సామాజికసారథి, నాగర్ కర్నూల్: దీర్ఘకాలికంగా జిల్లా విద్యాశాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఏసీఈ రాజశేఖర్ రావు, డీసీఈబీ సెక్రటరీ సత్యనారాయణరెడ్డి, వెంకటేశ్వర్లు శెట్టిని పరిపాలన అధికారాల నుంచి తొలగించాలని టీఎస్ యూటీఎఫ్ నేతలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ను కలిసి డిమాండ్ చేశారు. టీచర్ల బదిలీల్లో స్పౌజ్ కేటగిరీల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. గురువారం ఈ మేరకు టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్.కృష్ణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం.శ్రీధర్ శర్మ, కె.శంకర్, ఎ.చిన్నయ్య, ఎం.రమాదేవి, […]