మూడంతస్థుల ఆపార్ట్మెంట్ కుప్పకూలి అందులో ఉన్న 8 మంది మృతిచెందగా.. పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని భివాండిలో అదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భివాండిలో 1984లో ఓ భవనాన్ని నిర్మించారు. ఇక్కడ దాదాపు 21 కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే ఈ భవనం శిథిలావస్థకు చేరుకుందని, వెంటనే అక్కడ నివాసం ఉన్నవారంతా భవంతిని ఖాళీచేయాలని మున్సిపల్ సిబ్బంది ఇప్పటికే నోటీసులు కూడా జారీచేశారు. అయినప్పటికే ఈ భవంతిని ఎవరూ ఖాళీ […]
ఢిల్లీ: తీవ్ర గందరగోళ పరిస్థితుల నడుమ నిన్న రాజ్యసభలో వ్యవసాయ బిల్లులు ఆమోదించిన సంగతి చెలరేగింది. బిల్లు చర్చ సందర్భంగా పలువురు ఎంపీలు రాజ్యసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఓ దశలో చైర్మన్ పోడియం దగ్గరకు వెళ్లి పెద్దపెట్టు నినాదాలు చేశారు. కాగా సభలో అనుచితంగా ప్రవర్తించిన ఎనిమిది మంది ఎంపీలపై సోమవారం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సస్పెండ్ వేటు వేశారు. వారంపాటు వీరిని సభనుంచి బహిష్కరించారు. సోమవారం సభ ప్రారంభంకాగానే మంత్రి ప్రహ్లద్జోషి సస్పెన్షన్ […]
ఆమె ఓ అందమైన యువతి.. ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈజీ మనికి అలవాటు పడింది. డబ్బున్నవాళ్లను పరిచయం చేసుకోవడం.. వారిని ముగ్గులోకి దించడం ఆమె హాబీ. పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు లేదా సోషల్‌మీడియాలో ఆమె ధనవంతులను పరిచయం చేసుకుంటుంది. తర్వాత వారితో మత్తెక్కించేలా మాట్లాడుతుంది. అనంతరం వాళ్లను తన ఇంటికి తీసుకెళ్లి.. శారీరకంగా లొంగదీసుకుంటుంది. అనంతరం అక్కడ సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు తీస్తుంది. ఆ తర్వాత ఆ వీడియోలు సోషల్‌మీడియాలో పెడతానంటూ బెదిరించి లక్షల్లో […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీవర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది.గత శుక్రవారం నేరేడ్మెడ్లోని నాలాలో కొట్టుకుపోయి సుమేధ(12) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే సరూర్‌నగర్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. డ్యూటీ ముగించుకుని బైక్‌పై ఇంటికొస్తున్న ఓ వ్యక్తి సరూర్‌నగర్ చెరువులో కొట్టుకుపోయాడు. అతడి కోసం ఎన్డీఆర్ఎఫ్ బలగాలు గాలిస్తున్నాయి. అల్మాస్‌గూడకు చెందిన నవీన్‌కుమార్(45) నవీన్ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. డ్యూటీ ముగించుకుని సరూర్‌నగర్ నుంచి తపోవన్ కాలనీ వైపు స్కూటీపై వెళ్తుండగా […]
సారథి న్యూస్, ఖమ్మం: తెలంగాణలో ఇటీవల మావోయిస్టుల కదలికలు కనిపిస్తుండటంతో పోలీస్‌శాఖ ఇప్పటికే అప్రమత్తమైంది. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ముగ్గురు యువతులు ఓకే రోజు అదృశ్యమయ్యారు. అయితే వీరికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయా? వీరు అడవి బాటపట్టారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. అశ్వారావుపేట మండలం చెన్నాపురం కాలనీకి(గొత్తికోయ కాలనీ) చెందిన ముగ్గురు యువతులు ఈ నెల 16వ నుంచి కనిపించకుండా పోయారు. అందులో ఓ యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలీసులు […]