సామాజిక సారథి , నాగర్ కర్నూల్: నీ భర్త వల్ల పిల్లలు పుట్టరు నా దగ్గరికి రా అని తల్లి ముందే ని సిగ్గుగా మాట్లాడి లైంగికంగా వేధించాడు ఒక కామాంధ ఆర్ఎంపి వైద్యుడు
.. వివరాల్లోకి వెళితే నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా జనరల్ ఆసుపత్రికి ఎదురుగా మినీ ట్యాంక్ బండ్ రోడ్డు నగల న్యూ లైఫ్ ఆసుపత్రి ఆర్ఎంపి వైద్యుడు సమీర్ వద్దకు తాడూరు మండలం యత్మతాపురం గ్రామానికి చెందిన ఒక మహిళ తల్లితోపాటు జ్వరం వస్తే చికిత్స కోసం వచ్చింది.. చికిత్స చేస్తున్న తరుణంలో ఆర్ఎంపి వైద్యుడు సమీర్ ఎన్ని రోజుల నుంచి జ్వరం వస్తుందని చెబుతూ ఎంతమంది పిల్లలు అని అడిగాడు..
… పిల్లలు లేరు అని సదరు మహిళా సమాధానం ఇవ్వడంతో ఎన్ని ఏళ్ళు అయింది పెళ్లి అయ్యి అని అడగడంతో ఆ మహిళ ఏడు సంవత్సరాలు అయిందని చెప్పింది. దీంతో ఆ మహిళా తల్లి ఉందన్న సోయిమర్చి ఒక మహిళ అని కూడా చూడకుండా నిర్లజ్జ గా మూడు నెలలు తనతో సంసారం చేస్తే పిల్లలు పుట్టిస్తానని చెప్పడంతో అక్కడే ఉన్న తల్లి సదరు ఆర్ఎంపీని గట్టిగా నిలదీసి కొట్టేంత పని చేసింది
… ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆ గ్రామ మాజీ సర్పంచ్ సహాయంతో గ్రామస్తులు ఆస్పత్రి వద్దకు రాకముందే అక్కడి నుంచి పలయనం చిత్తగించాడు.. అతని కోసం గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఎదురుచూసిన రాకపోవడంతో విషయం పాత్రికేయులకు తెలియడంతో అక్కడికి చేరుకున్నారు
… సదరు మహిళ జ్వరం ఉండడంతో మరో ఆసుపత్రికి వెళ్లిందన్న విషయం తెలుసుకొని జర్నలిస్టులు అక్కడికి వెళ్లి ఆమెతో జరిగిన విషయం తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా సదరు ఆర్ఎంపి వైద్యుడు గతంలో అనేక వివాదాలలో ఆరితేరినాడు
… ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులతో అంట కాగుతూ తన ఆసుపత్రిని నడుపుకుంటూ చిన్నాచితకా వైద్యులను ఆ పరిసరాలలో లేకుండా నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి పారిపోయేలా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇతనికి గత ప్రభుత్వంలో కొందరి అండదండలు ఉండడంతో ఇతను ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది. ఒక ఎంబిబిఎస్ డాక్టర్ను నామ్ కే వాస్తే ఆసుపత్రిలో పెట్టుకొని అనుమతులు పొంది వైద్యం మాత్రం ఈ ఆర్ఎంపి సమీర్ మాత్రమే చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.. గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులనే నానా రకాలుగా ఇబ్బందులు పెడితే అప్పట్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ( ఐఎంఏ )వారు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విధితమే
….ప్రస్తుతం ఒక మాజీ సర్పంచ్, మరి కొంతమందిని సంప్రదిస్తూ బేర సారాలకు దిగుతున్నట్లు తెలిసింది. ఇతనిపై అతని ఫామ్ హౌస్ లో తిండి సంబంధిత వ్యాధులకు ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా పసరుమందుతోపాటు నాటు వైద్యాన్ని నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు ఆరోపణలు వచ్చిన విషయం విధితమే
… అక్రమ సంపాదనకు అలవాటు పడిన సదరు ఆర్.ఎం.పి రాజకీయ నాయకుల అండదండలతో తాను ఏమి చేసినా చెల్లుతుందనే విధంగా వ్యవహరిస్తున్నాడనే విమర్శలు ఉన్నాయి. గతంలో కూడా ఇతని ఆసుపత్రిలో పనిచేసిన మహిళలు ఆసుపత్రికి వచ్చిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాడు అన్న విమర్శలు ఉన్నాయి. ఇతని ఆసుపత్రికి ఒంటరిగా మహిళలను పంపాలి అంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇంత జరుగుతున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చీమకుట్టినట్లు కూడా లేకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పోలీసులు ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయాన్ని మీడియా ముందల బాధిత మహిళ ఆమె తల్లి వెల్లడించారు. ఇతనిపై పోక్సో లాంటి కఠినమైన కేసులు పెట్టి చట్టపరంగా శిక్షించాలని పలు ప్రజాసంఘాలు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.