తమిళనాడు రాజకీయాల్లో కొంతకాలంగా ఉన్న ఉత్కంఠకు తెరపడింది. అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థిగా ఎడప్పాడి పళనిస్వామి పేరును ఖరారు చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్నది. పళనిస్వామి యే సీఎం అభ్యర్థి అని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం ప్రకటించడం గమనార్హం. సీఎం అభ్యర్థిత్వంపై కొంత కాలంగా పార్టీలో ప్రతిష్ఠంభన నెలకొన్నది. ఇందుకోసం 11 మందితో అన్నాడీఎంకే పార్టీ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. సీఎం అభ్యర్థిత్వంపై కొంతకాలంగా ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. ప్రస్తుతం రమేశ్ ఆస్పత్రి, స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదంపై అధికార ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. రమేశ్ ఆస్పత్రి కరోనా పేషెంట్లను స్వర్ణప్యాలెస్ హోటల్లో ఉంచి చికిత్స అందించింది. ఈ క్రమంలో అగ్నిప్రమాదం జరిగి అందులో ఉన్న 10 మంది చనిపోయారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాగా, రమేశ్ ఆస్పత్రి యజమాని రమేశ్‌బాబు పరారీలో ఉన్నాడు. రమేశ్ బాబు కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి ప్రభుత్వం కక్ష గట్టిందని.. ప్రతిపక్ష టీడీపీ […]
న్యూఢిల్లీ: రాజస్థాన్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌ను రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషి సోమవారం ఉపసంహరించుకున్నారు. సచిన్ పైలట్‌తో పాటు 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. కాగా పైలట్ వర్గం హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే విధించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ స్పీకర్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే తాజాగా ఆయన తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. రాజస్థాన్ సంక్షోభాన్ని […]
జైపూర్: రాజస్థాన్ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. సచిన్ పైలట్‌కు హైకోర్టులో మరోసారి ఊరట దక్కింది. సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలపై రాజస్థాన్ స్పీకర్ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. కాగా దీనిపై పైలట్ ఇప్పటికే కోర్టుకు వెళ్లారు. గురువారం దీనిపై కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. ఈ క్రమంలో ఈకేసులో కేంద్రాన్ని కూడా చేర్చాలంటూ పైలట్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీనిని కోర్టు స్వీకరించింది. ఈ కేసులో తుదితీర్పు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున ఎమ్మెల్యేల అనర్హత […]
ఢిల్లీ: రాజస్థాన్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సచిన్ పైలట్ వర్గంపై ఈనెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ రాజస్థాన్ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాలుచేస్తూ స్పీకర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం రాజస్థాన్ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది. దీంతో సచిన్ పైలట్ వర్గానికి మరోసారి ఊరట లభించింది. స్పీకర్ లేవనెత్తిన అంశాలపై సుధీర్ఘ విచారణ చేపడతామని […]
జైపూర్: రాజస్థాన్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షేకావత్ తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. గజేంద్రసింగ్ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న ఓ ఆడియోను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఆ వాయిస్ తనది కాదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఆడియోటేపుల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరపాలనీ బీజేపీ నేత సంబిత్ పాత్రా డిమాండ్ చేశారు.