హయత్‌నగర్‌లో కార్యకర్తలతో భారీర్యాలీ ఆయన వెంటే పలువురు అనుచరులు సారథి న్యూస్, ఎల్బీ నగర్: హయత్‌నగర్ డివిజన్‌కు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి ఆ పార్టీని వీడారు. శనివారం ఆయన పెద్దసంఖ్యలో తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి టీడీపీ హయత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు దాసరమోని శ్రీనివాస్ ముదిరాజ్ సమక్షంలో నియోజకవర్గ ఇన్చార్జ్ ఎస్వీ క్రిష్ణప్రసాద్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. హయత్‌నగర్ డివిజన్ కేంద్రంలో టీడీపీ జెండాను ఎగరవేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు […]
ఫిర్యాదుచేసిన వ్యక్తికే తెలియకుండా.. కేసు నమోదు ఎస్పీని కలుస్తానన్న ఫిర్యాదుదారుడు సారథి న్యూస్, కర్నూలు: లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కైలాస్ నాయక్ అరెస్టు వెనక రాజ‘కీ’య కారణాలు ఉన్నాయనే విమర్శలు వ్కక్తమవుతున్నాయి. జిల్లాలోని కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని కర్నూలు మండలం సుగాలితండాకు చెందిన 150 కుటుంబాలకు రుద్రవరం గ్రామంలో 1975లో అప్పటి ప్రభుత్వ ఐదెకరాల చొప్పున పంపిణీ చేసింది. సర్వేనం.507‘ఏ’ లోని దాదాపు 95 ఎకరాలను ఇటీవల పేదలకు ఇళ్లస్థలాల కోసం రాష్ట్ర […]
ఢిల్లీ: తీవ్ర గందరగోళ పరిస్థితుల నడుమ నిన్న రాజ్యసభలో వ్యవసాయ బిల్లులు ఆమోదించిన సంగతి చెలరేగింది. బిల్లు చర్చ సందర్భంగా పలువురు ఎంపీలు రాజ్యసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఓ దశలో చైర్మన్ పోడియం దగ్గరకు వెళ్లి పెద్దపెట్టు నినాదాలు చేశారు. కాగా సభలో అనుచితంగా ప్రవర్తించిన ఎనిమిది మంది ఎంపీలపై సోమవారం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సస్పెండ్ వేటు వేశారు. వారంపాటు వీరిని సభనుంచి బహిష్కరించారు. సోమవారం సభ ప్రారంభంకాగానే మంత్రి ప్రహ్లద్జోషి సస్పెన్షన్ […]
సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విధ్వంసక్రీడను ప్రోత్సహిస్తోందని, హిందూదేవాయాలపై దాడులు జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పార్థసారథి ప్రశ్నించారు. అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి రథాన్ని దగ్ధం చేసిన దోషులను అరెస్టు చేయకుండా.. దాడులపై ప్రశ్నించిన హిందూ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇచ్చిన పిలుపు మేరకు.. అంతర్వేది ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో వరుసగా షాకులు తగులుతున్నాయి. ఏపీలో పత్రికలకు ప్రకటనలు ఇవ్వడంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, పక్షపాత వైఖరిపై సామాజిక కార్యకర్త నాగశ్రవణ్ వేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. అధికార పార్టీకి చెందిన పత్రికకు 52 శాతం ప్రకటనలు ఇస్తున్నారని నాగశ్రవణ్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. అయితే టీడీపీ నేతలే పిటిషన్ వేయించారని, పిల్‌ను తిరస్కరించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై పిటిషనర్ తరఫున న్యాయవాది దమ్మాలపాటి […]
సారథిన్యూస్, విశాఖపట్టణం: సీఎం జగన్మోహన్రెడ్డి అండతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. దళితులపై వరుస దాడులు జరుగుతుంటే సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆదివారం విశాఖపట్టణం జిల్లా తెలుగుదేశంపార్టీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖలో దళితుడి భూఆక్రమణను ఖండించారు. రాష్ట్రంలో ప్రతిరోజు దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. జగన్ ఉదాసీన వైఖరితోనే దాడులు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి […]
సారథిన్యూస్, అమరావతి: ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు ఎట్టకేలకు బెయిల్ దొరికింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని హైకోర్టు ఆదేశించింది. రిమాండ్‌లో ఉన్న అచ్చెన్నాయుడుకు కొంత కాలంగా కరోనా, ఇతర అరోగ్యసమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రమేష్ ఆస్పత్రి, ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందించింది. ఈఎస్‌ఐ స్కాంలో రూ. 150 కోట్లు అవకతవకలు జరుగడంతో అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు […]
అమరావతి, సారథిన్యూస్: టీడీపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. ‘నాకు కరోనా సోకింది. ప్రస్తుతం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. 14 రోజులు క్వారంటైన్లో ఉండాలని వైద్యులు సూచించారు. కొన్నిరోజుల పాటు కార్యకర్తలు, అభిమానులు ఎవరూ నా వద్దకు రావొద్దు. టీడీపీ అధినేత చంద్రబాబు, కార్యకర్తల ఆశీస్సులతో త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మీ ముందుకు వస్తా’ అంటూ ఆయన ట్వీట్టర్లో పేర్కొన్నారు. మరోవైపు […]