సామాజికసారథి, అచ్చంపేట: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి సమాజాన్ని చక్కదిద్దాల్సిన గురువులు పక్కదారిపడుతున్నారు. పాఠాలు చెప్పాల్సిన వారు పాడు పనులను పాల్పడుతున్నారు. అచ్చంపేటకు చెందిన సిధార్థ మహాదేవ్ అలియాస్ పర్వతాలు మున్ననూర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. విద్యార్థినులతో చనువుగా ఉంటూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. వారిని చేతులతో తడుముతూ చిల్లర పనులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఓ విద్యార్థినికి సెల్ ఫోన్ ఇప్పించి మరీ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. సదరు విద్యార్థిని అసలు విషయాన్ని తన కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్: కొంతమంది మాల ప్రజాప్రతినిధులు, మేధావులు ఎస్సీ వర్గీకరణపై తప్పుగా మాట్లాడుతున్నారని మాదిగ ఐక్యవేదిక వ్యవస్థపాకులు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మంగి విజయ్ అన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పునే అవహేళన చేసేలా మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. సోమవారం ఆయన మాదిగ జేఏసీ నాయకులతో కలిసి నాగర్ కర్నూల్ లో మీడియాతో మాట్లాడారు. ఇటీవల నాగర్ కర్నూల్ లో జరిగిన మాలల సభలో ప్రజలను తప్పుదోవపట్టించేలా నాయకులు మాట్లాడారని గుర్తుచేశారు. రాజకీయ లబ్ధి కోసమే […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి సమాజాన్ని చక్కదిద్దాల్సిన ఉపాధ్యాయులే దారితప్పారు. విలువలను మరిచి కామకేళిలో మునిగిపోయారు. పవిత్రమైన వృత్తికే కళంకం తెచ్చారు. సదరు ఉపాధ్యాయిని భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదడం జిల్లాలో సంచలనంగా మారింది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సాతాపూర్ ప్రభుత్వ ప్రైమరీ స్కూలులో పనిచేస్తున్న ఓ మహిళా టీచర్, ఉపాధ్యాయుడి మధ్య స్నేహం చిగురించింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అది కూడా హద్దులు దాటింది. […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్: దీర్ఘకాలికంగా జిల్లా విద్యాశాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఏసీఈ రాజశేఖర్ రావు, డీసీఈబీ సెక్రటరీ సత్యనారాయణరెడ్డి, వెంకటేశ్వర్లు శెట్టిని పరిపాలన అధికారాల నుంచి తొలగించాలని టీఎస్ యూటీఎఫ్ నేతలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ను కలిసి డిమాండ్ చేశారు. టీచర్ల బదిలీల్లో స్పౌజ్ కేటగిరీల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. గురువారం ఈ మేరకు టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్.కృష్ణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం.శ్రీధర్ శర్మ, కె.శంకర్, ఎ.చిన్నయ్య, ఎం.రమాదేవి, […]
సామాజికసారథి, తెల్కపల్లి: ‘నా భూమిని అతనికి విక్రయించాలని తెల్కపల్లి మాజీ జెడ్పీటీసీ నరేందర్ రెడ్డి వేధిస్తున్నాడు’ అని తెల్కపల్లి గ్రామానికి చెందిన సింగగాళ్ల రాములు పోలీసులను ఆశ్రయించాడు. గ్రామ సర్వే నెం.52లో తనకు ఎకరా భూమి ఉందని, 40 ఏళ్లుగా సాగులో ఉన్నామని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తమనే పక్కనే సర్వే నెంబర్ 12, 13లో తెల్కపల్లి మాజీ జెడ్పీటీసీ నరేందర్ రెడ్డి వెంచర్ చేసి తన ఎకరా భూమిని అతనికి అమ్మాలని ఒత్తిడి తీసుకొస్తున్నాడని వాపోయాడు. తనకు […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్: గత ప్రభుత్వ హయాంలో కొందరు నాయకులు, అధికారులు కలిసి చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ప్రాజెక్టుల్లో లేనిది ఉన్నట్లు చూపి లక్షలు మెక్కేశారు. అలాంటిదే ఓ ఉదంతం నాగర్ కర్నూల్ జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకెళ్తే.. గత ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సాగు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా పలు రిజర్వాయర్లను నిర్మించాలని తలపెట్టింది. అందుకోసం సర్కారు భూములతో పాటు రైతుల నుంచి కూడా […]
సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి నూతన ఎస్సైగా కె.శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఆయన మహబూబ్ నగర్ సీసీఎస్ లో పనిచేశారు. బదిలీపై ఆయన ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పనిచేసిన ఎస్సై నాగశేఖర్ రెడ్డి వీఆర్ కు వెళ్లారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై కె.శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి సమస్య ఉన్నా తనను నేరుగా సంప్రదించాలని కోరారు. పైరవీకారులను ఆశ్రయించవద్దని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజలంతా […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ మందిరంలో నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, ఎన్జీవోస్ ప్రతినిధులతో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ బుధవారం సమీక్షించారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఈనెల 22న తేదీన నిర్వహించబోయే సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీంపై అవగాహన సదస్సుకు సరైన ప్రణాళికలతో సిద్ధం కావాలని అధికారులకు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సూచించారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు […]