Breaking News

Day: July 5, 2020

మృతుడి కుటుంబాన్ని ఆదుకోండి

సారథి న్యూస్​, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా ఇందారం ఓపెన్​ కాస్ట్​ ఓబీ కంపెనీలో విధినిర్వహణలో ఉండగా చనిపోయిన కార్మికుడి కుటుంబానికు రూ. 50 లక్షలు పరిహారం చెల్లించాలని సింగరేణి కాంట్రాక్ట్​ వర్కర్స్​ యూనియన్​ రాష్ట్ర అధ్యక్షుడు కడారి సునీల్​, సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి తోకల రమేష్ డిమాండ్ చేశారు. ఓబీ కంపెనీలో సర్వే అధికారుల పనులను జనరల్ క్యాటగిరి కాంట్రాక్టు కార్మికులతో పని చేయడం మూలంగా కార్మికుడు చనిపోయాడని ఆరోపించారు. కార్యక్రమంలో […]

Read More

నిత్యావసర సరుకులు పంపిణీ

సారథిన్యూస్​, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆదివారం లయన్స్​క్లబ్​ ఆధ్వర్యంలో ప్రైవేట్​ ఉపాధ్యాయులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్​ క్లబ్​ అధ్యక్షుడు గుగ్గిళ్ల రవీంద్రాచారి మాట్లాడుతూ.. కరోనా, లాక్​డౌన్​తో ప్రైవేట్​ టీచర్ల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. అందుకే వారికి తమవంతుగా ఈ సాయం చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో లయన్స్​క్లబ్​ ప్రధాన కార్యదర్శి భిక్షపతి, కోశాధికారి గుండా రాజు, సభ్యులు శరత్ బాబు, డాక్టర్ వెంకటేశ్వర్లు, భేణిగోపాల్ త్రివేది, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Read More
యంత్రాలు.. ఎండకు, వానకు

యంత్రాలు.. ఎండకు, వానకు

సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రభుత్వం కొనుగోలు చేసిన యంత్రాలను అధికారులు నిరుపయోగంగా పడేశారని కాంగ్రెస్​ నేత అక్కు శ్రీనివాస్​ ఆరోపించారు. ఆదివారం ఆయన కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్​లో మీడియాతో మాట్లాడుతూ.. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టు పనుల్లోని మోటర్లకు ఉపయోగించేందుకు స్విచ్చింగ్ యంత్రాలను ప్రభుత్వం కొనుగోలు చేయగా వాటిని అధికారులు హుస్నాబాద్​లోని నివాసప్రాంతాల్లో ఉంచారని ఆరోపించారు. వాటిని వెంటనే వినియోగించాలని.. లేదంటే కంపెనీలకు వాపస్​ ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై ఇప్పటికే వినతిపత్రం ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని […]

Read More

ఓటీటీలోనే ‘బెలూన్​’

తెలుగమ్మాయి అంజలి నటించిన బెలూన్​ చిత్రాన్ని ఓటీటీలోనే రీలీజ్​ చేయనున్నారు. అంజలి తెలుగులో అడపదడపా సినిమాల్లో నటించనప్పటికీ తమిళంలోనే బాగా పాపులర్​ అయ్యింది. ప్రస్తుతం బెలూన్ అనే చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని థియేటర్స్ లో రిలీజ్ చేయాలని భావించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు నిర్మాతలు. అంజలి, తమిళ హీరో జై, జననీ అయ్యర్​ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కామెడీ, హారర్​గా తెరకెక్కుతున్నట్టు సమాచారం. జీ5లో […]

Read More

ప్రజాధనం దుర్వినియోగం

సారథి న్యూస్​, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని లక్ష్మీనగర్​లో 2013లో ప్రభుత్వం నిర్మించిన షాపింగ్​ కాంప్లెక్స్​ నిరుపయోగంగా ఉందని.. దీంతో రూ. 7 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నదని సీపీఐ నేతలు ఆరోపించారు. ఆదివారం సీపీఐ నేతలు రామగుండంలో పర్యటించి ప్రభుత్వం నిర్మించిన షాపింగ్​ కాంప్లెక్స్​ను సందర్శించారు. సీపీఐ రామగుండం నగర కార్యదర్శి కనకరాజ్​ మాట్లాడుతూ.. కేవలం కాంట్రాక్టర్లను బతికించడానికే షాపింగ్​ కాంప్లెక్స్​ను నిర్మించారని ఆరోపించారు. ఈ దుకాణ సముదాయం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. […]

Read More

నారప్ప న్యూపోస్టర్​ అదిరింది

విక్టరీ వెంకటేశ్​ హీరోగా శ్రీకాంత్​ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న ‘నారప్ప’ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన ఓ పోస్టర్​ యువతను తెగ ఆకట్టుకుంటున్నది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్​ లుక్​ను విడుదల చేశారు. తమిళంలో విజయవంతమైన ‘అసురన్​’కు రీమేక్​గా ఈ చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో ధనుష్​ నటించిన ఈ సినిమా అక్కడ భారీవిజయాన్ని సొంతం చేసుకున్నది. దళితుడి జీవితానికి సంబంధించిన కథతో ఈ చిత్రం తెరకెక్కింది. తమిళ మాతృకకు వెట్రిమారన్ దర్శకత్వం వహించాడు. […]

Read More
తెలంగాణలో 1,590 కేసులు

తెలంగాణలో 1,590 కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా మహమ్మారి ఏమాత్రం తగ్గడం లేదు. ఆదివారం రాష్ట్రంలో 1,590 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,902కు చేరింది. ఇప్పటి వరకు 1,15,835 మందిని పరీక్షించారు. తాజాగా ఏడుగురు మృతిచెందారు. ఇప్పటి వరకు 295 మంది చనిపోయారు. జీహెచ్​ఎంసీ పరిధిలో అత్యధికంగా 1277, మేడ్చల్​ జిల్లాలో 125, రంగారెడ్డి జిల్లాలో 82, సంగారెడ్డి జిల్లాలో 19, మహబూబ్​ నగర్​ జిల్లాలో 19, సూర్యాపేట జిల్లాలో 23, నల్లగొండ […]

Read More

రజకుల సమస్యలు పరిష్కరిస్తాం

సారథిన్యూస్​, రామగుండం: రజకుల సమస్యలను పరిష్కరిస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని 9వ డివిజన్​లో దోబీఘాట్​ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కులవృత్తులను నమ్ముకుని జీవించే రజకులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని అన్నారు. రూ. 5 లక్షల నిధులతో దోభీఘాట్ నిర్మిస్తున్నామన్నారు. అనంతరం 8వ డివిజన్​లోని తెలంగాణ అడ్వంచర్ అక్వాడ్ టూరిజం కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్ […]

Read More