Breaking News

YSRCP

సీమ అభివృద్ధికి అడ్డుపడితే ఊరుకోం

సీమ అభివృద్ధికి అడ్డుపడితే ఊరుకోం

సారథి న్యూస్, కర్నూలు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏపీ, తెలంగాణగా విడిపోయినప్పుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఏంచేశారని, హైదరాబాద్‌ మాత్రమే అభివృద్ధి చేసినందుకే ఇప్పుడీ పరిస్థితి వచ్చిందని కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ అన్నారు. రాష్ట్రంలో అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాన్న లక్ష్యంతో పోరాడుతున్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు కనీస జ్ఞానం కూడా లేకపోయిందని ఘాటుగా విమర్శించారు. రాయలసీమ అభివృద్ధికి అడ్డుపడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం వైఎస్‌ […]

Read More
అయ్యయ్యో.. ఎంత పని

అయ్యయ్యో.. ఎంత పని

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఏపీలో అధికార పక్షానికి ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చిపడింది. ఒకటి ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు రూపంలో ఉంటే.. మరోటి టీడీపీ అవినీతి విధానాలకు ఉదాహరణగా చూపిన పోలవరం అంశం. ఈ రెండూ ఇప్పుడూ సీఎం వైఎస్​ జగన్‌ శిబిరంలో టెన్షన్‌ రేపాయి. కొంతకాలంగా వైఎస్సార్​సీపీకి చెందిన నరసరాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పార్టీ విధానాలకు, ముఖ్యంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఏం […]

Read More
ప్రొఫెసర్లకు జీతాలు ఇవ్వండి

ప్రొఫెసర్లకు జీతాలు ఇవ్వండి

సారథి న్యూస్, కర్నూలు: రాయసీమ యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్లకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, వెంటనే ఇవ్వాలని వైఎస్సార్​సీపీ విద్యార్థి విభాగం యూనివర్సిటీ అధ్యక్షుడు ప్రశాంత్‌ రెడ్డిపోగు, జేఏసీ నాయకులు నాగరాజు, సురేష్‌ కోరారు. ప్రొఫెసర్ల జీతాలు చెల్లించకపోవడంలో యూనివర్సిటీ ఇన్‌చార్జ్‌ ఉపకుపతి ఎంఎం నాయక్‌ తీరును ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక కొంత మంది యూనివర్సిటీ అధికారులు టీడీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇన్​చార్జ్‌ ఉపకుపతిని తొలగించి, రెగ్యులర్‌ వీసీని నియమించాలని డిమాండ్​చేశారు. […]

Read More
ఇరికించబోయి.. ఇరుక్కున్నారా..?

ఇరికించబోయి.. ఇరుక్కున్నారా..?

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఆంధ్రప్రదేశ్​ రాజకీయం ఇప్పుడు అంతా హైదరాబాద్‌ నగరంలోని పార్క్‌ హయత్‌ హోటల్‌ చుట్టూ తిరుగుతోంది. ఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ టీడీపీ ఏజెంట్​గా పనిచేశారని ఆరోపిస్తూ వైఎస్సార్​సీపీ ప్రభుత్వం ఆయనను పదవినుంచి తొలగించింది. వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొత్త ఎన్నికల అధికారిని కూడా నియమించింది. అయితే, రమేష్‌కుమార్‌ దీనిపై హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. వెంటనే ఆయనను విధుల్లో తిరిగి నియమించాలని కూడా […]

Read More

మళ్లీ నిరాశేనా..?

ఏ పార్టీలో ఉన్నా ఆమె ఫైర్‌బ్రాండే.. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ రచ్చరచ్చే. అది మీటింగ్‌ కానీ, అసెంబ్లీ కానీ. ఒకప్పుడు ఆమెను ఐరన్‌లెగ్‌గా అభివర్ణించినా.. దానికి చెక్‌ పెడుతూ ఇక ఆమెకు అంతా విజయమే అనుకున్నారు చాలామంది. కానీ, విజయం అంచులదాకా వచ్చి దూరమవుతోంది.. అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇదంతా ఎవరి గురించో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆమే ఏపీ రాష్ట్రంలోని వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా. ఆమె సినీజీవితంలో ఎంతో ఎత్తుకు […]

Read More

వారెక్కడ?

తెలుగుదేశం పార్టీ సీనియర్లు ఎక్కడా కనిపించడం లేదు ఎందుకో.. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వారే పార్టీకి దూరంగా ఉన్నారా.. లేక పార్టీయే వారిని దూరం పెట్టిందా.. వారు దూరంగా ఉండడానికి యువనేత లోకేష్‌ పాత్ర ఏమైనా ఉందా.. యువకులకు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో వారిని పక్కన పెట్టారా..? ఇలా అనేక అనుమానాలు టీడీపీ క్యాడర్‌లో వ్యక్తమవుతున్నాయి. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నవారు కూడా ఇప్పుడు ఎందుకు కనిపించకుండా పోయారన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. వడ్డే శోభనాదీశ్వరరావు […]

Read More

వైఎస్సార్​సీపీలో ధిక్కారస్వరం

ఆంధ్రప్రదేశ్​లో పాలకపక్షమైన వైఎస్సార్ ​సీపీలో మరోసారి ధిక్కార స్వరం వినిపించింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ వైఎస్సార్ ​సీపీ నిర్ణయాలకు వ్యతిరేకంగా టీడీపీకి అనుకూలంగా మాట్లాడారు. దీంతో పార్టీలో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. తరచూ పార్టీని, సీఎం వైఎస్​ జగన్‌ మోహన్​రెడ్డిని విమర్శిస్తున్న ఆ పార్టీకి చెందిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి శుక్రవారం ఓ న్యూస్‌ చానల్‌లో మాట్లాడుతూ..తమ సొంత పార్టీ నిర్ణయాలపై విరుచుకుపడ్డారు. కేవలం ముగ్గురు ఎంపీలకు తప్ప మిగతా వారెవరికీ పార్టీ అధినేత, […]

Read More
కార్మికుల రక్షణే ముఖ్యం.

కార్మికుల రక్షణే ముఖ్యం

సారథి న్యూస్, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా ఆర్ఎఫ్సీఎల్ ఫ్యాక్టరీని మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల తయారీకి అనుమతి ఇవ్వడంతో అందులో పనిచేస్తున్న 1,400 మంది కార్మికులకు అవసరమైన రక్షణ చర్యలను పరిశీలించారు. వారంతా సామాజిక దూరం పాటించడంతో పాటు తప్పనిసరిగా మాస్క్ లు ధరించేలా చూడాలని సీపీ ఆదేశించారు. ఆయన వెంట గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ కరీంనగర్ రావు, ఎన్టీపీసీ ఎస్సై ఉమాసాగర్, ఆర్ఎఫ్సీఎల్ అధికారులు, […]

Read More