Breaking News

TELANAGANA

టీజీవో నాగర్​కర్నూల్​జిల్లా కమిటీ ఎన్నిక

టీజీవో నాగర్​కర్నూల్ ​జిల్లా కమిటీ ఎన్నిక

సారథి ప్రతినిధి, నాగర్​కర్నూల్: రాష్ట్రకమిటీ పిలుపు మేరకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అన్ని జిల్లాల కార్యవర్గాలను ఎన్నుకుంటామని ఉమ్మడి మహబూబ్​నగర్​జిల్లా టీజీవో కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి(ఆర్టీవో) స్పష్టంచేశారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా పి.రాజశేఖర్ రావు, ప్రధాన కార్యదర్శిగా భగవేణి నరసింహులు, ఉపాధ్యక్షులుగా వి.తిరుపతయ్య, ఖాజమైనోద్దిన్, ఎస్టీవో రాజు, కోశాధికారిగా డాక్టర్ వేముల శేఖరయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఖదీర్, జాయింట్ […]

Read More
మీకు ‘కిసాన్​సమ్మన్’ డబ్బులు వచ్చాయా..?

మీకు ‘కిసాన్​ సమ్మన్’ డబ్బులు వచ్చాయా..?

సారథి న్యూస్, హైదరాబాద్: రైతన్నలను ఆదుకోవాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం ‘ప్రధానమంత్రి కిసాన్ ​సమ్మన్​నిధి యోజనా’ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా సంవత్సరానికి రూ.ఆరువేలు అందిస్తోంది. ఈ దఫా రైతులకు రూ.2,000 చొప్పున చెల్లించనుంది. కేంద్ర ప్రభుత్వ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్​ఫర్(డీబీటీ) ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలోకి జమచేయనుంది. ఈ మేరకు అర్హులైన రైతుల వివరాలను రాష్ట్రం, జిల్లా, గ్రామాల వారీగా విడుదల చేసింది. తమ పేర భూములు ఉన్న రైతులు రాష్ట్రం, జిల్లా, మండలం, […]

Read More
ప్రకృతివనం పరిశీలన

ప్రకృతివనం పరిశీలన

సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం గోపాల్​రావుపేట గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని సోమవారం గ్రామ పాలకవర్గం పరిశీలించింది. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, వారి కుటుంబ సభ్యుల తో కలసి సోమవారం పకృతి వనాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కర్ర సత్య ప్రసన్న, ఉపసర్పంచ్ ఎడవెల్లి మధుసూదన్ రెడ్డి, ఎంపీటీసీలు ఎడవెల్లి నరేందర్ రెడ్డి, ఎడవెల్లి కరుణశ్రీ, రామడుగు మండల కో ఆప్షన్ రజబ్ అలీ వార్డు […]

Read More

కాళేశ్వరం.. మత్స్యకారులకు వరం

గోదావరిఖని: కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులే కాక మత్స్యకారులు కూడా బాగుపడుతున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పేర్కొన్నారు. గోదావరి దిశ మార్చిన అపరభగీరథుడు కేసీఆర్​ అని కొనియాడారు. అదివారం ఆయన కుందనపల్లి, గోదావరినది వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. కేసీఆర్​ నేతృత్వంలోని టీఆర్​ఎస్​ సర్కారు అన్ని కులవృత్తులకు న్యాయం చేస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో పలువురు టీఆర్​ఎస్​ నాయకులు పాల్గొన్నారు.

Read More
మహిళాసాధికారతే ప్రభుత్వ ధ్యేయం

మహిళాసాధికారతే ప్రభుత్వ ధ్యేయం

సారథి న్యూస్, హైద‌రాబాద్: మ‌హిళా సాధిరాకత, స్వయం సమృద్ధే లక్ష్యంగా పేద మ‌హిళ‌ల‌ను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, ఫుడ్​ప్రాసెసింగ్​యూనిట్లపై ప్రభుత్వం దృష్టిపెట్టిందని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. పేద‌రిక నిర్మూల‌న సంస్థ(సెర్ప్) ఆధ్వర్యంలో హైద‌రాబాద్లోని రాజేంద్రనగర్​, టీఎస్ ఐపార్డ్ లో గురువారం నిర్వహించిన వర్క్​షాపునకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాళేశ్వరం, దేవాదుల‌, ఎస్సారెస్పీ వంటి అనేకానేక ప్రాజెక్టుల‌తో జ‌లవిప్లవం వచ్చిందన్నారు. వ్యవసాయ ఆధారిత […]

Read More

మార్కెటింగ్​ సమస్యను అధిగమిద్దాం

సారథి న్యూస్, రామడుగు: రైతన్నలు మార్కెటింగ్​ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని రామడుగు వ్యవసాయాధికారి యాస్మిన్​ పేర్కొన్నారు. తాము పండించిన ఉత్పత్తులను తామే విక్రయించుకొనే స్థాయికి ఎదగాలని సూచించారు. రైతులంతా సమష్టిగా ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. బుధవారం కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్​లో ఉత్పత్తిదారుల సంఘంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా యాస్మిన్​ మాట్లాడారు. రైతు ఉత్పత్తి దారుల సంఘాలు ఏర్పాటు చేసుకుంటే సమిష్టిగా లాభాలు పొందవచ్చని ఆమె సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బక్కశెట్టి నర్సయ్య, […]

Read More
విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు

విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు

సారథి న్యూస్, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పాఠశాల విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని, ఇందుకోసం దూరదర్శన్ ను వినియోగించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేయాలని అధికారులను ఆదేశించింది. బుధవారం సీఎం కె.చంద్రశేఖర్​రావు అధ్యక్షతన సమావేశమైన కేబినెట్​ పలు అంశాలపై చర్చించింది. అన్ని ప్రవేశ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ రూపొందించాలని ఆదేశించింది. డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహణపై కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలని నిర్ణయించింది.టీఎస్ బీపాస్ పాలసీకి […]

Read More
ప్రజలకు పోలీసే మంచి స్నేహితుడు

ప్రజలకు పోలీసే మంచి స్నేహితుడు

సారథి న్యూస్​, హైదరాబాద్​: ప్రజలకు పోలీసే మంచి స్నేహితుడని తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్విట్టర్​ ద్వారా ఫ్రెండ్స్​షిప్​ డే ప్రాముఖ్యతను చెప్పారు. ‘ప్రజల ప్రతి అవసరంలోనూ స్పందించే వాడు, ప్రజలకు భద్రత, రక్షణ కల్పించేవాడు, అనునిత్యం ప్రజల క్షేమం గురించి ఆలోచించేవాడు పోలీసును మించిన మరో స్నేహితుడు లేడు. చట్టానికి, సమాజానికి కట్టుబడి ఉండే ప్రతి ఒక్కరికీ పోలీసుల కంటే మంచి స్నేహితుడు ఉండబోరు..’ అని అన్నారు. […]

Read More