Breaking News

రైతు వేదిక

పంటలో సస్యరక్షణ పాటించాలి

పంటలో సస్యరక్షణ పాటించాలి

సారథి న్యూస్, రామాయంపేట: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి పంటలో అధిక దిగుబడులను పొందడానికి రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలని కృషివిజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్ సూచించారు. మంగళవారం ఆయన మండలంలోని నార్లాపూర్ గ్రామ రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వరి పంటలో మొగి పురుగు నివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలను చల్లుకోవాలని, అలాగే అగ్గితెగులు నివారణకు ట్రైసైక్లోజోల్ లేదా కాసుగామైసీన్ ను పిచికారీ చేయాలని సూచించారు. రైతులంతా […]

Read More
పంట మార్పిడితో రైతులకు మేలు

పంట మార్పిడితో రైతులకు మేలు

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: రైతులు ఒకే రకం పంట పండించకుండా పంట మార్పిడి నేర్చుకోవాలని మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రైతులకు సూచించారు. బుధవారం గవ్వలపల్లిలో రైతువేదికలో అపరాలు, నూనెగింజల పంటలపై రైతులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. రైతులకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం రైతులకు విత్తనాలను పంపిణీచేశారు. మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్​ రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చేతుల మీదుగా మొట్టమొదటి రైతు వేదికను ప్రారంభించడంతో పాటు, మొట్టమొదటి […]

Read More
బీజేపీ కార్యకర్తల అరెస్ట్​

బీజేపీ కార్యకర్తల అరెస్ట్​

సారథి న్యూస్, బిజినేపల్లి: రైతు వేదికల ప్రారంభం సందర్భంగా నిరసన తెలిపేందుకు వచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్​చేశారు. పాలెం గ్రామంలో నిర్మించిన రైతు వేదికను బుధవారం ప్రారంభించేందుకు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ వస్తున్నారన్న విషయం తెలుసుకుని పెద్ద సంఖ్యలో వివిధ గ్రామాల నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. రైతువేదిక భవనాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి లక్షల రూపాయలు వస్తుంటే ప్రధాని నరేంద్రమోడీ చిత్రపటం […]

Read More
రైతువేదికలు, ప్రకృతివనాలు పూర్తికావాలె

రైతువేదికలు, ప్రకృతివనాలు పూర్తికావాలె

సారథి న్యూస్, మెదక్: జిల్లావ్యాప్తంగా రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాల పనులను వేగవంతం చేసి వీలైనంత త్వరగా వాటిని అందుబాటులోకి తీసుకురావాలని మెదక్ జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు సూచించారు. మంగళవారం జిల్లాలోని ఆయా మండలాల ప్రత్యేకాధికారులు, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ డీఈలు, ఏఈలు, ఎంపీడీవోలు, మండల వ్యవసాయధికారులు, విస్తరణాధికారులతో కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతువేదికలు, పల్లె ప్రకృతి వనాల పనులు చాలా […]

Read More
రైతు వేదికకు రూ.12లక్షల విరాళం

రైతు వేదికకు రూ.12లక్షల విరాళం

సారథి న్యూస్, రామాయంపేట: నిజాంపేట క్లస్టర్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతువేదిక నిర్మాణం కోసం ప్రముఖ పారిశ్రామికవేత్త, సంఘ సేవకులు అందె ప్రతాప్ రెడ్డి రూ.12లక్షల చెక్కును డీడీఏవో పరుశురాం నాయక్ కు అందజేశారు. మండల రైతుల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, తహసీల్దార్ జయరాం, ఏవో సతీశ్ తదితరులు పాల్గొన్నారు.

Read More
చకచకా రైతు వేదిక పనులు

చకచకా రైతు వేదిక పనులు

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామంలో రైతు వేదిక నిర్మాణాలు చకచకా కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు వేదికలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ తమన్నా గారి కృష్ణవేణి అన్నారు. రైతువేదికలను కల్వకుంటలో పూర్తి కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. రైతులు తమ పంటలను గిట్టుబాటు ధర నిర్ణయించే అధికారం రైతులకు ఉండాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More
రైతు వేదికలు ముస్తాబు

రైతు వేదికలు ముస్తాబు

దసరా రోజున భవనాల ప్రారంభోత్సవం జోగుళాంబ గద్వాల జిల్లాలో నిర్మాణాలు పూర్తి సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): వ్యవసాయమే పరమావధిగా భావించే రాష్ట్ర రైతాంగానికి టీఆర్ఎస్ ప్రభుత్వం మరింత చేయూతనందిస్తోంది. రైతుల ఆలోచనలు, అధికారుల సూచనలను పంచుకునేందుకు వీలుగా సీఎం కేసీఆర్​రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కనీసం రెండువేల మంది రైతులు ఒకేసారి ప్రభుత్వం ఏర్పాటుచేసే అవగాహన సదస్సుకు హాజరయ్యేలా అన్ని హంగులతో తీర్చిదిద్దుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని 12 మండలాల్లో సుమారు 97భవనాల నిర్మాణాలు […]

Read More
రైతు వేదికలు అక్టోబర్ 15 నాటికి పూర్తికావాలె

రైతు వేదికలు అక్టోబర్ 15 నాటికి పూర్తిచేయాలి

సారథి న్యూస్​, నాగర్​కర్నూల్​: నాగర్ కర్నూల్​ జిల్లాలో నిర్మిస్తున్న 461 శ్మశాన వాటికలు,143 రైతు వేదికల నిర్మాణాలు అక్టోబర్ 15 నాటికి పూర్తికావాలని కలెక్టర్​ఎల్.శర్మన్​ ఆదేశించారు. సంబంధిత ఇంజనీరింగ్​అధికారులతో ఆయన సమీక్షించారు. వివిధ దశల్లో కొనసాగుతున్న పనులకు ఇప్పటివరకు బిల్లులు మంజూరు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్థాయిలో సర్పంచ్​లు నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణ పనుల్లో పురోగతి లేకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి కంప్లీట్ చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఇంజనీరింగ్ చీఫ్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ రైతు […]

Read More