Breaking News

ANANTHAPURAM

తాడిపత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం

తాడిపత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం

అనంతపురం: జిల్లాలోని తాడిపత్రి శివారు వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచానూరు నుంచి తాడిపత్రికి వస్తున్న తుఫాన్ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం వెనక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. ఏడుగురికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతులు తాడిపత్రి వాసులేనని తేలింది. కాగా, ప్రమాదంలో మృతి చెందిన వారు హేమలత, సుబ్రమణ్యం, వెంకటరంగయ్యగా గుర్తించారు.

Read More
కరెంట్​ షాక్​తో 45గొర్రెలు మృతి

విద్యుత్ షాక్ తో 45 గొర్రెలు మృతి

సారథి న్యూస్​, అనంతపురం : కరెంట్​ షాక్​తో భారీ సంఖ్యలో గొర్రెలు మృత్యువాతపడ్డాయి. వివరాలు.. అనంతపురం జిల్లా గోరంట్ల మండల పరిధిలోని మందలపల్లి పంచాయతీలోని కరావులపల్లి తండాలో శనివారం షార్ట్​ సర్క్యూట్​తో విద్యుత్​ షాక్​ తగిలి శంకర్​ నాయక్​ అనే రైతుకు చెందిన 45 గొర్రెలు చనిపోయాయి. జీవనాధారం కోల్పోవడంతో రైతు కుటుంబీకులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

Read More
ఎస్పీని కలిసిన ఏఎస్సైలు

ఎస్పీని కలిసిన ఏఎస్సైలు

సారథి న్యూస్, కర్నూలు: అనంతపురం జిల్లాకు చెందిన 8 మంది ఏఎస్సైలు ఎస్సైలుగా పదోన్నతి పొందిన సందర్భంగా వారిని విధుల కోసం కర్నూలు జిల్లాకు కేటాయించారు. గురువారం వారు జిల్లా ఎస్పీ ఆఫీసులో ఎస్పీ డాక్టర్ కాగినెల్లి ఫక్కీరప్పను మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. మరిన్ని పదోన్నతులు పొందాలని ఎస్పీ ఆకాంక్షించారు. కరోనా సమయంలో ప్రజలకు మంచి సేవలు అందించి పోలీసుశాఖకు పేరు తీసుకురావాలని కోరారు.

Read More
స్వీయ జాగ్రత్తలతోనే కరోనా కట్టడి

స్వీయ జాగ్రత్తలతోనే కరోనా కట్టడి

సారథి న్యూస్, అనంతపురం : స్వీయ జాగ్రత్తలతోనే కరోనా కట్టడి సాధ్యమని అనంతపురం ఎమ్మెల్యే వెంకట రామిరెడ్డి తెలిపారు. నగరంలోని రెండో రోడ్డులో ఉన్న మెప్మా కార్యాలయం వద్ద గురువారం ర్యాగ్ పిక్కర్స్ (వీధుల్లో చెత్త ఏరుకుంటూ జీవనం సాగించే కుటుంబాలు), నిరాశ్రయ కుటుంబాలకు కోవిడ్-19 కిట్లను పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందన్నారు. కరోనా టెస్టులు వేగవంతం చేయడానికి […]

Read More

కరోనాతో ట్రాఫిక్ సీఐ మృతి

సారథి న్యూస్, అనంతపురం: అనంతపురం నగరంలో ట్రాఫిక్ సీఐగా నిధులు నిర్వర్తిస్తున్న రాజశేఖర్ కరోనా బారినపడి మంగళవారం మృతిచెందారు. స్థానిక సవేరా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సీఐ మృతి పట్ల హిందూపురం ఎంపీ గోరంట్ల మాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసు శాఖలో ఉన్నప్పుడు తన సమకాలీకుడిగా ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాడని ఆయన కితాబిచ్చారు. సీఐ రాజశేఖర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎంపీ భరోసా ఇచ్చారు.

Read More

రెడ్​ జోన్లలో పకడ్బందీ చర్యలు

– అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు సారథి న్యూస్, అనంతపురం: హిందూపురం రెడ్ జోన్లలో ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులు, శానిటైజర్లు అందజేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. శనివారం సాయంత్రం హిందూపురం పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలను చర్చించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండేలా, సామాజిక దూరం పాటించేలా రెడ్ జోన్లలో ఆటోల ద్వారా ప్రచారం చేయాలని తహసీల్దార్​, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఎవరికైనా అనుమానిత లక్షణాలు ఉంటే టోల్ […]

Read More
ఉల్లం‘ఘనుల’పై ఉక్కుపాదం

ఉల్లం‘ఘనుల’పై ఉక్కుపాదం

–వాహనాలు సీజ్.. చలానా విధింపు సారథి న్యూస్, అనంతపురం: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై అనంతపురం జిల్లా పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. లాక్ డౌన్ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో విపత్తు నిర్వహణ, తదితర చట్టాల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వివిధ కేసులు నమోదుచేశారు. రోడ్డుభద్రతా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 1,07,982 నమోదుచేసి..రూ.4,63,05,620 జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. అలాగే 2,604 వాహనాలను సీజ్ […]

Read More

పుట్టపర్తిలో కరోనా కలవరం

సారథి న్యూస్​, పుట్టపర్తి: అనంతరపురం జిల్లా పుట్టపర్తి పట్టణం ఒక్కసారిగా కరోనాతో కలవరపడింది. ప్రశాంతి నిలయం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఓ పోలీస్​ కానిస్టేబుల్​ కు వైద్యారోగ్య పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్ తేలడంతో గురువారం ఆయనను బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి అధికారులు తరలించారు. ట్రెయినీ కలెక్టర్ జాహ్నవి తహసీల్దార్ ఆఫీసులో అధికారులతో సమీక్షించారు. గోపురం గేట్ నుంచి హనుమాన్ సర్కిల్ వరకు దాదాపు వెయ్యి ఇండ్ల పరిధిని రెడ్ జోన్ గా ప్రకటించారు. ప్రజలకు అసౌకర్యాలు […]

Read More