Breaking News

POLICE

మొక్కలు నాటడం మనబాధ్యత

సారథిన్యూస్​, మంచిర్యాల/ సిద్దిపేట/చిన్నకోడూర్ : మొక్కలు నాటడం సామాజిక బాధ్యత అని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి పేర్కొన్నారు. ఆరోవిడుత హరితహారం కార్యక్రమంలో రామగుండం పోలీస్​ కమిషనరేట్​ పరిధిలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఆర్మ్​డ్​ పోలీస్ హెడ్​క్వార్టర్స్​లో ఆయన మొక్కలు నాటారు. మరోవైపు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామంలోని హరీశ్​రావు కాలనీలో సర్పంచ్ బోయినపల్లి నర్సింగరావు అధ్వర్యంలో మొక్కలు నాటారు. చిన్నకోడూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై సాయికుమార్​, సిబ్బంది మొక్కలు నాటారు. కార్యక్రమంలో రామగుండం పోలీస్ […]

Read More

సచివాలయం కూల్చివేత ప్రారంభం

సారథిన్యూస్​, హైదరాబాద్​: హైకోర్టు గ్రీన్​సిగ్నల్​ ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర సచివాలయ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. మంగళవారం తెల్లవారుజామునుంచే భారీ బందోబస్తు నడుమ కూల్చివేతను ప్రారంభించారు. అదే స్థానంలో కొత్తసచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కూల్చివేతకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీయకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సచివాలయానికి ఉన్న అన్నివైపులా ద్వారాలను మూసివేశారు. సాధ్యమైనంత తొందరగా కూల్చివేత ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Read More

మద్యం దొంగలు అరెస్ట్​

సారథిన్యూస్​, రామగుండం: మద్యం దొంగతనం చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. రామగుండం పోలీస్​ కమిషనరేట్​ పరిధిలోని పెద్దపల్లి జిల్లా అప్పనపేట శివారులో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఈ ముఠా పట్టుబడింది. నిందితుల వద్ద నుంచి 3 బైక్​లు, 2 ట్రాలీ ఆటోలు, రూ. 3,66,800 విలువైన మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్​ జిల్లాకు చెందిన శేఖర్​, కుమ్మాటి రాజు, కుర్ర అంజయ్య ముఠాగా ఏర్పడి పలు చోట్ల మద్యం దుకాణాలను […]

Read More
తమిళ హీరో విజయ్​కు బెదిరింపు కాల్

తళపతి విజయ్​కి బెదిరింపు

దమిళ అగ్రనటుడు, తళపతి విజయ్​కు బెదిరింపు కాల్​ వచ్చింది. దీంతో పోలీస్​శాఖ అప్రమత్తమైంది. లాక్​డౌన్​తో సినిమా షూటింగ్​లన్నీ ఆగిపోయాయి. తాజాగా ప్రభుత్వం షూటింగ్​లకు అనుమతి ఇచ్చినప్పటికీ కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో నటులెవరూ షూటింగ్​లలో పాల్గొనడం లేదు. విజయ్ ప్రస్తుతం మాస్టర్ సినిమా చేస్తున్నాడు. లాక్​డౌన్​తో ఈ చిత్ర షూటింగ్​ నిలిపివేశారు. ఇదిలా ఉండగా హీరో విజయ్​ ఇంటికి బెదిరింపు కాల్స్​ వస్తున్నాయి. బాంబులతో ఇంటిని పేల్చేస్తామంటూ కొందరు ఫోన్​ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన ఇంటికి […]

Read More
తప్పతాగి కారు డ్రైవింగ్

తప్పతాగి కారు డ్రైవింగ్

న్యూఢిల్లీ: ఫుల్లుగా మద్యం తాగి కారు నడిపిన ఓ పోలీసు వేగం అదుపు తప్పి మహిళను ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను హాస్పిటల్‌లో చేర్పించి ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు. ప్రమాదానికి కారణమైన పోలీస్‌ ఆఫీసర్‌‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఢిల్లీలోని చిల్లా గ్రామం సమీపంలో ఒక పోలీస్‌ ఆఫీసర్‌‌ రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తిని కారుతో ఢీకొట్టాడు. దాన్ని గమనించిన స్థానికులు ఆమెను కాపాడేందుకు దగ్గరికి వచ్చేలోపే కారును మళ్లీ ఆమెపై నుంచి పోనిచ్చాడు. దీంతో […]

Read More

రౌడీషీటర్లపై నిఘా

సారథిన్యూస్​, కొత్తగూడెం: పాత నేరస్థులు, రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్​దత్​ ఆదేశించారు. జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బందితో శుక్రవారం ఆయన ఎస్పీ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీషీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటుచేయాలని సూచించారు. సీసీ టీవీ కెమెరాలు నిరంతరం పనిచేసే విధంగా పోలీసు అధికారులు శ్రద్ద తీసుకోవాలని కోరారు. ఈ వీడియో […]

Read More

యూపీలో రెచ్చిపోయిన రౌడీలు

లక్నో: ఉత్తర్​ప్రదేశ్​లో ఓ రౌడీ ముఠా రెచ్చిపోయింది. అరెస్ట్​ చేసేందుకు వచ్చిన ఎనిమిది మంది పోలీసులను రౌడీలు కాల్చిచంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని కాన్పూర్​కు చెందిన రౌడీ షీటర్​ వికాస్​ దూబే పలు కేసుల్లో నిందితుడు. అతడిని అరెస్ట్​ చేసేందుకు పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున కాన్పూర్​ సమీపంలో అతడు నివాసం ఉంటున్న డిక్రూ గ్రామానికి వెళ్లారు. వికాస్​ ఇంటి సమీపంలోని ఓ ఇంటిమీద కాపుకాసిన రౌడీలు పోలీస్​ బృందంపై విక్షణారహితంగా బుల్లెట్ల వర్షం కురిపించారు. […]

Read More

వ్యభిచారముఠా అరెస్ట్​

సారథిన్యూస్​, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పోలీసులు తనిఖీ చేసి వ్యభిచార ముఠాను అదుపులోకి తీసుకున్నారు. పాల్వంచలోని ఓ ఇంజిరింగ్​ కళాశాల సమీపంలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు తనిఖీచేసి ముగ్గురు మహిళలతోపాటు ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు.

Read More