– బండి సంజయ్ ను కలిసిన దేవస్థానం చైర్మన్ ఈవో.. సామాజిక సారథి, మహబూబ్ నగర్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠంగా విరాజిల్లుతన్న అలంపురం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర మరియు నవబ్రహ్మ ఆలయాల అభివృద్ధికి కేంద్ర పురాతత్వ శాఖ వారి నుండి సహకారం అందించేందుకు తమ వంతు ప్రయత్నం చేయాలని కోరుతూ దేవస్థానం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆలయ ఈవో పురంధర్ కుమార్ మంగళవారం హైదరాబాదులో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు […]
పురుగు మందు తాగి అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం మానవపాడు తహసీల్దార్ ఆఫీసు ఎదుట ఆందోళన సారథి న్యూస్, మానవపాడు: భూమిని తమ పేర చేయడం లేదని, అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా న్యాయం జరగడం లేదని ఇద్దరు అన్నదమ్ములు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట కలకలం రేపింది. బాధిత రైతుల కథనం మేరకు.. మండలంలోని చెన్నిపాడు గ్రామానికి చెందిన రైతులు శేషిరాజు, నాగరాజుకు […]
స్తంభించిన వాహనాల రాకపోకలు చిన్నపాటి వర్షమొస్తే ఇదే పరిస్థితి సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక ఎప్పటిలాగే జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెళ్లి మండలం బొంకూర్ వద్ద ఉన్న అంతర్రాష్ట్ర రాయిచూర్రహదారి కోతకు గురైంది. అర్ధరాత్రి నుంచి రాకపోకలు స్తంభించిపోయాయి. రాయిచూర్కు వెళ్లాలంటే వయా కలకుంట్ల మీదుగా హైవే నం.44, అలంపూర్ చౌరస్తా వరకు 25 కి.మీ. ప్రయాణించాల్సి వస్తోంది. మూడేళ్లుగా ఈ పెద్ద వాగుపై బ్రిడ్జిని […]
సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు జూరాలకు నిలకడగా వరద కొనసాగుతోంది. ప్రస్తుతం నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలలో ప్రస్తుతం 9.657 టీఎంసీల నీటిమట్టం ఉంది. ప్రస్తుతం జూరాలకు 63,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఇలా ప్రాజెక్టు నుంచి మొత్తం 60,856 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. నాలుగుగేట్ల ద్వారా 22,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తికి 35,974 క్యూసెక్కుల […]