సారథి న్యూస్, ములుగు: తరచూ సామాజిక సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉండే ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ కు అరుదైన గుర్తింపు దక్కింది. హైదరాబాద్కు చెందిన ఇంద్రోజిర రమేష్ అనే యువకుడు మంగళవారం ఆమె ఫొటోలతో కూడిన జ్ఞాపికను అందజేశాడు. తస్లీమా రైతు ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు సెలవు రోజుల్లోనూ వ్యవసాయ పనులు చేస్తూ.. నిరుపేదలకు చేయూతనందిస్తూ.. అనాథలు, అభాగ్యుల ఆకలి తీరుస్తుంటారు. ఈ విషయాలను సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న […]
సారథి న్యూస్, నూగూరు, వెంకటాపురం: ఏజెన్సీ ప్రాంతంలోకి గిరిజనేతరుల వలసలను నిరోధించాలని ఆదివాసీ నవనిర్మాణ సేన (ఏఎన్ఎస్) ములుగు జిల్లా అధ్యక్షుడు ఎట్టి విద్యాసాగర్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఏఎన్ఎస్ మండలాధ్యక్షుడు పోలేబోయిన భార్గవ్ అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వెంకటాపురం, వాజేడు మండలంలో ఇసుక, గ్రావెల్ దందా అధికారుల అండదండలతో జరుగుతోందన్నారు. ఆదివాసీలు రాజకీయ పార్టీల కుట్రలను పసిగట్టాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాన్ని విభజించి ఆదివాసీల ఐక్యతను దెబ్బతీశారని, ఏజెన్సీ ప్రాంతాన్ని అంతా […]
సారథి న్యూస్, ఎల్బీనగర్: కొంతకాలంగా బకాయిలో ఉన్న జీతాలను వెంటనే చెల్లించి తమను విధుల్లోకి తీసుకోవాలని శ్రీచైతన్య కాలేజీ ఎదుట అధ్యాపకులు ఆందోళనకు దిగారు. మంగళవారం ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని చైతన్యపురిలో శ్రీచైతన్య కాలేజీ బ్రాంచ్లో క్లాస్రూమ్లోకి వెళ్లి అధ్యాపకులు స్వీయనిర్బంధం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏడాది కాలంగా యాజమాన్యం జీతాలు ఇవ్వకుండా వేధిస్తోందని బాధిత లెక్చరర్లు ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ.. తమకు మాత్రం జీతాలు […]
సారథి న్యూస్, రామాయంపేట: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి పంటలో అధిక దిగుబడులను పొందడానికి రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలని కృషివిజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్ సూచించారు. మంగళవారం ఆయన మండలంలోని నార్లాపూర్ గ్రామ రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వరి పంటలో మొగి పురుగు నివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలను చల్లుకోవాలని, అలాగే అగ్గితెగులు నివారణకు ట్రైసైక్లోజోల్ లేదా కాసుగామైసీన్ ను పిచికారీ చేయాలని సూచించారు. రైతులంతా […]