అబుదాబి: ఐపీఎల్13లో కీలకమైన మ్యాచ్‌లో సన్రైజర్స్హైదరాబాద్ ఘనవిజయం సాధించింది. రాయల్‌చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచి క్వాలిఫయర్-2లో అడుగుపెట్టింది. ఆర్సీబీ నిర్దేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని కొద్దిగా కష్టంగానే ఛేదించింది. సన్రైజర్స్కీలక ఆటగాళ్లు కేన్ విలియమ్సన్(50 నాటౌట్; 44 బంతుల్లో 4×2, 6×2), హోల్డర్(24 నాటౌట్; 20 బంతుల్లో 4×3) జట్టుకు విజయాన్ని అందించడంలో చివరి దాకా నిలిచారు. వార్నర్(17; 17 బంతుల్లో 4×3)పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఎక్కువ సేపు […]
సారథి న్యూస్, నరసన్నపేట: ప్రజారంజక సంక్షేమ పథకాలతో అందరి జీవితాల్లో వెలుగులు నింపిన వైఎస్జగన్మోహన్రెడ్డి చిరకాలం రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రజాసంకల్పయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ‘ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నరసన్నపేట పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి వైఎస్సార్ జంక్షన్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇడుపులపాయలో మొదలుపెట్టి 14 నెలల పాటు 3,648 కిమీ. పొడవునా 134 […]
సారథి న్యూస్, మహబూబ్ నగర్: కురుమూర్తి స్వామి జాతర బ్రహ్మోత్సవాలు యథాతధంగా కొనసాగుతాయని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వామి వారి అలంకరణ మహోత్సవం, ఉద్దాల మహోత్సవం ఆనవాయితీ ప్రకారం జరిపిస్తామని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జాతర ప్రాంగణంలో ఎలాంటి గుడారాలు కానీ, స్వీట్ షాపులు, మటన్ దుకాణాలు ఏర్పాటు చేయకూడదని సూచించారు.
సారథి న్యూస్, మెదక్: ఈనెల 11వ తేదీలోగా మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేవించారు. శుక్రవారం ఆయన కల్లెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 429 పంచాయతీలతో పాటు గుర్తించిన 84 మదిర గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో 27లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయని, అధికారులు ఒక స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. జిల్లాలో ధరణి అద్భుతంగా పనిచేస్తోందన్నారు. […]
సారథి న్యూస్, మెదక్: ధరణి పోర్టల్ పనితీరును మెదక్ జిల్లా కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం కౌడిపల్లిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి పోర్టల్ ఏర్పాటు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పునకు శ్రీకారం చుట్టిందన్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ల కోసం అందుబాటులోకి తెచ్చిన పోర్టల్ ద్వారా కేవలం 15 నిముషాల్లోనే పారదర్శకంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అవుతుందన్నారు. ఇంతటి చక్కటి అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, పట్టా […]
హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వివాహితపై ముగ్గురు దుండగులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. సైబరాబాద్ కమిషనరేట్ రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. సమీపంలోని కొల్లూరు తండాకు చెందిన మహిళ(30)ను ఓ వ్యక్తి నమ్మించి వెంట తీసుకెళ్లాడు. అక్కడే వైన్ షాపులో మద్యం కొనుగోలు చేసి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లగా, మరో ఇద్దరు వ్యక్తులు అతనికి తోడయ్యారు. మద్యం మైకంలో ముగ్గురూ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను కిరాతకంగా […]
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో (జేఎన్‌వీ) వచ్చే విద్యాసంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జేఎన్‌వీఎస్ వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్ www.navodaya.gov.inలో డిసెంబర్ 15 వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రవేశ పరీక్షను 2021 ఏప్రిల్ 10న ఉదయం 11.30 గంటలకు దేశంలోని అన్ని జవహర్ నవోదయ విద్యాలయాల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పరీక్ష ఫలితాలను 2021 జూన్ నెలలో ప్రకటిస్తారు.ఎవరెవరు అర్హులు?జవహర్ నవోదయ […]
సారథి న్యూస్, తాడ్వాయి: కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. రైతు ఏడ్చిన రాజ్యం.. ఎద్దు ఏడ్చిన ఎవుసం బాగుపడినట్లు చరిత్రలో లేదని వివరించారు. ప్రధాని మోడీ కార్పొరేట్ కంపెనీలతో కుమ్మక్కయ్యారని వివరించారు. రైతులను దగా చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం తాడ్వాయి మండల కేంద్రంలో రైతు వ్యతిరేక బిల్లులను నిరసిస్తూ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు జలపు అనంతరెడ్డి అధ్యక్షతన సంతకాల సేకరణ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. ఇటీవల […]