Breaking News

రైతులు

5రోజులు విస్తారంగా వర్షాలు

5రోజులు విస్తారంగా వర్షాలు

సారథి న్యూస్​ : రుతుపవనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే సాధారణం కంటే వర్షపాతం నమోదైంది. పలు చోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా రాయలసీమలో ఈ సారి వర్షాల తీవ్రత అధికంగానే ఉంది. కాగా నేటి నుంచి అయిదు రోజుల పాటు తెలంగాణ, కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఈ రోజు, రేపు ఉరుముల‌తో కూడిన భారీ […]

Read More
రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..

రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..

సారథి న్యూస్​, అమరావతి : సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్​ రైతులకు శుభవార్త చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ అగ్రిల్యాబ్ లు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా స్థాయిలో 13 అగ్రిల్యాబ్ లు, నియోజకవర్గ స్థాయిలో 147 అగ్రి ల్యాబ్ లు, రాష్ట్ర స్థాయిలో 4 వైఎస్సార్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ, గుంటూరు, ఏలూరు, తిరుపతి నగరాల్లో ప్రాంతీయ ల్యాబ్స్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ ల్యాబ్స్ వల్ల విత్తనాలు, […]

Read More
వ్యవసాయ శాఖపై సీఎం సమీక్ష

వ్యవసాయ శాఖపై సీఎం సమీక్ష

సారథి న్యూస్, హైదరాబాద్: వ్యవసాయ శాఖ పై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచడానికి, స్వతంత్ర భారతంలో గతంలో ఎన్నడూ..ఎక్కడా జరగనంత ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోందని సమావేశంలో పాల్గొన్న అధికారులను, మంత్రులనుద్దేశించి మాట్లాడారు. కోట్లాది రూపాయల ఖర్చుతో ప్రాజెక్టుల నిర్మిస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఉచితంగా సాగునీరు అందిస్తూ.. ఒక్క రూపాయి భూమిశిస్తు తీసుకోవద్దనే లక్ష్యంతో నీటి తరువాయి విధానాన్ని రద్దు […]

Read More
జూరాల లింక్ కెనాల్ కు గండి

జూరాల లింక్ కెనాల్ కు గండి

సారథిన్యూస్​, మానోపాడు: జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి చిన్న ఆముదాలపాడు మధ్యన ఉన్న జూరాల లింక్ ఆర్​ డీఎస్​ ప్రధాన కాల్వకు భారీ గండి పడింది. దీంతో రెండు రోజులుగా పంటపొలాల్లో కాలువ నీరు ప్రహిస్తుండంతో పొలాలు ఆగమవుతున్నయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా ఈ కాలువ పరిస్థితి ఇదేవిధంగా ఉందని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు అంటున్నారు. ప్రధాన కాలువలో సీల్టు తీయకపోవడం వల్లే ఈ గండ్లు ఏర్పడుతున్నాయని సమీప బాధిత […]

Read More

నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం

సారథి న్యూస్​, పెద్దపల్లి: ప్రాజెక్టుల నిర్మాణాలకు భూములిచ్చిన రైతుల త్యాగం మరువలేనిదని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్​ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శనివారం ఆయన పాలకుర్తి మండలం వెంనూర్​లో ఎల్లంపల్లి రిజర్వాయర్​ కోసం భూములు కోల్పోయిన రైతులతో సమావేశమయ్యారు. నిర్వాసితులందరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​, పాలకుర్తి తహసీల్దార్​ రాజమణి, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి పాల్గొన్నారు.

Read More
రైతు పక్షపాతి కేసీఆర్​

రైతు పక్షపాతి కేసీఆర్

సారథి న్యూస్​, పాల్వంచ: సీఎం కేసీఆర్​ తెలంగాణ రాష్ర్ట రైతుల పక్షపాతని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. పాల్వంచ కో ఆపరేటివ్ సొసైటీ కి కొత్త సభ్యులకుగాను రూ.65 లక్షలు మంజూరయ్యాయి. పాల్వంచ సొసైటీ కార్యాలయంలో గురువారం వనమా రైతులకు పంట రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా వనమా మాట్లాడుతూ కేసీఆర్​ సీఎం అయిన తర్వాత రైతులకు అనేక సంక్షేమ పథకాలు చేపట్టి రూ.లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేశారన్నారు. రైతుబంధు […]

Read More
రైతులపై డీజిల్‌ పిడుగు

రైతులపై డీజిల్‌ పిడుగు

సారథి న్యూస్​, హైదరాబాద్​: పెరుగుతున్న డీజిల్‌ ధరలు రైతులపై అదనపు భారం మోపుతున్నాయి. పెరిగిన ఇంధన ధరలకు అనుగుణంగా ట్రాక్టర్లు, యంత్రాల కిరాయిలు పెరుగుతుండడంతో పెట్టుబడి ఖర్చు పెరిగిపోతోంది. వ్యవసాయంలో ప్రస్తుతం యంత్రాల వినియోగం భారీగా పెరిగి పోయింది. సాగు పనులకు కూలీల కొరత వేధిస్తుండడంతో రైతులు యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. దుక్కి దున్నడం మొదలుకుని పంట చేతికొచ్చే వరకు కీలకంగా మారాయి. కరోనా నేపథ్యంలో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న రైతులకు మూలుగుతున్న నక్కపై తాటిపండు పడ్డ చందంగా […]

Read More

వరిలో మొగిపురుగును అరికట్టండిలా..

సారథి న్యూస్, రామాయంపేట: ప్రస్తుత వానాకాలంలో రైతులు సాగు చేస్తున్న వరినారు మళ్లలో మొగి పరుగు సోకిందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. గురువారం వారు మెదక్​ జిల్లా రామాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో వరినారును పరిశీలించారు. మొగి పురుగు నివారణకు కార్బోఫ్యూరన్​ లేదా కార్టప్​హైడ్రోక్లోరైడ్​ గుళికలను నారుమళ్లలో చల్లుకోవాలని నిజాంపేట వ్యవసాయాధికారి సతీశ్​ తెలిపారు. నారుమళ్లలో సూక్ష్మధాతు లోపాలు గమనిస్తే ఫార్ములా 4ను పిచికారి చేసుకోవాలని సూచించారు.

Read More