సామాజికసారథి, వనపర్తి: కంచే చేను మేసిందన్న చందంగా అవినీతి, అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులే అడ్డదారులకు సహకరిస్తుండటం వనపర్తి జిల్లా విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. గవర్నమెంట్ స్కూళ్ల విద్యాభివృద్దికి ప్రభుత్వం చొరవ తీసుకుంటుండడాన్ని కొందరు విద్యాశాఖ అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం టీచర్లకు పదోన్నతులు ఇవ్వడంతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలను సైతం ఇటీవల భర్తీ చేసింది. దీంతో కొత్త టీచర్లు జాయిన్ కావడం, మరికొందరు ప్రమోషన్లతో ఇతర స్కూళ్లకు వెళ్లిపోవడంతో జిల్లాలో అక్కడక్కడా […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్: దీర్ఘకాలికంగా జిల్లా విద్యాశాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఏసీఈ రాజశేఖర్ రావు, డీసీఈబీ సెక్రటరీ సత్యనారాయణరెడ్డి, వెంకటేశ్వర్లు శెట్టిని పరిపాలన అధికారాల నుంచి తొలగించాలని టీఎస్ యూటీఎఫ్ నేతలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ను కలిసి డిమాండ్ చేశారు. టీచర్ల బదిలీల్లో స్పౌజ్ కేటగిరీల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. గురువారం ఈ మేరకు టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్.కృష్ణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం.శ్రీధర్ శర్మ, కె.శంకర్, ఎ.చిన్నయ్య, ఎం.రమాదేవి, […]
సామాజిక సారథి, నాగర్ కర్నూల్: జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియను భౌతికంగా నిర్వహించాలని జిల్లా ఉపాధ్యాయ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జాక్టో) నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలగకుండా బదిలీల ప్రక్రియ నిర్వహించాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పర్వతరెడ్డి, మురళి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
కరోనా నేపథ్యంలో స్కూళ్లకు వెళ్లేందుకు టీచర్ల భయం రాష్ట్రవ్యాప్తంగా 500 మందికి పైగా టీచర్లకు పాజిటివ్ హైదరాబాద్: తమకు కూడా ఇంటి నుంచే పని చేసుకునే సౌకర్యం కల్పించాలని ప్రభుత్వ ఉపాధాయులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 500 మందికి పైగా టీచర్లకు కరోనా పాజిటివ్ అని తేలడంతో వారంతా విధుల్లోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి స్కూళ్లు తెరిచినప్పటికీ పిల్లల్ని స్కూళ్లకు పంపించడానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపించడం లేదు. దీంతో టీచర్లంతా […]
సారథి న్యూస్, రామడుగు: కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో బాలింతలు, గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలని కరీంనగర్ జిల్లా గంగాధర ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి కస్తూరి సూచించారు. శనివారం ఆమె వెదిర గ్రామ పరిధిలోని కొనరావుపేట అంగన్వాడీ కేంద్రంలో పోషణ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలింతలకు, గర్భిణులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ వంచ పద్మ, వైద్య సిబ్బంది శ్రీలత, సరోజన తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, మానవపాడు: తెలంగాణ ప్రైవేట్టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో జోగుళాంబ గద్వాల జిల్లా డీఈవో ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు. ఆరునెలల పెండింగ్జీతాలు చెల్లించాలని డిమాండ్చేశారు. కష్టకాలంలో తాము ఎలా బతకాలని ప్రశ్నించారు. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలతో ప్రభుత్వం మాట్లాడి తమకు వేతనాలు ఇప్పించాలని కోరారు. జీతాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నామని వాపోయారు.
సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో, ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయాల భర్తీకి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 548 ప్రధాన, 92 చిన్న అంగన్వాడీ కేంద్రాలున్నట్లు తెలిపారు. ప్రధాన అంగన్వాడీ కేంద్రాల్లో 51 టీచర్లు, 132 ఆయాలు, చిన్న అంగన్వాడీ కేంద్రాల్లో 45 టీచర్లు, ఆయా పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. వెంటనే ఖాళీల […]
సారథి న్యూస్, ఆదిలాబాద్ : రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్ఎటీయూ) ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు పెన్ గంగా సమీపంలో జిల్లా సరిహద్దు దాటి వెళుతున్న వలస కూలీలకు శుక్రవారం పులిహోర, నీటి ప్యాకెట్లు పంపిణీచేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జాదవ్ అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి. పి.నరేంద్ర, సంఘం రాష్ట్ర నాయకులు మెరుగు రాజు, మనోజ్, సంజీవరెడ్డి, భూపతి, మహేందర్ రెడ్డి, మనోహర్, అశోక్, రమేష్ పాల్గొన్నారు.