Breaking News

HEAVY RAIN

కుండపోత కురిసింది.. పెద్దవాగు పొంగింది

కుండపోత కురిసింది.. పెద్దవాగు పొంగింది

సారథి, బిజినేపల్లి: నాగర్​కర్నూల్ ​జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి భారీవర్షం కురిసింది. ముఖ్యంగా బిజినేపల్లి మండలంలో కుండపోత వాన దంచికొట్టింది. దీంతో మండలంలోని పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద నీరంతా పొంగిపారుతూ పాలెం పెంటోనీ చెరువుకు భారీగా నీరు చేరుతోంది. బిజినేపల్లి నుంచి వట్టెం వెళ్లే మార్గంలో బైక్​లు, చిన్న చిన్న వాహనాలు వాగు దాటడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. వాహనదారులు చుక్కలు చూశారు. వాగునీరు ఒక్కసారిగా వరద పారడంతో సమీపంలోని పంట పొలాలు కోతకు […]

Read More
గూడు చెదిరింది..

గూడు చెదిరింది..

సారథి న్యూస్, నెట్​వర్క్: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రమంతా అతలాకుతలమైంది. భాగ్యనగరం ఒక్కసారిగా స్తంభించిపోయింది. మూసీ ఉగ్రరూపం దాల్చింది. సరూర్​నగర్​చెరువు ఉప్పొంగింది. వరద ప్రళయమే సృష్టించింది. వరద ఉధృతికి కార్లు కొట్టుకొచ్చాయి. ఆ గల్లీ.. ఈ గల్లీ.. ఏది చూసినా జలసంద్రమైంది. అలాగే రాష్ట్రంలో పలు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరి చేలు నీట మునిగిపోయాయి. రోడ్లు, వంతెనలు వరద ఉధృతికి ధ్వంసమయ్యాయి.

Read More
పల్లె, పట్టణం అతలాకుతలం

పల్లె, పట్టణం అతలాకుతలం

సారథి న్యూస్, హైదరాబాద్: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ​రాష్ట్రాల వ్యాప్తంగా భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో ఆదివారం రాత్రి ప్రారంభమైన వాన ఆగుతూ.. ఆగుతూ పడుతూనే ఉంది. ఇప్పటికే రాజధాని నగరం హైదరాబాద్.. ​భారీ వర్షానికి జలమయమైంది. నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హిమాయత్​ సాగర్​ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరింది. ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా జీహెచ్ఎంసీ అధికారులు, హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లాల‌ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో పలుచోట్ల […]

Read More
ఉప్పొంగిన పెద్దవాగు

ఉప్పొంగిన పెద్దవాగు

రాయిచూర్ మార్గంలో నిలిచిపోయిన రాకపోకలు మానవపాడు– అమరవాయి మధ్య స్తంభించిన రవాణా సారథి న్యూస్, మానవపాడు: భారీ వర్షాలు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఉమ్మడి మండలంలోని పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో మానవపాడు –అమరావతి గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బ్రిడ్జి పైనుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో అటుగా వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇదే వాగు బొంకూరు శివారులో రాయిచూరు ప్రధాన రహదారిపై ఉప్పొంగి ప్రవహించడంతో […]

Read More
భారీవర్షానికి కూలిన ఇల్లు

భారీవర్షానికి కూలిన ఇల్లు

సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బొంకూర్ గ్రామంలో భారీవర్షానికి గ్రామానికి చెందిన బోయ నడిపి ఉషన్న ఇల్లు శనివారం రాత్రి కూలిపోయింది. సర్పంచ్ శ్రీలత భాస్కర్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తక్షణ సాయంగా రూ.రెండువేలు అందజేశారు. బాధిత కుటుంబసభ్యులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని భరోసా ఇచ్చారు. ఆమె వెంట భాస్కర్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, గ్రామస్తులు ఉన్నారు.

Read More
అధికారులూ.. అలర్ట్​గా ఉండండి

అధికారులూ.. అలర్ట్​గా ఉండండి

సారథి న్యూస్​, హైదరాబాద్​: వచ్చే రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులు, ప్రజలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సూచించారు. రాష్ట్రంలో చాలాచోట్ల ఆదివారం వర్షాలు కురుస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన […]

Read More
సిటీలో వర్ష బీభత్సం

సిటీలో వర్ష బీభత్సం

ఎల్బీనగర్ నియోజకవర్గంలో పలు కాలనీలు జలమయం ఇబ్బందుల్లో పలు లోతట్టు కాలనీవాసులు సారథి న్యూస్, ఎల్బీనగర్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్​నగరంలో శుక్రవారం రాత్రి కురిసిన కుండపోత వానకు ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని చైతన్యపురి, కర్మన్​ఘాట్, హస్తినాపురం, హయత్​నగర్, నాగోల్, మన్సురాబాద్, బీఎన్​రెడ్డి నగర్ డివిజన్లలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. హయత్ నగర్ లో రోడ్ల వరద నీటి ఉధృతికి కోతకు గురయ్యాయి. మట్టిరోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. లోతట్టు కాలనీల్లోని ఇళ్లలోకి […]

Read More
ముంపు బాధితులకు అండగా ఉంటాం

ముంపు బాధితులకు అండగా ఉంటాం

సారథి న్యూస్​, వరంగల్​: వరంగల్ మహానగరంలో భారీవర్షాలకు నీటమునిగిన లోతట్టు కాలనీలు, పలు ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ, పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం పరిశీలించారు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నగరంలోని ములుగు రోడ్డు, కాశీబుగ్గ, పద్మానగర్, ఎస్ఆర్ నగర్, చిన్నవడ్డేపల్లి చెరువు, తులసి బార్, సమ్మయ్య నగర్, నయీనగర్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా కలియ […]

Read More