Breaking News

Month: July 2020

పోలీస్ ​గస్తీ మరింత పటిష్టం

సారథి న్యూస్, హుస్నాబాద్ : గ్రామాల్లో రాత్రి వెళల్లో పోలీస్​గస్తీని పటిష్ఠం చేయాలని ఏసీపీ సందేపొగు మహేందర్ అన్నారు. గురువారం కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన డివిజన్ స్థాయి నేర సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలతో అనేక మంది మృత్యువాత పడుతున్నారన్నారు. వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు. దర్యాప్తలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ సీఐ రఘు, […]

Read More
లంచం తీసుకుంటూ దొరికిన పెద్దడాక్టర్​

అడ్డంగా దొరికిన పెద్ద డాక్టర్

సారథిన్యూస్​, గద్వాల: లంచం తీసుకుంటూ జోగుళాంబ గద్వాల జిల్లా డీఎంహెచ్​వో భీమ్​నాయక్​ ఏసీబీ అధికారులను రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని వడ్డేపల్లి మండలంలో డాక్టర్​ ఏ మంజుల మెడికల్​ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె కాకతీయ యూనివర్సిటీలో పీజీలో జాయిన్​ అయ్యారు. ఇందుకోసం రిలీవింగ్​ ఆర్డర్​ కోసం డీఎంహెచ్​వోకు దరఖాస్తు చేసుకున్నారు. లంచాలకు అలవాటు పడ్డ డీఎంహెచ్​వో తన కిందిస్థాయి ఉద్యోగిని సైతం రూ. 7000 లంచం అడిగాడు. దీంతో మంజుల […]

Read More

కలెక్టర్​ ఆకస్మిక పర్యటన.. షాకింగ్​ నిజాలు

సారథిన్యూస్​, నాగర్​కర్నూల్​: నాగర్​కర్నూల్​ కలెక్టర్​ ఆకస్మిక పర్యటనతో షాకింగ్​ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్డీవో, ఎంపీడీవో కార్యాలయాల్లో సిబ్బంది ఎవరూ సమయానికి ఆఫీస్​కు రారని.. ప్రజలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని కలెక్టర్​ పర్యటనలో తేలింది. కొత్త కలెక్టర్​ శర్మన్​ విధుల్లో చేరినప్పటినుంచి బిజీబిజీగా గడుపుతున్నారు. ఎప్పటికప్పుడు ఆకస్మికపర్యటనలు చేస్తూ.. ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు. తాజాగా గురువారం ఆయన నాగర్​కర్నూల్​లో కాలినడకన తిరిగి పలు కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీచేశారు. ఉదయం 10:15 గంటలకు  డీఆర్వో మధుసూదన్ నాయక్ తో కలిసి […]

Read More
కరోనాతో 9 మంది మృతి

కరోనాతో 9 మంది మృతి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గురువారం 1,567 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా 50,826కు పాజిటివ్​కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా 1,661 మంది రికవరీ అయ్యాయి. మహమ్మారి బారినపడి ఒకేరోజు 9 మంది కరోనా మృత్యువాతపడ్డారు. ఇప్పటిదాకా 438 మంది మృతిచెందారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్ఎంసీ 662 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి 213, మేడ్చల్​33, సంగారెడ్డి 32, ఖమ్మం 10, కామారెడ్డి 17, వరంగల్ ​అర్బన్​75, వరంగల్ ​రూరల్​ 22, కరీంనగర్ 38, జగిత్యాల […]

Read More

ధైర్యంగా ఉండాలె

సారథి న్యూస్​, రామగుండం: కరోనా బాధితులు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని రామగుండం సీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. తగిన వైద్యం తీసుకుంటే ఈ వ్యాధి నుంచి కోలుకోవచ్చని చెప్పారు. దేశంలో కరోనా బారినపడి ఎంతో మంది 85 శాతంపైనే కరోనా నుంచి కోలుకున్నారని చెప్పారు. గురువారం సీపీ ఆదేశాల మేరకు డీసీపీ అశోక్​కుమార్ నేతృత్వంలో ​ కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయి చికిత్సపొందుతున్న పోలీసులకు రోగనిరోధకశక్తిని పెంచే పండ్లు, డ్రైఫ్రూట్స్​, టాబ్లెట్స్​ అందజేశారు. కరోనా బారినపడ్డ ప్రతి పోలీసు​కు […]

Read More

మొక్కల సంరక్షణ మన బాధ్యత

సారథిన్యూస్​, పెద్దపల్లి: మొక్కల సంరక్షణ మన అందరి బాధ్యత అని మంత్రి కొప్పుల ఈశ్వర్​ పేర్కొన్నారు. పర్యావరణహితం కోసం ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మైడిపల్లి వద్ద గురువారం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీఆర్​ఎస్​ ప్రభుత్వం గత ఆరేండ్లలో 150 కోట్ల మొక్కలను నాటిందని ఆయన చెప్పారు. అంతకుముందు మంత్రి అంతర్గాం మండలంలోని కందనపల్లిలో మంత్రి పర్యటించి అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆయా […]

Read More

విద్యార్థులే తెలంగాణ సంపద

సారథిన్యూస్, చొప్పదండి: విద్యార్థులే తెలంగాణ సంపద అని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పేర్కొన్నారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా చొప్పదండి మోడల్ స్కూల్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతమైన ఉద్యోగాలు సాధించాలని సూచించారు. నలుగురికి సాయం చేసే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, సింగిల్ విండో ఛైర్మన్ మల్లారెడ్డి, నాయకులు గొల్లపల్లి శ్రవణ్, తోట శేషాద్రి, మాచర్ల వినయ్, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More

ఇప్పుడేం చెప్పలేం..

సారథి న్యూస్, హైదరాబాద్ : విద్యాసంవత్సరం ప్రారంభంపై ఇప్పుడే చెప్పలేమని ప్రభుత్వం పేర్కొంది. విద్యా సంవత్సరం ప్రారంభమనేది కరోనా పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని నివేదికలో తెలిపింది. కరోనా తీవ్రత వల్ల చాలా రాష్ట్రాలు ఇంకా విద్యాసంవత్సరం ఖరారు చేయలేదని చెప్పింది. అనువైన విద్యాసంవత్సరం ఖరారు చేసే పనిలో ఉన్నామని కోర్టుకు విన్నవించింది. అదనపు ఆర్థికం భారం లేని బోధన పద్ధతులపై కసరత్తు జరుగుతోందని తెలిపింది. విద్యాసంవత్సరం, నిరంతర అభ్యసన విధానం ఖరారయ్యాక ఆన్‌లైన్‌ తరగతులపై మార్గదర్శకాలు జారీచేస్తామని […]

Read More