సారథి, రామగుండం: ఆర్ఎఫ్సీఎల్ కంపెనీలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా డబ్బులకు కక్కుర్తిపడి ఒక్కో ఉద్యోగానికి రూ.ఆరు నుంచి రూ.పదిలక్షలు వసూలు చేస్తూ ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ ఆరోపించారు. ఈ మేరకు ఎన్టీపీసీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్ఎఫ్ సీఎల్ సీఈవోను వెంటనే బర్తరఫ్ చేసి సీబీఐ విజిలెన్స్ ద్వారా విచారణ జరిపించాలని రియాజ్ డిమాండ్ చేశారు. సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు ఆకుల రామ్ కిషన్, తోట వేణు, వెల్తురు మల్లయ్య, […]
సారథి న్యూస్, గోదావరిఖని: స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని పెద్దపల్లి జిల్లా ఆర్ఎఫ్సీఎల్ కు వచ్చిన కేంద్ర రసాయన ఎరువులశాఖ సహాయ మంత్రి మాన్సుఖ్ మాండవియా, హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు శనివారం వినతిపత్రం అందజేశారు. వారిలో కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ఎంఎస్ రాజ్ ఠాకూర్, కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, ఎండీ ముస్తాఫా, గాదం నందు, ఫక్రుద్దిన్, నగునూరి రాజు, పెండ్యాల మహేష్, నాజిమొద్దిన్, కౌటం సతీష్ పాల్గొన్నారు.
సారథి న్యూస్, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా ఆర్ఎఫ్సీఎల్ ఫ్యాక్టరీని మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల తయారీకి అనుమతి ఇవ్వడంతో అందులో పనిచేస్తున్న 1,400 మంది కార్మికులకు అవసరమైన రక్షణ చర్యలను పరిశీలించారు. వారంతా సామాజిక దూరం పాటించడంతో పాటు తప్పనిసరిగా మాస్క్ లు ధరించేలా చూడాలని సీపీ ఆదేశించారు. ఆయన వెంట గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ కరీంనగర్ రావు, ఎన్టీపీసీ ఎస్సై ఉమాసాగర్, ఆర్ఎఫ్సీఎల్ అధికారులు, […]