లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్‌ప్రదేశ్ లోని హత్రాస్‌లో దళిత యువతి హత్యపై ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ శనివారం ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ నివేదిక మేరకు సీఎం యోగి ఆదిత్యానాథ్ సంబంధిత జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఎస్సై, హెడ్‌కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. వారికి నార్కో ఎనాలిసిస్, పాలిగ్రాఫ్ పరీక్షలు […]
సారథి న్యూస్, వెంకటాపురం: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు రైతులకు గుదిబండ లాంటిదని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ఏఐసీసీ పిలుపుమేరకు ములుగు జిల్లా నుగూరు వెంకటాపురం మండలకేంద్రంలో ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు అధాని, అంబానీ కోసమేనని విమర్శించారు. బిల్లు ప్రకారం సప్లై చైన్ లో రైతులనుంచి రీటైలర్ వరకూ ఎవరు ఎంతైనా స్టోర్ చేసుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నల్లేల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ […]
సారథి న్యూస్, రామగుండం: తమకు వేతనాలు ఇప్పించాలని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న పీఆర్పీ కోరారు. ఈ మేరకు వారు రామగుండం మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. జీతాలు లేక చాలా రోజులుగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సీపీఐ నగర కార్యదర్శి కె.కనకరాజు, సహాయ కార్యదర్శి మద్దెల దినేశ్ ఉన్నారు.
సారథి న్యూస్, రామడుగు: కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కవ్వం పల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. కాంగ్రెస్‌పార్టీ కిసాన్‌సెల్ ఉపాధ్యక్షుడిగా సయిండ్ల నర్సింగం, అధికార ప్రతినిధిగా కాడే శంకర్‌ను నియమిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు వారికి శనివారం నియామకపత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో నర్సింగం, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: ‘గిఫ్ట్ ఏ స్మైల్’ పిలుపులో భాగంగా వరంగల్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు ఒక్కో అంబులెన్స్ వాహనాన్ని ఉచితంగా ఇవ్వడానికి ముందుకొచ్చారు. శనివారం మూడు అంబులెన్స్ వాహనాలను మంత్రి కె.తారక రామారావు ప్రగతిభవన్‌లో ప్రారంభించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ మేయర్ గుండా ప్రకాష్, మహబూబాబాద్ ఎంపీ మలోత్ కవిత, ఎమ్మెల్యే […]
సారథి న్యూస్, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖను పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌అన్నారు. శనివారం వెంగల్రావు నగర్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ఆఫ్ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, ఆయుష్ ఇన్చార్జ్డైరెక్టర్ ప్రశాంతి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడిషన్ డాక్టర్రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ రావు, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, కమిటీ […]
సారథిమీడియా, శ్రీకాకుళం: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట పోలీస్‌స్టేషన్ రణరంగంగా మారింది. వైసీపీ, టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఘర్షణ పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొన్నది. శనివారం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ను అరెస్ట్ చేయాలని టీడీపీ శ్రేణులు నరసన్న పేట పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో ధర్మానకు మద్దతుగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. పోలీసులు రంగప్రవేశం […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: న్యాయం చేయాలంటూ ఓ యువతి శ్రీకాకుళం మహిళా పోలీసులను ఆశ్రయించింది. కట్నం తీసుకొస్తేనే కాపురానికి రావాలంటూ భర్త, అత్తమామ.. ఇంటి నుంచి గెంటేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ధర్మవరం గ్రామానికి చెందిన శిరీష , తన సమీప బంధువైన చంద్రశేఖర్ ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. చంద్రశేఖర్ తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదు. దీంతో కట్నం తేవాలని వారు ఒత్తిడి తెస్తున్నారని శిరీష ఆరోపించింది. తనకు న్యాయం […]