సారథిన్యూస్, గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా రామేశ్వరమ్మ ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం రామేశ్వరమ్మకు రాష్ట్ర ప్రభుత్వం నియామక ఉత్తర్వులు అందజేసింది. ఈ సందర్భంగా ఆమెను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అభినందించారు. రామేశ్వరమ్మ నేతృత్వంలో మార్కెట్‌కమిటీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ఆకాంక్షించారు. కాగా తనపై నమ్మకం ఉంచి పదవి కట్టబెట్టినందుకు రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి రామేశ్వరమ్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సారథిన్యూస్, రామడుగు: మోతే రిజర్వాయర్ నిర్మాణంపై అవగాహన లేకే కాంగ్రెస్ నేతలు ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తున్నారని సింగల్‌విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర్రావు విమర్శించారు. సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా రామడుగులో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ను విమర్శించే స్థాయి మేడిపల్లి సత్యానికి లేదని పేర్కొన్నారు. మోతే రిజర్వాయర్ తూముల గురించి సరైన అవగాహన లేకుండా సత్యం నోటికొచ్చిన ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే సహించేది లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు గంట్లా […]
సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ రాష్ట్రంలో పేదల ప్రభుత్వం కొనసాగుతున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. మంగళవారం మెదక్ జిల్లా నిజాంపేట, రామాయంపేట మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
సారథి న్యూస్, దేవరకద్ర: పేద ప్రజలకు సంక్షేమపథకాలను అమలుచేయడంలో తెలంగాణ రాష్ట్రం.. దేశంలోనే అగ్రగామిగా ఉన్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన కొత్తకోటలో గ్రీన్ ఆగ్రో స్టోర్‌ను ప్రారంభించారు. అనంతరం భూత్పూరు మండలం అన్నసాగర్, మూసాపేట మండలకేంద్రంలో పలువరు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సారథిన్యూస్, రామడుగు: టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లతో పేదల సొంత ఇంటి కల సాకారమవుతున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పథకం బృహత్తరమైనదని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం పనులు వేగవంతం చేసి పేదలకు త్వరితగతిన అందించేలా అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో […]
సారథిన్యూస్, సత్తుపల్లి: ప్రజలంతా మట్టిగణపతినే పూజించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. శుక్రవారం ఆయన మాధురి మెడికల్స్ ఆధ్వర్యంలో ప్రజలకు మట్టిగణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రకృతిని కాపాడుకోవడం మానవ ధర్మం, పర్యావరణ పరిరక్షణకు గాను ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను పూజించాలన్నారు.
కోల్‌కతా: కరోనా బారిన పడి మరో ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా ఈగ్రా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే సమరేష్ దాస్ కొంతకాంగా కరోనాతో బాధపడుతున్నారు. కరోనా విపత్తువేళ ఆయన నియోజకవర్గంలో పర్యటించి పేదప్రజలకు సేవచేశారు. కూరగాయలు, నిత్యావసరసరుకులు పంపిణీ చేసేవారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా సోకింది.దీంతో కోల్‌కతాలోని ఒక ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న సమరేస్ సోమవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. అంతకుముందు జూన్‌లో టీఎంసీ ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్(60)కరోనాతో మృతి […]
సారథిన్యూస్, రామగుండం: ఎన్టీపీసీకి చెందిన ఓ పేదయువతి వివాహానికి విజయమ్మ ఫౌండేషన్ ఆసరాగా నిలిచింది. పెదపల్లి జిల్లా రామగుండం పరిధిలోని న్యూమారేడుపాకలోని మల్లికార్జున స్వామి దేవాలయంలో మేఘన అనే యువతికి వివాహం జరిగింది. మేఘన తల్లిదండ్రులు పేదరికంలో ఉండటంతో విషయం తెలుసుకున్న రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్.. పేద యువతి వివాహానికి ఆర్థిక సహాయం అందించాలని విజయమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు కోరుకంటి మనిదీప్ ను అదేశించారు. దీంతో విజయమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు కోరుకంటి మణిదీప్ యువతికి […]