లాహోర్: పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిది ఆఫ్రిది.. కరోనా వైరస్ బారినపడ్డాడు. ప్రస్తుతం అతను చికిత్స తీసుకుంటున్నాడు. ఓ పెద్దస్థాయి క్రికెటర్‌కు వైరస్ సోకడం ఇదే తొలిసారి. ‘గురువారం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నా. జ్వరం కూడా రావడంతో కరోనా పరీక్ష చేయించుకున్నా. పాజిటివ్‌గా తేలింది. నేను కోలుకోవాలని మీరు ప్రార్థిస్తారని కోరుకుంటున్నా’ అని ఆఫ్రిది ట్వీట్ చేశాడు. కరోనా కారణంగా ఆగిపోయిన పాక్ సూపర్ లీగ్‌లో ఆడిన ఆఫ్రిది.. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పుడు తన ఫౌండేషన్ […]
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా మాదిరిగా 25 శాతం మంది ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించినా బాగానే ఉంటుందని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు. ప్రేక్షకులు లేకపోతే మ్యాచ్‌ల్లో ఉత్సాహం ఉండదన్నాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టేడియాల్లోకి అభిమానులను అనుమతిస్తే అంతకంటే గొప్ప విషయం మరోటి లేదన్నాడు. ‘ఫుల్ స్టేడియంలో మ్యాచ్ ఆడితే వచ్చే కిక్కే వేరు. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు ఆడటం ద్వారా ఎనర్జీ మిస్‌అవుతాం. ప్లేయర్లకు ఇది మైనస్ పాయింట్. గ్రౌండ్‌లో అభిమానులు చేసే హంగామా ఏం […]
మెల్‌బోర్న్: కరోనా దెబ్బకు చాలా మంది బెంబేలెత్తినా.. ఇద్దరు భారత విద్యార్థులు మాత్రం తమ దేశంలో నిస్వార్థంగా సేవలందిస్తున్నారని ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రశంసించారు. కేరళకు చెందిన 22 ఏళ్ల షారోన్ వార్గిస్.. 2016లో ఆసీస్‌కు వెళ్లి వొలాంగోంగ్ యూనివర్సిటీలో నర్సింగ్ విద్యను పూర్తి చేసింది. ప్రస్తుతం అక్కడే కేర్ హోమ్‌లో కరోనా రోగులకు సేవలందించడంపై గిల్లీ ప్రశంసలు కురిపించాడు. ‘షరోన్.. నీ సేవలను మరువలేం. నిన్ను చూసి […]
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్‌లో ఐపీఎల్ జరిగే అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నాయని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లీగ్‌ను నిర్వహించడం పెద్ద తలనొప్పితో కూడుకున్న వ్యవహారమన్నాడు. అయితే సెప్టెంబర్‌లో శ్రీలంక లేదా యూఏఈలో మెగా టోర్నీని నిర్వహించేందుకు అనుకూలంగా ఉంటుందన్నాడు. ‘స్టేడియాల్లోకి అభిమానులను అనుమతిస్తూ ఆసీస్ నిర్ణయం తీసుకోవడంతో టీ20 ప్రపంచకప్‌పై ఆశలు మొలకెత్తుతున్నాయి. అక్టోబర్‌లో ఈ మెగా ఈవెంట్ ఉంటే అంతకంటే ముందుగానే అన్ని జట్లు అక్కడికి వెళ్తాయి. క్వారంటైన్, […]
న్యూఢిల్లీ: నాకౌట్ మ్యాచ్‌ల్లో ఎదురయ్యే ఒత్తిడిని టీమిండియా క్రికెటర్లు తట్టుకోలేరని మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. మెగా ఈవెంట్లలో సెమీస్, ఫైనల్ మ్యాచ్‌ల్లో కోహ్లీసేన ఆటతీరు చూస్తే ఇది అర్థమవుతుందన్నాడు. ఈ విషయంలో మెరుగుపడనంత వరకు ప్రపంచ చాంపియన్లు కాలేరన్నాడు. ‘నాకౌట్ మ్యాచ్‌ల్లో మన ఆట బాగాలేదు. గత కొన్ని టోర్నీల్లో దీనిని చూశాం. ఈ మ్యాచ్‌ల్లో మనం ఎలా ఆడతామనే దానిని బట్టే మంచి, అద్భుతమైన ప్లేయరా అనేది తెలుస్తుంది. ఇతర జట్లలాగా మనం […]
న్యూఢిల్లీ: ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించే సామర్థ్యం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు ఉందని భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. కరోనాను అద్భుతంగా కట్టడి చేసిన ఆ దేశం.. ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వడం పెద్ద కష్టమేమీ కాదన్నాడు. అయితే ఇంగ్లండ్‌లో వెస్టిండీస్ పర్యటన విజయవంతమైతే.. వరల్డ్‌కప్‌కు మరింత లైన్ క్లియర్ అవుతుందన్నాడు. ‘విండీస్.. ఇంగ్లండ్‌లో పర్యటించడం శుభవార్త. క్రికెట్ పునరుద్ధరణ కావడం మరింత ఆనందం. ఈ రెండు జట్ల మధ్య జరిగే సిరీస్.. […]
ముంబై: భారత క్రికెట్లో కురువృద్ధుడు వసంత్ రాయిజీ (100) పరమపదించారు. వయోధిక భారంతో వచ్చే సమస్యలతోనే ఆయన తుదిశ్వాస విడిచారు. 1940లో తొమ్మిది ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన రాయిజీ.. 277 పరుగులు సాధించాడు. ఇందులో అత్యధిక స్కోరు 68 పరుగులు. 1933లో టీమిండియా తొలి టెస్ట్ ఆడినప్పుడు రాయిజీ వయసు 13 ఏళ్లు. అప్పట్నించి.. ఇప్పటివరకు భారత క్రికెట్ ప్రయాణాన్ని పూర్తిస్థాయిలో చూశాడు. 1939లో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తరఫున ఫస్ట్ […]
న్యూఢిల్లీ: టీమిండియా టెస్ట్ ప్లేయర్ చతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, స్పిన్నర్ రవీంద్ర జడేజాతో పాటు మహిళా క్రికెటర్లు స్మృతి మందన, దీప్తిశర్మకు.. జాతీయ డోపింగ్ సంస్థ (నాడా) నోటీసులు జారీచేసింది. ‘ఎప్పుడు, ఎక్కడ’ అనే క్లాజ్‌ను ఉల్లంఘించినందుకు నాడా చర్యలు చేపట్టింది. రాబోయే మూడు నెలలు ఎక్కడ ఉంటారో.. ముందుగానే నాడాకు తెలియజేయడమే ఈ క్లాజ్ ఉద్దేశం. దేశవ్యాప్తంగా మొత్తం 110 మంది అథ్లెట్లు నాడా రిజిస్టర్ టెస్టింగ్ పూల్ కింద నమోదై ఉన్నారు. వీళ్లంతా […]