సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమితమైన సోమిశెట్టి వెంకటేశ్వర్లును సోమవారం ఘనంగా సన్మానించారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పార్టీ కార్యదర్శి ధరూరు జేమ్స్, కార్యదర్శి కె.నాగేంద్ర కుమార్, పోతురాజు రవికుమార్, సత్రం రామక్రిష్ణ, టీఎన్ఎస్ఎఫ్నాయకులు రాజుయాదవ్, తిరుపాల్ బాబు, నారాయణరెడ్డి, మంచాలకట్ట భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచితంగా బోర్లు వేరి, తద్వారా మెట్ట భూములకు సాగునీరు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ జలకళ పథకాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి సీఎం జగన్ అన్ని జిల్లాల కలెక్టర్ లు, జేసీలు, ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైఎస్సార్ జలకళ పథకం శ్రీకారం చుట్టి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా […]
సారథి న్యూస్, గద్వాల: విద్యుత్‌షాక్‌తో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం తుమ్మలచెరువులో చోటుచేసుకున్నది. యువకుడు తన పొలానికి నీరు పెట్టుకుంటుండగా.. పొలం వద్ద ట్రాన్స్ఫారం పోయింది. దీంతో లైన్ ఆఫ్‌చేసి జంపర్ వేస్తుండగా ప్రమాదవశాత్తు మెయిన్వైర్కు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
రీల్ లైఫ్‌లో విలన్ గా అనేక సినిమాల్లో నటించి మెప్పించిన సోనూసూద్ లాక్ డౌన్ సమయంలో మాత్రం ఎవరు ఎక్కడ ఇబ్బందిపడినా నేనున్నానని ఆదుకుని రియల్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం నాలుగైదు సినిమాల్లో నటిస్తున్న సోనూ షూటింగులు మొదలవగానే సెట్స్ కు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న ‘అల్లుడు అదుర్స్’ షూటింగ్ లో వచ్చే సోమవారం పాల్గొనబోతున్నాడని మూవీ టీమ్ తెలియజేసింది. సాయి శ్రీనివాస్, సోనూసూద్ కాంబోలో గతంలో వచ్చిన ‘సీత’ మూవీకి మంచి […]
రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మాళవిక అయ్యర్, హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటించారు. తెలుగు డిజిటల్ ప్లాట్ ఫామ్ ‘ఆహా’లో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్‌ను నాగచైతన్య విడుదల చేశాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ‘నాదొక బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్ మార్వలెస్ లవ్ స్టోరీ’ అని హీరో చెప్పే డైలాగ్ […]
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతికేసు విచారణలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ రాకెట్ పై ఫోకస్ పెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే హీరోయిన్ రియా చక్రవర్తితో పాటు పలువురు డ్రగ్ డీలర్లను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనే, శ్రద్ధాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ లను ఎన్సీబీ అధికారులు విచారించారు. వీరితో పాటు దీపికా మేనేజర్ కరిష్మా కపూర్ ఫ్యాషన్ డిజైనర్ […]
సారథి న్యూస్, ములుగు: రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకోవాలని ములుగు కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలోని అన్ని రహదారుల్లో ప్రమాద స్థలాలు, బ్లాక్ స్పాట్స్ గుర్తించాలన్నారు. ఓవర్ లోడ్, లైసెన్స్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపటం పై చర్యలు […]
సారథిన్యూస్, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జలకళ పథకం పేదరైతులకు వరం లాంటిదని సీఎం వైస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో 2 లక్షల వ్యవసాయ బోర్లు వేస్తున్నట్టు చెప్పారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వచ్చే నాలుగు సంవత్సరాలలో రూ.2,340 కోట్లతో 2 లక్షల బోర్లు ఉచితంగా వేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. ఈ పథకం కోసం […]