Breaking News

రామాయంపేట

మొక్క నాటి ఎమ్మెల్సీకి విషెస్​

మొక్క నాటి ఎమ్మెల్సీకి విషెస్​

సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్​రావు రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరి సుభాశ్​ రెడ్డి జన్మదిన సందర్భంగా సోమవారం నిజాంపేట జడ్పీటీసీ సభ్యుడు పంజా విజయ్ కుమార్ తన నివాసంలో మొక్కనాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన జన్మదిన వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలని ప్రతిఒక్కరూ మొక్కను నాటి శుభాకాంక్షలు తెలపాలని పిలుపు ఇవ్వడంతో మొక్కలను నాటినట్లు తెలిపారు.

Read More
మత్స్యకారులను ఆదుకుంటాం

మత్స్యకారులను ఆదుకుంటాం

సారథి న్యూస్, రామాయంపేట: మత్స్యకారులను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఎంతో కృషిచేస్తోందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మెదక్​ జిల్లా రామాపంపేట మండలం డీ. ధర్మారంలోని ఊరచెరువులో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద 1.76కోట్ల చేపపిల్లలను వదిలారు. మత్స్యకారులు దళారులను నమ్మకుండా చేపలను సొంతంగా మార్కెటింగ్​ చేసుకునేలా అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం గ్రామంలో రూ.16 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనంతో పాటు డంప్​యార్డు, వైకుంఠధామాలను […]

Read More
సీఎం రిలీఫ్​పండ్​ చెక్కుల పంపిణీ

సీఎం రిలీఫ్​పండ్​ పేదలకు వరం

సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ రాష్ట్రంలో సీఎం రిలీఫ్​ఫండ్​ పేదలపాలిట వరంలా మారిందని నిజాంపేట ఎంపీపీ సిద్ధరాములు పేర్కొన్నారు. సోమవారం నిజాంపేట మండలం నార్లాపూర్​కు చెందిన రాజశేఖర్​కు ఆయన రూ.14 వేల సీఎం రిలీఫ్​ఫండ్​ చెక్కును అందజేశారు. ఆయన వెంట నార్లాపూర్ సర్పంచ్ అమర్​సేన్​రెడ్డి, తిరుపతి తదితరులు ఉన్నారు.

Read More
ఔరా.. మధుసూదన్ ఖజానా

ఔరా.. మధుసూదన్ ఖజానా

అందరిలా సాధారణంగా జీవిస్తే అందులో ప్రత్యేకత ఏముంటుంది. భిన్నంగా ఏదైనా చేస్తేనే సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు దక్కుతాయి. అంతకు మించి ఆత్మ సంతృప్తి దొరుకుంది. అచ్చం అలాగే ఆలోచించారు మెదక్ ​జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన రిటైర్డ్ టీచర్​ మధుసూదన్. సారథి న్యూస్, మెదక్: సాధారణంగా టీచర్ల వద్ద పుస్తకాలు ఉంటాయి. కానీ ఆయన వద్ద మాత్రం దేశవిదేశాలకు చెందిన వందల ఏళ్ల నాటి స్టాంపులు, నాణేలు, కరెన్సీ నోట్లు ఉంటాయి. దాదాపు 60 ఏళ్ల […]

Read More

దూదేకుల సంఘం ఎన్నిక

సారథి న్యూస్,రామాయంపేట: మెదక్​ జిల్లా రామాయంపేట మండల దూదేకుల (నూర్బాష్​) సంఘాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కన్వీనర్​గా ఖాసీం సాబ్​, కోకన్వీనర్​గా ఫిరోజ్​, కోశాధికారిగా ఇమామ్​ సాబ్​, సలహాదారుడిగా అహ్మద్​ పాషాను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన మండల కమిటీ సభ్యులకు జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ పాషా, కోఆప్షన్ సభ్యుడు గౌస్ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మెదక్​ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎండీ అజ్గర్, జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ పాషా, జిల్లా నాయకులు ఇబ్రాహీం, బాబు మియా,గౌస్ […]

Read More

‘ఉపాధి’ పనిదినాలు పెంచండి

సారథి న్యూస్, రామాయంపేట: జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకం పనిదినాలను 200 రోజులకు పెంచాలని దళిత బహుజలన ఫ్రంట్​ జాతీయ కార్యదర్శి పీ శంకర్​ డిమాండ్​ చేశారు. సోమవారం నిజాంపేట మండలం చల్మెడలో జాతీయ ఉపాధి హామీ హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లాక్ డౌన్ తో నిరుద్యోగం పెరిగి లక్షలమంది గ్రామాలకు తిరిగి వచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో డీబీఆర్సీ జిల్లా కో ఆర్డినేటర్​ దుబాషి సంజివ్ బుచ్చయ్య, మల్లేశం, పరుశరాములు, స్వామి, […]

Read More

ఇన్​సెంటివ్​, జీతం ఇవ్వండి

సారథి న్యూస్, రామాయంపేట: కరోనా విధుల్లో ఫస్ట్ వారియర్స్ గా ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు సీఎం కేసీఆర్ రూ.ఐదువేల ఇన్​సెంటివ్​ ప్రకటించగా, సీఎం కేసీఆర్ ప్రకటించిన ఇన్​సెంటివ్​తో పాట పెరిగిన రూ.8,500 జీతం ఇవ్వాలని పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన బాటపట్టారు. సోమవారం రాత్రి మెదక్​ జిల్లా ఉమ్మడి రామాయంపేట మండలాల్లో పారిశుద్ధ్య కార్మికులు ఆయా పంచాయతీ ఆఫీసుల వద్ద ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. పంచాయతీ కార్మికుల మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, జీవోనం.51 పేరుతో […]

Read More