Breaking News

Day: September 17, 2020

మార్కెట్​కమిటీ చైర్​పర్సన్​గా సుగుణ

సారథి న్యూస్​, దేవరకద్ర: మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్​ కమిటీ చైర్​పర్సన్​గా కొండా సుగుణ నియమితులయ్యారు. శుక్రవారం ఆమె దేవరకద్రలోని శ్రీనివాస గార్డెన్​ ఫంక్షన్​హాల్​లో ప్రమాణం చేయనున్నారు. కాగా, ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రులు వి.శ్రీనివాస్​గౌడ్​, ఎస్​.నిరంజన్​రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

Read More
స.హ.చట్టం మీడియా కన్వీనర్ గా సాయిబాబు

స.హ.చట్టం మీడియా కన్వీనర్ గా సాయిబాబు

సారథి న్యూస్, అచ్చంపేట: సమాచార హక్కు రక్షణ చట్టం (2005) అచ్చంపేట మండల కమిటీ మీడియా కన్వీనర్ గా రేసోజు సాయిబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు గురువారం ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భోగరాజు ప్రశాంత్, జిల్లా అధ్యక్షుడు కృష్ణప్రసాద్, మండలాధ్యక్షుడు పోల స్వామి నియామక పత్రం అందజేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ చట్టం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. మీడియా కన్వీనర్ గా […]

Read More

జోరువాన.. నిండా ముంచింది

సారథిన్యూస్, రామడుగు: ఇటీవల కొంతకాలంగా కురుస్తున్న భారీవర్షాలు రైతాంగాన్ని నిండా ముంచాయి. ఈ జోరువానతో ఇప్పటికే పలుచోట్ల పాతమిద్దెలు కూలిపోయాయి. పలువురు గాయపడ్డారు. వరదతాకిడికి కొందరు గల్లంతయ్యారు. కరీంనగర్​ జిల్లా రామడుగు ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలోకి వర్షపు నీరు చేరింది. గాంకుంట్ల చెరువు సమీపంలోని లోతట్టు ప్రాంతంలో స్కూలు నిర్మాణం చేపట్టడంతో నీరు నిలిచి చెరువును తలపిస్తుంది. కరోనా లాక్ డౌన్ కావడంతో ఎవరూ ఈ పాఠశాలను పట్టించుకోవడం లేదు. రోజు ఆన్​లైన్​ తరగతుల నిర్వహణ కోసం […]

Read More
అది తెలంగాణ ప్రజల హక్కు

అది తెలంగాణ ప్రజల హక్కు

సారథి న్యూస్​, హైదరాబాద్​: విమోచన దినోత్సవం నిర్వహించుకోవడం యావత్ తెలంగాణ ప్రజల హక్కు అని విశ్వహిందూ పరిషత్(వీహెచ్ పీ) రాష్ట్ర ప్రచార సహ ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి అన్నారు. గురువారం వీహెచ్​పీ, భజరంగ్ దళ్ సంస్థల ఆధ్వర్యంలో హైదారాబాద్​ కోఠి బాలగంగాధర్ తిలక్ చౌరస్తాలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని ఎనిమిది జిల్లాల్లో నిజాం రజాకార్ల దోపిడీ పాలన సాగుతూ ఉండేదని […]

Read More
విమోచనంపై సీఎం మాట తప్పిన్రు

విమోచనంపై సీఎం మాట తప్పిన్రు

సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్ మాట తప్పారని, ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు రోజులు దగ్గరపడ్డాయని మెదక్​ జిల్లా నిజాంపేట బీజేపీ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గురువారం నిజాంపేట మండలకేంద్రంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న తెలంగాణ అమరవీరులను స్మరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన […]

Read More
మాయదారి రోగం.. పశువులన్నీ ఆగం

మాయదారి రోగం.. పశువులన్నీ ఆగం

శరీరంపై గడ్డలతో ఎద్దులు, ఆవులు విలవిల ముదిరితే అవి చిట్లిపోయి.. తీవ్ర అవస్థలు మానవపాడు మండలంలో నాలుగు ఎద్దులు మృతి సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): కరోనా మహమ్మారి మానవాళిని వణికిస్తున్న విషయం తెలిసిందే. ఎవరి టెన్షన్​లో వాళ్లున్నారు. సరిగ్గా ఈ టైంలోనే పశువులను వింత రోగం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శరీరంపై అనుకోకుండా వచ్చిన కురుపులు, గడ్డలుగా మారి.. మూగజీవాలకు నిద్రలేకుండా చేస్తోంది. అవి చిట్లిపోయి శరీరమంతా కుళ్లిపోయేలా చేస్తోంది. కాడెద్దులు, ఆవులు కళ్లముందే చనిపోతుండడంతో రైతన్నలు […]

Read More
కోతకు గురైన రాయిచూర్​రహదారి

కోతకు గురైన రాయిచూర్​ రహదారి

స్తంభించిన వాహనాల రాకపోకలు చిన్నపాటి వర్షమొస్తే ఇదే పరిస్థితి సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక ఎప్పటిలాగే జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెళ్లి మండలం బొంకూర్ వద్ద ఉన్న అంతర్రాష్ట్ర రాయిచూర్​రహదారి కోతకు గురైంది. అర్ధరాత్రి నుంచి రాకపోకలు స్తంభించిపోయాయి. రాయిచూర్​కు వెళ్లాలంటే వయా కలకుంట్ల మీదుగా హైవే నం.44, అలంపూర్ చౌరస్తా వరకు 25 కి.మీ. ప్రయాణించాల్సి వస్తోంది. మూడేళ్లుగా ఈ పెద్ద వాగుపై బ్రిడ్జిని […]

Read More
విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

సారథి న్యూస్, హుస్నాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవంలో భాగంగా గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ, స్థానిక ఆర్డీవో కార్యాలయల్లో బీజేపీ నాయకులు జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అధికారంలో ఉండి కూడా తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ఎందుకు జరిపించడం లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎం పార్టీకి భయపడుతూ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ […]

Read More