సామజిక సారథి, వాజేడు: సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు అధికంగా ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో వారు స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో 163 జాతీయ రహదారి పై గురువారం పేరూరు ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో విస్తృత వాహనాల తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ .సివిల్ కానిస్టేబుల్ . తదితరులు పాల్గొన్నారు.
సామాజిక సారథి, వరంగల్: తన భూమిలో అక్రమంగా బోరు వేసిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని వికలాంగుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. వరంగల్ నగర పరిధిలోని కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన వికలాంగుడైన సయ్యద్ అసద్ కి సంబంధించిన భూమిపై కోర్టు ఇచ్చిన తీర్పు జడ్జ్ మెంట్ ను కూడా తప్పుదోవ పట్టి తన భూమిలో అక్రమంగా బోరు వేశారని అసద్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమార్కులు మమ్మల్ని ఎవరు […]
సామాజిక సారథి, ధర్మసాగర్: హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రం లోని ఎంపీడీవో కార్యాలయంలో ఎన్ ఆర్ ఈ జీ ఎస్ టెక్నీకల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న యాదగిరి రైతు లింగయ్య దగ్గర రూ. 10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. మజ్జిగ లింగయ్య ఎన్ ఆర్ ఈ జీ ఎస్ కింద నువ్వుల పంట మెయింటైన్ బిల్లు మంజూరు కోసం యాదగిరిని ఆశ్రయించగా లింగయ్య దగ్గర రూ. 10 వేలు లంచం […]
సామజిక సారథి, ములుగు ప్రతినిధి: జిల్లాలో ఈవీఎం గోడౌనల నిర్మాణం చేపట్టాలని ఎలక్షన్ సీఈవో శశాంక్ గోయల్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం విచ్చేసిన ఎలక్షన్ సీఈవో శశాంక్ గోయల్ కి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, డీఆర్వో రమాదేవి పుష్పగుచ్ఛం తో స్వాగతం పలికారు. అనంతరం నూతనంగా నిర్మించిన ఎలక్షన్ ఈవీఎం గోడౌన్ ను ఎలక్షన్ సీఈవో, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యతో కలిసి ప్రారంభించారు.ఈవీఎం గోడౌన్ పరిశీలించి అత్యంత నాణ్యత ప్రమాణాలతో […]
అధిష్టానం మెచ్చినోడు.. బరి గీసి నిలిచినోడు.. ప్రజల మనసును గెలిచినోడు.. పేదల మన్ననలు పొందినోడు ఆయనే ఆరూరి రమేష్ ఎమ్మెల్యేగా అష్ట వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కథనం.. సామాజిక సారథి,వరంగల్ ప్రతినిధి: అధిష్టానం మెచ్చినోడు..బరి గీసి నిలిచినోడు.. ప్రజల మనసును గెలిచినోడు..పేదల మన్ననలు పొందినోడు..వెనకబడిన తరగతిలో పుట్టినోడు.. ఆయనే అరూరి రమేష్.. ప్రస్తుతం వర్ధన్నపేట ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేగా అష్ట వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక సారథి ప్రత్యేక కథనం.. నియోజకవర్గ ప్రజలకు […]
సామజిక సారథి, ములుగు ప్రతినిధి: ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవలే తల్లిదండ్రులను కోల్పోయి నిరశ్రాయులుగా మారిన ఆడపిల్లలకు శనివారం ఆమె ఆసరాగా నిలిచారు. ములుగు జిల్లా జగ్గన్నగూడెం గ్రామానికి చెందిన పైడయ్య మరణించడంతో నలుగురు అమ్మాయిలు నిరశ్రాయులుగా మారారు. అతడి దహన సంస్కారాలు కోసం తస్లీమా సహాయం చేసిన విషయం అందరికి విదితమే. సోమవారం అతడి దశదినకర్మ కావడంతో కార్యక్రమం చేయడానికి కూడా స్థోమత లేక […]
అధికారులతో మంత్రి దయాకర్ రావు సమీక్ష సామాజికసారథి, ఐనవోలు: వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరకు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆలయాధికారులు, అర్చకులను ఆదేశించారు. జనవరి 13,14,15 తేదీల్లో మూడు రోజులపాటు జరిగే జాతరకు భక్తులు అశేషంగా తరలివస్తారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, భద్రత, డార్మెటరీలు, చలువ పందిళ్లు, మంచినీటి వసతి, స్నానాల గదులు, బట్టలు మార్చుకునే గదులు, మహిళలకు ప్రత్యేక వసతులు, క్యూ లైన్లు, విద్యుత్, సీసీకెమెరాలు, […]
పోలీసు ఇన్ఫార్మర్లకు హెచ్చరికలు సామాజిక సారథి, వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కొండాపురం గ్రామ సమీపంలోని భద్రాచలం, వెంకటాపురం ప్రధాన రహదారిపై వెలసిన మావోయిస్టు కరపత్రాలు వెలువడ్డాయి. మావోయిస్టుల వారోత్సవాలు ముగిసిన అనంతరం లేఖ వెలువడటంతో ఈలేఖ స్థానికంగా కలకలం రేపుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం గుప్పిట్లో ఏజెన్సీ గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులుకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్న బొల్లారం, పెంకవాగు, కలిపాక, సీతారాంపురం గ్రామాలకు చెందిన వ్యక్తులు మావోయిస్టుల గురించి పోలీసులకు సమాచారం ఇస్తున్నారని పోలీసులు చూపే ప్రలోభాలకు, […]