Breaking News

Month: July 2020

ఇక అభివృద్ధి పనులపై దృష్టిపెట్టండి

ఇక అభివృద్ధి పనులపై దృష్టిపెట్టండి

సారథి న్యూస్, కర్నూలు: జిల్లాలో కరోనా కట్టడికి అధికారులు, సిబ్బంది బాగా కృషిచేశారని, ఇకపై అభివృద్ధి పనులపై దృష్టిసారించాలని కర్నూలు కలెక్టర్​ వీరపాండియన్​ సూచించారు. శనివారం కలెక్టరేట్​ నుంచి ఆర్డీవోలు, మండలాధికారులతో పాటు మున్సిపల్‌ కమిషనర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పథకం లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లొచ్చిన వారికి కొత్తగా జాబ్​కార్డులు ఇవ్వాలన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి హోం ఐసోలేషన్​లో ఉండేందుకు ప్రోత్సహించారు. అనంతరం జేసీ రవిపట్టాన్​ శెట్టి మాట్లాడుతూ.. […]

Read More

దూదేకుల సంఘం ఎన్నిక

సారథి న్యూస్,రామాయంపేట: మెదక్​ జిల్లా రామాయంపేట మండల దూదేకుల (నూర్బాష్​) సంఘాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కన్వీనర్​గా ఖాసీం సాబ్​, కోకన్వీనర్​గా ఫిరోజ్​, కోశాధికారిగా ఇమామ్​ సాబ్​, సలహాదారుడిగా అహ్మద్​ పాషాను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన మండల కమిటీ సభ్యులకు జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ పాషా, కోఆప్షన్ సభ్యుడు గౌస్ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మెదక్​ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎండీ అజ్గర్, జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ పాషా, జిల్లా నాయకులు ఇబ్రాహీం, బాబు మియా,గౌస్ […]

Read More
చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయండి

చేర్యాలను రెవెన్యూ డివిజన్​ చేయండి

సారథి న్యూస్, హుస్నాబాద్: చేర్యాలను రెవెన్యూ డివిజన్​గా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్​ చేశారు. శనివారం సిద్దిపేట జిల్లా చేర్యాలలో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అన్ని అర్హతలు ఉన్న చేర్యాలను వెంటనే రెవెన్యూ డివిజన్​గా చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, చిరంజీవులు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మాజీ జెడ్పీటీసీ కళావతి, బీజేపీ మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఉమారాణి, ఫార్వర్డ్​ బ్లాక్ పార్టీ జిల్లా కార్యదర్శి బీరన్న, […]

Read More

నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం

సారథి న్యూస్​, పెద్దపల్లి: ప్రాజెక్టుల నిర్మాణాలకు భూములిచ్చిన రైతుల త్యాగం మరువలేనిదని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్​ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శనివారం ఆయన పాలకుర్తి మండలం వెంనూర్​లో ఎల్లంపల్లి రిజర్వాయర్​ కోసం భూములు కోల్పోయిన రైతులతో సమావేశమయ్యారు. నిర్వాసితులందరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​, పాలకుర్తి తహసీల్దార్​ రాజమణి, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి పాల్గొన్నారు.

Read More

కందనూలు రూపురేఖలు మార్చుదాం

సారథిన్యూస్​, నాగర్​కర్నూల్​: నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రాన్ని అందరి భాగస్వామ్యంతో సర్వాంగ సుందరంగా మార్చుదామని కలెక్టర్​ ఎల్​ శర్మన్​ పిలుపునిచ్చారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన శర్మన్​ శనివారం ఉదయం 5:40కి పట్టణంలో మార్నింగ్​వాక్​చేసి సమస్యలను తెలుసుకున్నారు. మున్సిపల్​ కార్మికులతో మాట్లాడారు. వ్యాపారులు రోడ్లవెంబడి చెత్తవేస్తే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్టాండ్​లోని మూత్రశాలలో అపరిశుభ్ర వాతావరణం ఉండటంతో అక్కడి నిర్వాహకులపై కలెక్టర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కార్యాలయానికి రావాలని డిపో మేనేజర్​ను ఆదేశించారు. 10 రోజుల్లోనే నాగర్​కర్నూల్ […]

Read More
మావోయిస్టుల ఆటలు సాగనివ్వం

మావోయిస్టుల ఆటలు సాగనివ్వం

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదు ప్రజలు ఎవరూ నక్సల్స్ కు సహకరించవద్దు వెంకటాపురం ఠాణాను సందర్శించిన డీజీపీ మహేందర్ రెడ్డి సారథి న్యూస్, వాజేడు(ములుగు),భద్రాద్రి కొత్తగూడెం: కొంతకాలంగా ములుగు జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలు లేవని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్​రెడ్డి అన్నారు. తెలంగాణలో నక్సలైట్ల అరాచకాలు, ఆటలను సాగనివ్వబోమని హెచ్చరించారు. శనివారం ఆయన ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్​స్టేషన్​ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వారం రోజులుగా మావోయిస్టులు కదలికలపై అప్రమత్తమయ్యాం. కొన్నేళ్లుగా […]

Read More
పంజా విసిరిన కోవిడ్​–19

పంజా విసిరిన కోవిడ్​–19

ఏపీలో 4వేలకు చేరువలో కేసులు మొత్తం 44,609 పాజిటివ్​ కేసులు 24 గంటల్లో 52 మంది మృతి అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. టెస్టులు చేస్తున్నా కొద్దీ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 3,963 కేసులు నమోదైనట్లు శనివారం అధికారులు హెల్త్ బులెటిన్‌ రిలీజ్‌ చేశారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 44,609కు చేరింది. 24 గంటల్లో వ్యాధిబారిన పడి 52 మంది చనిపోయారు. దీంతో మొత్తం […]

Read More
ఆ పని కాంగ్రెస్​దే: బీజేపీ

ఆ పని కాంగ్రెస్​దే: బీజేపీ

జైపూర్‌‌: రాజస్థాన్‌లోని రాజకీయ నాయకుల ఫోన్‌లను కాంగ్రెస్‌ ట్యాప్‌ చేస్తోందని బీజేపీ ఆరోపించింది. ఆడియో టేప్‌లు బయటికి రావడంపై సీబీఐ విచారణ జరిపించాలని కమలం పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు. ‘ఫోన్‌ ట్యాపింగ్‌ చట్టపరమైన సమస్య కాదా? ఫోన్‌ ట్యాపింగ్‌కు నిర్దేశిత ప్రామాణిక విధానాలు ఉన్నాయా? రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితులపై సీఎం అశోక్‌ గెహ్లాట్‌ సమాధానం చెప్పాలి’ అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా నిలదీశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఫోన్‌ […]

Read More