దుబాయ్: ఐపీఎల్13 సీరిస్‌లో భాగంగా 30వ మ్యాచ్.. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 13 పరుగుల తేడాతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. ముందు టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 132 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఢిల్లీ చివరి నాలుగు ఓవర్లలో మాత్రం కేవలం 29 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బ్యాట్స్మెన్లలో […]
సారథి న్యూస్, నెట్వర్క్: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రమంతా అతలాకుతలమైంది. భాగ్యనగరం ఒక్కసారిగా స్తంభించిపోయింది. మూసీ ఉగ్రరూపం దాల్చింది. సరూర్‌నగర్‌చెరువు ఉప్పొంగింది. వరద ప్రళయమే సృష్టించింది. వరద ఉధృతికి కార్లు కొట్టుకొచ్చాయి. ఆ గల్లీ.. ఈ గల్లీ.. ఏది చూసినా జలసంద్రమైంది. అలాగే రాష్ట్రంలో పలు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరి చేలు నీట మునిగిపోయాయి. రోడ్లు, వంతెనలు వరద ఉధృతికి ధ్వంసమయ్యాయి.
అసలే తమిళలకు ప్రాంతీయ అభిమానం ఎక్కువ. అక్కడి హీరోల ఫ్యాన్స్ చిన్న చిన్న విషయాలకు కూడా కాలు దువ్వుతుంటుంటారు. అలాంటిది ఎంతో మంది తమిళులను పొట్టన పెట్టుకుంది శ్రీలంక. అక్కడి క్రికెటర్ గురించి సినిమా తీస్తామంటే ఒప్పుకుంటారా? కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా శ్రీలంకన్ లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితచరిత్ర ఆధారంగా ‘800’ అనే చిత్రాన్ని ఎంఎస్. శ్రీపతి దర్శకత్వంలో ట్రైన్ మోషన్ పిక్చర్స్, వివేక్ రంగాచారి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టుగా […]
సారథి న్యూస్, హైదరాబాద్: కూరగాయలు, పండ్లు, పూల తోటల సాగులో గుణాత్మక మార్పులు రావాలని, ఇందుకోసం ఉద్యానవన శాఖ సుశిక్షితం, బలోపేతం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో విభిన్న స్వభావాలు కలిగిన నేలలు, మంచి వర్షపాతం, వృత్తి నైపుణ్యం కలిగిన రైతులు ఉన్నారని అన్నారు. ఈ సానుకూలతలను వినియోగించుకుని పండ్లు, కూరగాయలు, పూల సాగులో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని సూచించారు. ప్రగతి భవన్ లో బుధవారం ఉద్యానవన శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష […]
సారథి న్యూస్, మెదక్: సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. దీంతో మంజీరా నదికి వరద ఉదృతి సంతరించుకుంది. మెదక్ జిల్లాలోని వనదుర్గా ప్రాజెక్ట్ పూర్తిగా నిండి పొంగిపొర్లుతోంది. దిగువన ఉన్న ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. అమ్మవారి ప్రధాన ఆలయ ముందు ఉన్న నదీ పాయ పరవళ్ల తొక్కుతుండడంతో మండపంలోకి నీరు చేరింది. దీంతో ఆలయానికి రాకపోకలు ఆగిపోయాయి. రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఉంచి భక్తులు […]
హైదరాబాద్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో హైదరాబాద్ శివారు ప్రాంతాలు వణికిపోతున్నాయి. నగరంలోని అనేక కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుమారు 1500 కాలనీల్లో నడుముల లోతు మేర వరద నీరు చేరింది. కాలనీల్లో వరద నీరు ఉధృతంగా ప్రహహిస్తుండడంతో అధికారులు బోట్లు, నాటుపడవల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కనీసం మూడు రోజుల వరకు నగరవాసులు బయటకు రావొద్దని హెచ్చరించారు.అత్యవసర సేవల కోసం 040 – 211111111, జీహెచ్‌ఎంసీ […]
బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన కరాటే కల్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బిగ్‌బాస్ హౌస్‌లో జరిగేదంతా డ్రామా. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో బయటకు చెప్పరు. అక్కడి పరిస్థితులు చూస్తుంటే మహబూబ్‌ను కావాలనే సేవ్ చేస్తున్నారని క్లియర్‌గా తెలుస్తుంది. నేను, టీవీ9 దేవి, జోర్దార్ సుజాత స్కిన్ షో చేయం. అఫైర్లు పెట్టుకోం. వీకెండ్ టైంలో అన్ని విప్పి కూర్చోం. అందుకే మమ్మల్ని ఎలిమినేట్ చేశారు. మోనాల్ గజ్జర్, హారిక, అరియానా బాగా ఎక్స్‌ఫోజ్ చేస్తారు. లవ్ […]
సీఎస్, డీజీపీతో ప్రత్యేకంగా చర్చించిన ముఖ్యమంత్రి జీహెచ్‌ఎంసీ పరిస్థితిపై అప్రమత్తం చేసిన మంత్రి కేటీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు తెలంగాణ తడిసి ముద్దయింది. ఈ నేపథ్యంలో రాష్ర్ట ప్రభుత్వం బుధ, గురువారాల్లో సెలవులు ప్రకటించింది. అత్యవసరమైతేనే ప్రజలు బయటికి రావాలని సూచించింది. పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పాత భవనాలను తక్షణమే ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, పోలీస్‌శాఖను అప్రమత్తం చేసింది. వర్షాలు, వరదలు బీభత్సం […]