సారథి న్యూస్, వాజేడు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఆదివాసీల మీద అత్యంత పాశవికంగా దమనకాండ కొనసాగిస్తోందని ఆదివాసీ నవ నిర్మాణసేన రాష్ట్ర అధ్యక్షుడు పూనేం సాయి విమర్శించారు.ఏజెన్సీ నూతన రెవెన్యూ చట్టాన్ని, ఎల్ఆర్ఎస్ను నిలిపివేయకపోతే ఆదివాసీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, తమ పదవులకు రాజీనామా చేయాలని సాయి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. 1970కు ముందు ఉన్న గిరిజనేతరులందరికీ భూములపై […]
గిరిజన విద్యార్థిని మెడిసిన్ చదువుకు ఆర్థిక సాయం ప్రతి సంవత్సరం రూ.60వేలు అందజేస్తానని హామీ సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. మెడిసిన్ చదువుతున్న బిజినేపల్లి మండలంలోని ఉడుగులకుంట తండాకు చెందిన కాట్రావత్శ్యామల అనే విద్యార్థినికి ఎంజేఆర్ ట్రస్టు ద్వారా ఆర్థిక సాయం అందజేస్తానని ప్రకటించారు. ఏటా చదువుల కోసం రూ.60వేలు ఇస్తానని భరోసా ఇచ్చారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మొదటి సంవత్సరం ఫీజు […]
వ్యవసాయ శాఖ.. ఇక డైనమిక్ డిపార్ట్మెంట్ తెలంగాణ ఏం తింటున్నదో అవే పంటలు సాగుచేయించాలి వచ్చే ఏడాది నుంచి రైతులకు ‘అగ్రికల్చర్ కార్డులు’ వ్యవసాయ శాఖలో ఖాళీ పోస్టులు భర్తీచేయండి ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు సారథి న్యూస్, హైదరాబాద్: రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతుబంధువుగా తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తున్న నేపథ్యంలో వ్యవసాయశాఖ ఉద్యోగులు కూడా రైతు నేస్తాలుగా మరింత పట్టుదల, సమన్వయంతో పనిచేయాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. వ్యవసాయ శాఖ ఇకనుంచి సాదాసీదా డిపార్ట్మెంట్కాదని, […]
అనారోగ్యంతో కన్నుమూసిన సీపీఐ నేత నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం సీఎం కేసీఆర్ సంతాపం సారథి న్యూస్, రామగుండం: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్ నేత గుండా మల్లేష్ మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కార్మిక కుటుంబం నుంచి వచ్చిన గుండా మల్లేష్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామానికి […]
సారథి న్యూస్, హైదరాబాద్: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో ఆదివారం రాత్రి ప్రారంభమైన వాన ఆగుతూ.. ఆగుతూ పడుతూనే ఉంది. ఇప్పటికే రాజధాని నగరం హైదరాబాద్.. భారీ వర్షానికి జలమయమైంది. నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరింది. ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా జీహెచ్ఎంసీ అధికారులు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో పలుచోట్ల […]
సారథి న్యూస్, రామాయంపేట: వర్షాలకు కింద పడిపోయిన వరి పంటను జడలు చుట్టే పద్ధతిలో కట్టుకుంటే పంటను రైతులు కాపాడుకోవచ్చని నిజాంపేట అగ్రికల్చర్ ఆఫీసర్ సతీష్ సూచించారు. ఆయన సోమవారం మండల పరిధిలోని నస్కల్, చౌకత్ పల్లి, కల్వకుంట, తిప్పనగుళ్ల గ్రామాల్లో నేలకు ఒరిగిన పంట పొలాలను పరిశీలించి పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించారు. గింజగట్టి పడి కోత దశలో ఉన్న వరి పంటకు 50 గ్రాముల ఉప్పును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ పోలీసులపై సైబరాబాద్ పోలీస్, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) సంయుక్త ఆధ్వర్యంలో షార్ట్ ఫిలిం, ఫొటో కాంటెస్ట్‌ను నిర్వహించనున్నారు. ఈ పోటీలకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు తెలంగాణ పోలీసులపై తాము తీసిన ఫొటోలు, షార్ట్ ఫిలింలను పంపించవచ్చు. షార్ట్ ఫిలింల నిడివి 3 నిమిషాలలోపే ఉండాలి. అలాగే తమ షార్ట్ ఫిలింలు, ఫొటోలను ఔత్సాహికులు అక్టోబర్ 18వ తేదీ లోపు పంపించాల్సి ఉంటుంది. [email protected] అనే మెయిల్ ఐడీకి వీడియోలు, ఫొటోలను […]
సారథి న్యూస్, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న మాదాపూర్ లోని రిజైన్ స్కై బార్ పబ్ ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. కరోనా రూల్స్ కు విరుద్ధంగా జనం గుమిగూడడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించలేదని నిర్ధారించారు. బార్లో పనిచేసే వెయిటర్లు ఎక్కడా మాస్క్‌లు కట్టుకోలేదని గుర్తించారు. పబ్ లో రష్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎక్సైజ్ శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. ఉదయం పబ్ పై రైడ్ నిర్వహించిన అధికారులు కస్టమర్లు, […]