సారథి ప్రతినిధి, జగిత్యాల: నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ సూచించారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు పచ్చదనంతో కళకళలాడాలని ఆకాంక్షించారు. శుక్రవారం జడ్పీ జనరల్ బాడీ మీటింగ్ లో ఆమె మాట్లాడారు. గ్రామ, మండలస్థాయిలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు అయ్యేలా చూడాలని కోరారు. నీడనిచ్చే మొక్కలు, పూలమొక్కలు, ఔషధం(హెర్బల్) మొక్కలను పెంచి వచ్చే హరితహారంలో నాటేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైకుంఠధామం పనులను పూర్తయ్యేలా […]
సారథి, పెద్దశంకరంపేట: హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్దశంకరంపేట ఎంపీడీవో రాంనారాయణ అన్నారు. శుక్రవారం పెద్దశంకరంపేట ఎంపీడీవో కార్యాలయంలో ఆయాశాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామంలో నర్సరీల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో మురికి కాల్వలు శుభ్రం చేయాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో రియాజుద్దీన్, ఈజీఎస్ ఏపీవో సుధాకర్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
సారథి, చిన్నశంకరంపేట: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న హరితహారం కార్యక్రమానికి జిల్లాలోని నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయని మెదక్ డీఆర్డీవో శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన చిన్నశంకరంపేట మండలంలోని కొరివిపల్లి సంగయ్యపల్లి, కామారం గ్రామాల్లో నర్సరీలు, డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. పరిశీలనలో భాగంగా సంతృప్తి వ్యక్తంచేశారు. ఎండాకాలం అయినప్పటికీ మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకుంటున్న సర్పంచ్ లు, అధికారులను అభినందించారు. ఆయన వెంట ఎంపీడీవో గణేష్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్ లు, పంచాయతీ […]
సారథి న్యూస్, రామగుండం: తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా సింగరేణి యాజమాన్యం ఈనెల 17తేదీన ఒక్కరోజునే రెండులక్షలకు పైగా మొక్కలను సింగరేణివ్యాప్తంగా నాటాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ఏరియాల్లో దీనికోసం సన్నాహాలు చేస్తున్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్(ఆపరేషన్స్,పా) కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో ఎన్.బలరాం(ఫైనాన్స్, పీ అండ్ పీ) భూపాలపల్లి ఏరియాలో డి.సత్యనారాయణరావు(ఈఎం) రామగుండం-1 ఏరియాలో పాల్గొననున్నారు. కరోనా జాగ్రత్తలను కచ్చితంగా పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యాజమాన్యం కోరింది.
సారథిన్యూస్, రామడుగు: పనుల్లో అలసత్వాన్ని సహించే ప్రసక్తే లేదని డీఆర్డీవో వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం ఆయన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశురాజ్పల్లి గ్రామంలో పర్యటించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు నీరు పట్టేందుకు వెంటనే నీటి తొట్టెల ను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలో రోడ్డుకిరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీడీవో మంజుల దేవి, ఎంపీడీవో మల్హోత్ర, ఎస్సారెస్పీ డీఈ, సర్పంచ్ కోల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ గురువారం శ్రీశైలం– హైదరాబాద్ హైవేపై ఉన్న వెల్దండ తహసీల్దార్ ఆఫీసును ఆకస్మికంగా సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించారు. తహసీల్దార్ సైదులుతో మాట్లాడారు. ఆఫీసు చుట్టూ పచ్చదనం వెల్లివెరిసేలా నాటించిన మొక్కలను చూసి కలెక్టర్ ముగ్ధులయ్యారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా తహసీల్దార్ ఆఫీసు ఆవరణ పచ్చదనంతో పరిఢవిల్లడం ఎంతో అభినందనీయమని అభినందించారు. కార్యాలయ ఆవరణలో రాళ్లగుట్టపై ఖాళీగా ఉన్న స్థలంలో పూలతీగ మొక్కలను పెంచాలని కలెక్టర్ […]
సారథి న్యూస్, మెదక్: పల్లెలను నందనవనాలుగా తీర్చదిద్దాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెగిగ్రేషన్ పనులను త్వరగా పూర్తిచేయడంతో పాటు గ్రామాల్లో ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారాన్ని డ్రై డేగా పాటించాలని ఆదేశించారు. నాటిన మొక్కలను ట్రీగార్డులను ఏర్పాటు చేయాలన్నారు. మెదక్ జిల్లాను ఓడీఎఫ్ ప్లస్ జిల్లాగా […]
సారథి న్యూస్, కర్నూలు: ఖాళీప్రదేశాల్లో మొక్కలు నాటి కాలుష్యాన్ని తరిమివేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ పిలుపునిచ్చారు. 71వ వనమహోత్సవం జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా బుధవారం సామాజిక వనవిభాగం ఆధ్వర్యంలో కర్నూలు నగర శివారులోని వెంగన్నబావి విజయవనం వనమహోత్సవంలో కలెక్టర్ జి.వీరపాండియన్, జేసీ రవిపట్టన్ షెట్టి, కర్నూలు అటవీశాఖ కన్జర్వేటర్ రామకృష్ణ, డీఎఫ్వో మొక్కలు నాటి నీరుపోశారు. అనంతరం రుద్రవరం గ్రామ సమీపంలోని పేదకు పంపిణీ చేయనున్న ఇంటి స్థలాల రోడ్డుకిరువైపులా మొక్కలు నాటారు. కలెక్టర్ […]