Breaking News

Day: June 24, 2020

ఆర్‌బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు

న్యూఢిల్లీ: సహకార బ్యాంకుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని సహకార బ్యాంకులను రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆర్డినెన్స్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశంలో 1,482 అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకులు, 58 మల్టీ స్టేట్‌ కోపరేటివ్‌ బ్యాంకులు ఇక ఆర్‌బీఐ పరిధిలోకి రానున్నాయని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తెలిపారు.

Read More

వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా

సారథి న్యూస్, కర్నూలు: ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ నిధి ద్వారా వీధి వ్యాపారులకు రూ.10వేల రుణసాయాన్ని అందించేందుకు ప్లాన్​ చేయాలని కర్నూలు మున్సిపల్​ కార్పొరేషన్​ కమిషనర్ డీకే బాలాజీ సూచించారు. బుధవారం ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులు, వీధి వ్యాపారుల సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. లాక్ డౌన్ కారణంగా నష్టపోయిన చిరువ్యాపారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి చేయుతనివ్వడానికి రుణాల మంజూరుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. తీసుకున్న రుణాన్ని సక్రమంగా తిరిగి చెల్లించిన వారికి ప్రోత్సాహకంగా […]

Read More

పదవికి వీకే సింగ్ రాజీనామా

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ పదవికి సినీయర్​ ఐపీఎస్ వినోద్ కుమార్ సింగ్(వీకే సింగ్) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు పంపించారు. కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వంపై వీకే సింగ్ అసంతృప్తితో ఉన్నారు. మే 21న కూడా తన పదోన్నతికి సంబంధించి సీఎస్‌కు లేఖ రాశారు. లేఖ కాపీని సీఎం కేసీఆర్‌కు కూడా పంపించారు. డీజీపీగా తనకు పదోన్నతి కల్పించాలని, అందుకు తనకు అన్ని అర్హతలు […]

Read More

సింగరేణిలో సమ్మె సైరన్

50 బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె జూలై 2 నుంచి 4 తేదీ వరకు నిరవధిక నిరసన సారథి న్యూస్​, గోదావరిఖని: బొగ్గు గనుల్లో మళ్లీ సమ్మె సైరన్ మోగనుంది. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గుర్తింపు సంఘాలైన సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్ టీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్ సంఘాలు జులై 2, 3, 4 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చాయి. యాజమాన్యం ఈనెల 18న మొదటి విడత 41 బొగ్గు బ్లాక్​లను […]

Read More

10వేల మార్క్​ దాటిన కరోనా

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్​ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బుధవారం ఒకే రోజు 891 కేసులు పాజిటివ్​గా నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 10,444కి చేరింది. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 719 కేసులు, రంగారెడ్డి జిల్లా నుంచి 86, మేడ్చల్​జిల్లా నుంచి 55 అత్యధికంగా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మహమ్మారి బారిన పడి ఐదుగురు చనిపోయారు. దీంతో మరణాల సంఖ్య 225కి చేరందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. […]

Read More

టీఆర్​ఎస్​తోనే అభివృద్ధి

ఖమ్మం: టీఆర్​ఎస్​ హయాంలోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పేర్కొన్నారు. ఖమ్మం కార్పొరేషన్​ పరిధిలోని 41, 43వ డివిజన్ మిర్చి మార్కెట్ రోడ్ లో రూ.కోటితో నిర్మించిన డబుల్ రోడ్, సెంట్రల్ లైటింగ్ పనులను మేయర్ పాపాలాల్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్​ కమిషనర్​ అనురాగ్​ జయంతి, కార్పొరేటర్​, మున్సిపల్​ అధికారులు పాల్గొన్నారు.

Read More

పట్టుదలతో చదివితేనే భవిష్యతు

సారథి న్యూస్, బెజ్జంకి: విద్యార్థులు తల్లిదండ్రులు కలలను సాకారం చేయాలని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ పేర్కొన్నారు. బుధవారం బెజ్జంకి ఆదర్శ కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఇంటర్​ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రవళిక(973, బైపీసీ), స్వీటీ (971 ఎంపీసీ)లను అభినందించారు. అనంతరం మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. విద్యార్థులు పట్టుదలతో చదివితేనే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని చెప్పారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్, లెక్చరర్లు,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Read More

అకడమిక్ మెరిట్ పత్రాల అందజేత

సారథి న్యూస్, హన్మకొండ: హన్మకొండలోని భీమరం మైనార్టీ గురుకుల స్కూలులో సాంఘిక శాస్త్రం టీచర్​గా పనిచేస్తున్న స్రవంతికి మొదటి సంవత్సరం పూర్తిచేసుకున్న సందర్భంగా అకడమిక్ మెరిట్ ధ్రువీకరణపత్రాన్ని ఆ సంస్థ బుధవారం అందజేసింది. ఈ సందర్భంగా తన జీవితంలో తొలి అడుగు అంటూ ఆమె ఆనందం వ్యక్తంచేసింది. పలువురు స్రవంతిని అభినందించారు.

Read More