న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, లోక్‌జన శక్తి పార్టీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ గురువారం సాయంత్రం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తన తండ్రి చనిపోయినట్టు ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ‘మిస్ యూ పాప్పా’ అంటూ చిరాగ్ ట్వీట్ చేశారు.ఆయన కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలే ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటంతో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు ఆయన […]
తమిళనాడు రాజకీయాల్లో కొంతకాలంగా ఉన్న ఉత్కంఠకు తెరపడింది. అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థిగా ఎడప్పాడి పళనిస్వామి పేరును ఖరారు చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్నది. పళనిస్వామి యే సీఎం అభ్యర్థి అని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం ప్రకటించడం గమనార్హం. సీఎం అభ్యర్థిత్వంపై కొంత కాలంగా పార్టీలో ప్రతిష్ఠంభన నెలకొన్నది. ఇందుకోసం 11 మందితో అన్నాడీఎంకే పార్టీ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. సీఎం అభ్యర్థిత్వంపై కొంతకాలంగా ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు […]
తమిళనాడుకు చెందిన కళ్లకురిచచి ఎమ్మెల్యే ప్రభు(34) ప్రేమ వివాహం రచ్చ రచ్చగా మారింది. ఎమ్మెల్యే ప్రభు.. సౌందర్య అనే బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లి సౌందర్య తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అర్చకుడిగా పనిచేస్తున్న ఆయన తన కూతురు ఎమ్మెల్యే కిడ్నాప్ చేశాడని.. ఆమె ఇంకా మైనర్ అంటూ మద్రాస్ హై కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసుపై బుధవారం కోర్లు విచారించనున్నది. ఇప్పటికే సౌందర్య పోలీసుల […]
బాలీవుడ్ డేరింగ్ బ్యూటీ, వివాదాస్పద నటిపై ఇప్పడు సోషల్‌మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతి విషయంపై స్పందించే కంగనా రనౌత్ యూపీలోని హథ్రాస్ జిల్లాలో ఓ మైనర్ బాలికపై జరిగిన దారుణ ఘటనను ఎందుకు ఖండించడం లేదంటూ ఆరోపణలు వస్తున్నాయి. ‘సుశాంత్, డ్రగ్స్‌కేసులో తీవ్రంగా స్పందించిన కంగనా ఇప్పుడెందుకు సైలంట్ అయ్యింది’ అంటూ ఓ నెటిజన్ల సోషల్‌మీడియాలో కామెంటు చేశారు. ప్రస్తుతం ఫేస్బుక్, వాట్సాప్ వేదికగా చాలా మంది కంగనాను టార్గెట్ చేశారు.కంగన బీజేపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నదని […]
ఎన్డీఏలో చేరాలని ఏపీ జగన్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారా? ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏలో భాగస్వాములుగా మారి వైఎస్సార్సీపీ కి చెందిన ఇందరు ఎంపీలకు మంత్రి పదవులు తీసుకోవాలని మోదీ ఒత్తిడి తెస్తున్నారా? అంటే ఢిల్లీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తున్నది. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లాక జాతీయ మీడియాలో పలు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇస్తున్న వైఎస్సార్సీపీ త్వరలోనే ఎన్డీఏలో చేరబోతున్నదంటూ వార్తలు వస్తున్నాయి. రెండు వారాల క్రితమే సీఎం […]
న్యూఢిల్లి: ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అవిషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. కానీ పలు సంస్థలు వ్యాక్సిన్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే అసలు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది..? వస్తే ముందుగా ఎవరికి ఇవ్వాలనేదానిపై ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో భారత్ లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో.. వ్యాక్సిన్ వస్తే ఎవరికి అందజేయాలని దాని మీద కూడా జోరుగా చర్చ జరుగుతున్నది. ఇదే విషయంపై కేంద్ర వైద్య […]
న్యూఢిల్లీ : దేశంలో కరోనా రికవరీలు పెరుగుతున్నా.. గతనెలతో పోల్చితే రోజూవారీ కేసులలో తగ్గుదల కనిపిస్తున్నా.. వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు. రోజూ 75 వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. సోమవారం నమోదైన కొత్త కేసుల (74,441) తో కలిపి.. భారత్ లో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 66,23,815 కు చేరుకున్నది. మరోవైపు మరణాల సంఖ్య కూడా ఇటీవలే లక్ష దాటింది. గత 24 గంటల్లో మరణించిన 903 మందితో కలిపి… దేశంలో […]
లక్నో : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ సామూహికల లైంగికదాడి ఘటన విషయంలో.. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. నిబంధనలను అతిక్రమించినందుకు గానూ ఆయనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆజాద్ తో పాటు మరో 400 మందిపై కేసులు కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే వీరి పేర్లను వెల్లడించలేదు. హత్రాస్ బాధితురాలు కుటుంబాన్ని పరామర్శించడానికి ఆదివారం తన అనుచరులతో కలిసి […]