యువతి ప్రాణాలు విడిచింది. ఈ విషాధ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని రాజీవ్ రహదారిపై శనివారం చోటుచేసుకున్నది. పెద్దపల్లి జిల్లాకు చెందని ఓ మహిళ రాఖీ పౌర్ణమి పండుగకోసం తన సోదరుడితో కలిసి గోదావరిఖనికి బైక్‌పై వస్తుండగా.. రాజీవ్ […]