డిసెంబర్ 1న మహానగర ఎన్నికలు మేయర్స్థానం జనరల్ మహిళకు కేటాయింపు 150 వార్డులు.. 9,238 పోలింగ్ సెంటర్ల ఏర్పాటు వివరాలు వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సారథి న్యూస్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు నగారా మోగింది. డిసెంబర్ 1న ఓటింగ్ నిర్వహించి, డిసెంబర్ 4న ఫలితాలు వెల్లడిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు. అవసరమైన చోట్ల డిసెంబర్ 3న రీ పోలింగ్ నిర్వహిస్తామని వివరించారు. […]
హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా రూపొందుతున్న చిత్రం ‘సెహరి’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు నందమూరి బాలకృష్ణ. అప్పుడు సినిమా విశేషాలతో పాటు చాలా విషయాలు మాట్లాడారు. ‘కరోనా అనేది న్యూమోనియాకి సంబంధించింది. దీనికి ఇంతవరకు వ్యాక్సిన్ రాలేదు. ఆరోగ్య భద్రతలు పాటిస్తూ జాగ్రత్తగా ఉంటే మంచిది. అందరూ ఆరోగ్యంగా ఉండండి..’ అని చెప్పారు. కోటి కీలకపాత్రలో నటిస్తున్న ‘సెహరి’ చిత్రానికి జ్ఞానసాగర్ దర్శకుడు. అద్వయ జిష్ణురెడ్డి, శిల్పాచౌదరి నిర్మిస్తున్నారు. ఇటీవలే మూవీ పనులు […]
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం పీఠాన్ని వరుసగా నాలుగోసారి ఆయన సొంతం చేసుకున్నారు. అంతేకాదు 69 ఏళ్ల నితీష్ కుమార్ ఎక్కువ సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఘనతను దక్కించుకున్నారు. సోమవారం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ ఫగు చౌహాన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి బీజేపీ నేత, కేంద్రమంత్రి అమిత్‌షా, జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు.
సారథి న్యూస్, శ్రీకాకుళం: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలైన పంచారామాలకు శ్రీకాకుళం నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను నడిపించనున్నట్లు డీఎం వరలక్ష్మి తెలిపారు. వాటికి సంబంధించిన పోస్టర్లను సోమవారం శ్రీకాకుళంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటకు బస్సు సర్వీసులను నడిపిస్తున్నట్లు వివరించారు. ఈనెల 20 నుంచి ప్రారంభంకానున్న తుంగభద్ర పరిష్కారాల దృష్ట్యా ప్రజలకు అసౌకర్యం కలగకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు […]
పవన్ కళ్యాణ్ తన రీ ఎంట్రీ తర్వాత జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాడు. వరుస ప్రాజెక్ట్స్అనౌన్స్చేసి సర్‌ప్రైజ్ చేస్తున్నాడు. ఇందులో రెండు రీమేకులే కావడం విశేషం. ప్రస్తుతం వేణుశ్రీరామ్ డైరెక్షన్‌లో చేస్తున్న ‘వకీల్ సాబ్’.. బాలీవుడ్ సూపర్ హిట్ ‘పింక్’కి రీమేక్. సాగర్ చంద్ర దర్శకత్వంలో రానున్న చిత్రం మలయాళ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కి రీమేక్. ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చ మొదలైంది. ఇందులో ఇద్దరు హీరోలు ఉంటారు. ఇద్దరికీ సమానమైన ప్రత్యేకత ఉంటుంది. మాతృకలో […]
సారథి న్యూస్, హైదరాబాద్: బీజేపీకి ఒకప్పుడు సిద్ధాంతం ఉండేదని, ఇప్పుడది అబద్ధాలతో రాద్ధాంతం చేసే పార్టీగా మారిందని మంత్రి టి.హరీశ్‌రావు ఎద్దేవాచేశారు. గోబెల్స్ ప్రచారంతో అబద్ధాల పునాదుల మీద బీజేపీ రాజకీయంగా ఎదగాలని అనుకుంటోందని, ఆ వ్యవహారశైలిని టీఆర్ఎస్ కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సోమవారం పటాన్ చెరులో నిర్వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహక సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలు ఏం చేశాయని ఓట్లు వేయాలని సూటిగా ప్రశ్నించారు. 70ఏళ్ల […]
సారథి న్యూస్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో మరో నాలుగు కస్తూర్బాగాంధీ(కేజీబీవీ) బాలికల స్కూళ్ల భవనాల నిర్మాణాలకు రూ.14 కోట్లు మంజూరైనట్లు మంత్రి టి.హరీశ్ రావు తెలిపారు. పేద విద్యార్థుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆ దిశగా జిల్లాలో మండలానికి ఒక కస్తూర్బా బాలికల పాఠశాలను మంజూరు చేశామని చెప్పారు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం తొగుట, రాయ్ పోల్ మండలాలు, హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం, జనగామ నియోజకవర్గం కొమురవెల్లి మండలంలోని కస్తూర్బా బాలికల […]
హీరో శ్రీవిష్ణు నటిస్తున్న మరో కొత్త సినిమా ప్రారంభమైంది. ‘గాలి సంపత్’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న అనీష్ కృష్ణ గతంలో ‘అలా ఎలా, లవర్’ వంటి చిత్రాలకు డైరెక్టర్‌గా పనిచేశారు. అనిల్ రావిపూడి సినిమాకు కో డైరెక్టర్ పనిచేస్తున్నారు. రైటర్ గా చేసిన ఆయన మిత్రుడు ఎస్.కృష్ణ ప్రొడ్యూసర్ గా పరిచయమవుతున్నారు. ఆయనతో పాటు సాహు గారపాటి, హరీశ్పెద్ది కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి సమర్పిస్తూ స్క్రీన్ ప్లే […]