Breaking News

సంగారెడ్డి

అందరికీ అండగా ఉంటాం

అందరికీ అండగా ఉంటాం

సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: పటాన్ చెరువు మండలం ముత్తంగి బాలికల గురుకుల పాఠశాలను మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. గురుకుల పాఠశాలలో నిన్న కరోనా కలకలం రేగిన విషయం తెలిసిందే. పాఠశాలలోని ఉపాధ్యాయురాలు పాటు 43 మందికి కరోనా పాజిటివ్ రావడంతో పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు,  పాఠశాల సిబ్బందితో మాట్లాడారు.  భయం భయం వద్దని, అందరికీ అండగా జిల్లా యంత్రాంగం […]

Read More
ప్రణాళికలు సిద్ధం చేయాలి

ప్రణాళికలు సిద్ధం చేయాలి

సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: లక్ష్యం మేరకు జిల్లాలో మొక్కలు నాటేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన చాంబర్లో  జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ 2022 నుంచి  2024 సంవత్సరం వరకు మూడేళ్లపాటు జిల్లాలో వివిధ శాఖల ద్వారా నాటాలల్సిన మొక్కల లక్ష్యాలను నిర్దేశించారు. జిల్లాలో 2022 సంవత్సరంలో 46.06 […]

Read More
టీఆర్ఎస్ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యం

టీఆర్ఎస్ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యం

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ వల్లే ఓటర్లకు ఫోన్లు, టూర్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి  సామాజిక సారథి, సంగారెడ్డి:  టీఆర్ఎస్ పార్టీ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యం అయిపోయాయని,  ఉమ్మడి మెదక్ జిల్లాలోని 1027మంది  ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తూర్పు నిర్మలారెడ్డిని గెలిపించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. సంగారెడ్డి పట్టణంలోని ఒక హోటల్ లో మంగళవారం సాయంత్రం డీసీసీ అధ్యక్షురాలు, స్థానిక సంస్థల అభ్యర్థి తూర్పు […]

Read More
నెలసంది గోసపడుతున్నం

నెలసంది గోసపడుతున్నం

కొనమని వేడుకున్నా అధికారులు పట్టించుకుంటలేరు రేపటిలోగా కొనపోతే కుప్పపోసి అంటుపెడ్తం మంత్రి హరీశ్​రావు ఎదుట అన్నదాతల గగ్గోలు సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: ‘నెలరోజులుగా వరి కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు గాస్తున్నాం. మా పంటను కొనుగోలు చేయమని వేడుకున్నా అధికారులు స్పందించడం లేదు’ అని రైతులు మంత్రి హరీశ్​రావు ఎదుట గోడును వెళ్లబోసుకున్నారు. వడ్లను రైస్ మిల్లు యాజమాన్యాలు కూడా కొనుగోలు చేయడం లేదని ఆయన దృష్టికి తెచ్చారు. తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఒక్కసారి […]

Read More
బస్సులో మహిళ వద్ద నుంచి

బస్సులో మహిళ వద్ద నుంచి

లక్ష రూపాయల నగదు, బంగారం చోరీ సామాజిక సారథి, సంగారెడ్డి: సదాశివపేటలో బస్సు ఎక్కిన మహిళ వద్ద నుంచి లక్ష రూపాయల నగదు, మూడు మాసాల బంగారం చోరి జరిగింది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన విజయలక్ష్మీ తన భర్త ,కూతురుతో హైదరాబాద్ వెళ్లేందుకు సోమవారం ఉదయం 11 గంటలకు సంగారెడ్డి బస్సు ఎక్కారు. బస్సు నందికంది వద్దకు చేరుకోగానే విజయలక్ష్మి టిక్కెట్ తీసుకునేందుకు చిల్లర కోసం […]

Read More
వచ్చే నెల10లోగా..

వచ్చే నెల 10లోగా..

డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పూర్తి కావాలి కలెక్టర్ హనుమంతరావు సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి ప్రారంభించడానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. డిసెంబర్ పదవ తేదీలోపు ఇళ్ల నిర్మాణాలను పూర్తి సిద్ధం చేయాలన్నారు. అన్ని మౌలిక వసతులతో పాటు అందించాలన్నారు. నిర్మాణంలో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వాలన్నారు. ఆయా పనులన్నింటినీ పూర్తిచేసి  ప్రారంభించడానికి సిద్ధం చేసేలా దృష్టి […]

Read More
ఎమ్మెల్సీగా గెలుస్తాం..

ఎమ్మెల్సీగా గెలుస్తాం..

లేదంటే పార్టీ పదవీ నుంచి తప్పుకుంటా.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సామాజికసారథి, సంగారెడ్డి: పూర్వ మెదక్‌ జిల్లాలో స్థానిక సంస్థల కాంగ్రెస్‌ అభ్యర్థికి  230 ఓట్లు వస్తాయని,  రాకపోయినా, ఎన్నికల్లో గెలవకపోయినా పార్టీ పదవీ నుంచి తప్పుకుంటానని కాంగ్రెస్‌ వర్కింగ్​ ప్రసిడెంట్​ ఎమ్మెల్యే  జగ్గారెడ్డి ప్రకటించారు.  మెదక్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిని పెట్టడం వల్లే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు విలువ పెరిగిందన్నారు.   వరి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రగడ చేస్తున్నాయన్నారు.  కొనుగోలు ఆలస్యంతో ధాన్యం మొలకెత్తి రైతులు […]

Read More
సమ్మె విరమణ... విధుల్లో చేరిక

సమ్మె విరమణ… విధుల్లో చేరిక

విధుల్లో చేరిన గణపతి కార్మికులు సమ్మె విరమణ, విధుల్లో చేరిక సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: నూతన వేతన సవరణ చేయాలంటూ గత 34రోజులుగా గణపతి చక్కెర పరిశ్రమ కార్మికులు కార్మికులు సమ్మె చేస్తుంన్రు. కార్మికుల సమ్మె న్యాయబద్దంగా ఉండడంతో కార్మికుల డిమాండ్లను అంగీకరిస్తూ కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ సమక్షంలో యాజమాన్యానికి, కార్మికుల మధ్య ఒప్పందం కుదిరింది. దుబ్బాక ఎమ్మెల్యే, చక్కెర పరిశ్రమ కార్మిక సంఘం అధ్యక్షుడు రఘునందన్ రావు నేతృత్వంలో కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ […]

Read More